trevor bayliss england coach
-
భారత్‌తో టెస్ట్ సిరీస్: ఇంగ్లండ్‌కు షాక్?
భారత్‌తో జరగబోయే కీలక టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కుడి భుజానికి గాయం కారణంగా ఆరు వారాల పాటు ఆటకు దూరం కాబోతున్నాడు. దీంతో ఆగస్టు1న టీమిండియాతో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు అండర్సన్ అందుబాటులో ఉండేది అనుమానమే. ఇక ఈ స్టార్ బౌలర్ టెస్ట్ సిరీస్‌కు దూరమైతే ఆతిథ్య జట్టు బౌలింగ్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. కాగా అండర్సన్ గాయంపై ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ స్పందిస్తూ.. అండర్సన్‌కు అయింది స్వల్ప గాయమే అని, టీమిండియాతో జరగబోయే కీలక టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రయోగాలు చేయకూడదనే ఉద్దేశంతోనే జిమ్మీకి విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇంగ్లండ్ జట్టు అండర్సన్‌పై అతిగా ఆధారపడుతోందని, అతనిపై బౌలింగ్ భారం ఎక్కువగా పడుతోందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో 223.3 ఓవర్లు బౌలింగ్ చేశాడంటే ఇంగ్లండ్ జట్టు ఈ స్టార్ బౌలర్‌పై ఎంతలా ఆధారపడుతుందో అర్థమవుతోంది. ఇక 2016లోనూ కుడి భుజానికే గాయం కావడంతో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు అండర్సన్ దూరమైన విషయం తెలిసిందే. -
టీ 20 ఫార్మాట్‌పై క్రికెట్ కోచ్ అసహనం
ఆక్లాండ్: గత కొన్నేళ్లుగా టీ 20 ఫార్మాట్ క్రికెట్ ప్రపంచాన్ని అలరిస్తుంటే, ఇంగ్లండ్ క్రికెట్ ప్రధాన కోచ్ ట్రేవర్ బేలీస్ మాత్రం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. అసలు అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు అనేవి దాదాపు అనవసరమనే అర్ధం వచ్చేలా ధ్వజమెత్తాడు. ఆటగాళ్లకు, కోచ్‌లకు అదనపు భారంగా మారిపోతున్న టీ 20 మ్యాచ్‌లను అంతర్జాతీయ షెడ్యూల్ నుంచి తొలగిస్తే మంచిదంటూ క్రికెట్ పరిపాలకులు ఉచిత సలహా పారేశాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత బెయిలీస్ మాట్లాడుతూ.. ట్వంటీ 20 ఫార్మాట్‌ను ఫ్రాంచైజీల గేమ్‌గా చూడాలన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) మాదిరి దేశవాళీ మ్యాచ్‌లకే టీ 20 క్రికెట్‌ను పరిమితం చేయాలన్నాడు. 'నేనైతే అంతర్జాతీయ టీ 20 గేమ్ ఆడను. అదొక ఫ్రాంచైజీ గేమ్. దాన్ని అలా చూస్తేనే మంచిది. ఒక క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఇది క్రికెటర్లకు అదనపు భారం. టెస్టు, వన్డే, టీ 20 గేమ్‌లను మేనేజ్ చేసుకుంటూ ఆడటం చాలా కష్టం. ఆటగాళ్లకే కాదు.. కోచ్‌లకు కూడా ఇబ్బందికరమే. అంతర్జాతీయ మ్యాచ్‌లను బాగా తగ్గించండి. కేవలం టీ 20 వరల్డ్ కప్‌కు ఆరు నెలల ముందే టీ 20 గేమ్‌లు ఆడిస్తే మంచిది. ఒక టీ 20 వరల్డ్ కప్‌ను ఎప్పుడూ నిర్వహించినా దానికి ముందు మాత్రమే టీ 20 మ్యాచ్‌లు నిర్వహించండి. దాంతో క్రికెటర్లకు భారం తగ్గినట్లు అవుతుంది' అని బెయిలీస్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్
లండన్: ఇంగ్లండ్ జట్టు కొత్త కోచ్‌గా ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆయన వచ్చే నెలలో బాధ్యతలు తీసుకుంటారు. జూలైలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ నుంచి బేలిస్ పని ప్రారంభిస్తారు. ఈ పదవికి మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ పోటీ పడినా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం 52 ఏళ్ల బేలిస్ వైపు మొగ్గు చూపింది. ఆసీస్‌కు చెందిన తను ప్రస్తుతం న్యూసౌత్ వేల్స్‌కు, బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.