triangular fighting
-
పాత, కొత్త కలయిక
న్యూఢిల్లీ: 22 ఏళ్లుగా అధికారాన్ని అందుకోవాలన్న ఆరాటంలో బీజేపీ.. హ్యాట్రిక్ విజయాల్ని సాధించి కూడా పోరాటం చేయలేని స్థితిలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డును నమ్ముకుంటూ ముందుకు సాగుతున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థులే కీలకంగా మారారు. కేజ్రీవాల్ సర్కార్‌పై వ్యతిరేకత అంతగా లేదు. అందుకే ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ బలమైన అభ్యర్థులపైనే ఆశలు పెట్టుకుంది. మూడు పార్టీలు కూడా అనుభవానికి, కొత్త ముఖాలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఆఖరి నిమిషంలో గోడ దూకుడు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో ఎవరు ఏ పార్టీ అభ్యర్థులోనన్న గందరగోళం కూడా నెలకొంది. హోరాహోరీ... చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఆప్ నుంచి కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్న అల్కా లంబా పోటీపడుతుంటే, కాంగ్రెస్ నుంచి ఆప్‌లోకి జంప్ చేసిన అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రహ్లాద్ సింగ్ స్వాహ్నే బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున మాజీ కౌన్సిలర్ సుమన్ కుమార్ గుప్తా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో హోరాహోరి పోరాటం నెలకొందని కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా స్వయంగా అంగీకరించారు. ► ద్వారకాలో కూడా ఆప్ రెబెల్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉంటే, ఆప్ తరఫున గత వారంలోనే కాంగ్రెస్ నుంచి వచ్చిన వినయ్ మిశ్రా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌లో అత్యంత పేరున్న మహాబల్ మిశ్రా కుమారుడే వినయ్‌మిశ్రా. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్‌పుత్ అంతగా ప్రముఖుడు కాదు. ► ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా కుమార్తె శివానీ చోప్రా ఆప్ అభ్యర్థి అతిషిపై కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ► గాంధీనగర్‌లో బీజేపీ తరఫున ఆప్ నుంచి పార్టీ ఫిరాయించిన అనిల్ బాజ్‌పాయ్ రంగంలో ఉంటే, కాంగ్రెస్ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆప్ నవీన్ చౌదరి అనే కొత్త నేతకు టిక్కెట్ ఇచ్చింది. ► సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు అత్యధికంగా జరిగిన సీలమ్‌పూర్‌లో కాంగ్రెస్ దిగ్గజం మాట్నీ అహ్మద్, ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహ్మాన్‌ను ఎదుర్కొంటున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ పూర్వంచలి కార్డును బయటకి తీసి కౌశల్ మిశ్రాను బరిలో దింపింది. కాంగ్రెస్‌కు కాస్తయినా కలిసొస్తుందా? అభ్యర్థుల ఎంపిక అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్‌కే కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అభ్యర్థి బలం, సీఏఏ వ్యతిరేక నినాదాలతో ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఆప్ ఓట్లను భారీగా చీలుస్తుందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ రాయ్ అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత పథకాలు, సుపరిపాలన, పథకాల కొనసాగింపు కోసం ఇచ్చే గ్యారంటీ కార్డులనే నమ్ముకుంది. అయితే ఆ పార్టీ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టకపోవడంతో ముస్లిం సామాజిక వర్గంలో వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్ రాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యతిరేకత ఆప్ విజయావకాశాల్ని దెబ్బ కొట్టలేకపోవచ్చునని ఆయన అంటున్నారు. సీలమ్పూర్, ఓఖ్లా, మాతియా మహల్, బల్లిమారన్, ముస్తాఫాబాద్ నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం అధికం. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థుల బలం ఏ పార్టీకి కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. ఈ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ చాందినీ చౌక్, ద్వారక, గాంధీనగర్, సంగమ్ విహార్, కల్కాజీ, గ్రేటర్ కైలాశ్, కృష్ణా నగర్, మంగోల్‌పురి -
చండీగఢ్‌లో త్రిముఖ పోటీ
పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ లోక్‌సభ స్థానానికి చివరిదశలో మే 19న పోలింగ్ జరగనుంది. ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రసిద్ధ నటుడు అనుపమ్ ఖేర్ భార్య, ప్రముఖ నటి, టీవీలో ప్రముఖ సంగీత కార్యక్రమాలెన్నింటికో వ్యాఖ్యాతగా ఉన్న కిరణ్ ఖేర్ ఈసారి కూడా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. నాలుగుసార్లు లోక్‌సభకి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వపన్ కుమార్ బన్సాల్‌పై కిరణ్ ఖేర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చండీగఢ్ లోక్‌సభ స్థానాన్ని మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ 1991, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. 2014లో కిరణ్ ఖేర్ 42.2 శాతం ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1996లో బీజేపీ నుంచి సత్యపాల్ జైన్ ఈ స్థానంలో గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్, బీజేపీలకు తోడు గత ఎన్నికల్లో కిరణ్ ఖేర్ గెలుపుకోసం కీలకంగా పనిచేసిన హర్మోహన్ ధవన్ ఈసారి ఆమ్ ఆద్మీ తరఫున పోటీచేస్తున్నారు. హర్మోహన్ ధవన్ ఈసారి ఓట్లు చీలుస్తారనే భయంలో కాంగ్రెస్ ఉంది. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకన్నా ఆప్ అభ్యర్థిపైనే ఆశలు పెట్టుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే నాలుగు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీలేదని బీజేపీ విమర్శిస్తోంది. స్వచ్ఛత, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ వల్ల ఒరిగిందేమీ లేదని కిరణ్ ఖేర్ ఆరోపణ. అయితే కాంగ్రెస్ అభ్యర్థి బన్సాల్ మాత్రం ప్లాన్డ్ సిటీ అయిన చండీగఢ్‌ని స్వచ్ఛత ర్యాంకింగ్‌లో 3వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజార్చిన ఘనత బీజేపీదేనని తిరుగుదాడి చేస్తున్నారు. ఐదేళ్ల నా పాలన చూడండి, 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని పోల్చుకుని ఓటెయ్యండని కిరణ్ ఖేర్ ప్రజల్లోకి వెళుతున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు రాబోయే ఐదేళ్ళ ఎజెండాని ముందుగానే ప్రకటించిన కిరణ్ ఖేర్ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌గా మారుస్తాననీ, సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తాననీ అంటున్నారు. చండీగఢ్‌ని సిలికాన్ వ్యాలీప్రమాణంగా పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తానంటోన్న కిరణ్‌ఖేర్ ఈసారి గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు ఈ మూడు పార్టీల్లో ఎవరిని ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. -
జనరల్ వార్డుల్లో త్రిముఖ పోరు
వికారాబాద్ , న్యూస్‌లైన్: రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు ఎవరికి ఓటేస్తారు అనే విషయమై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. 28 వార్డుల్లో 17వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 వార్డుల్లో బరిలో ఉన్న 120 మంది అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ రాజకీయ నేతలను సంప్రదించి వ్యూహాలు రచిస్తున్నారు. మొన్నటి వరకు రెబల్స్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు గడువు ముగియడంతో ఇక ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. పోటీదారుల ఎత్తులను తెలుసుకునేందుకు అభ్యర్థులు ఒకరిపై మరొకరు షాడోను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. త్రిముఖ పోరు.. పట్టణంలో ముఖ్యంగా 3, 4, 10, 12, 24 వార్డుల్లో నిల్చున్న అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మూడవ వార్డులో టీడీపీ అభ్యర్థి ఊరడి ఆంజనేయులు, ఎంఐఎం నుంచి హమీరుద్దీన్, కాంగ్రెస్ నుంచి మేక చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి వర్కల నర్సింహులు బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖపోరు నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ వార్డులో టీఆర్ఎస్ నుంచి శుభప్రద్‌పటేల్, కాంగ్రెస్ నుంచి ఎల్.లక్ష్మీకాంత్‌రెడ్డి, సీపీఎం నుంచి మహీపాల్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా హెచ్.హరికృష్ణ బరిలో ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఇద్దరి మధ్యనే గెలుపు కోసం పోటీ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే 10వార్డులో కాంగ్రెస్ నుంచి మధుకర్(సూర్య గ్యాస్), టీఆర్ఎస్ నుంచి ఎండీ జమీర్, టీడీపీ నుంచి సి.రామస్వామి, ఎంఐఎం నుంచి అతిక్‌పాషా బరిలో ఉండగా త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 12వ వార్డులో కాంగ్రెస్ నుంచి వి.సత్యనారాయణ, టీడీపీ నుంచి సి.అనంత్‌రెడ్డి, ఎంఐఎం నుంచి ఫైయాజ్‌ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్‌మోహన్ బరిలో ఉండగా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. 24 వార్డులో టీఆర్ఎస్ నుంచి కె.విజయ్‌కుమార్, టీడీపీ నుంచి సి.రమేశ్‌కుమార్, కాంగ్రె స్ నుంచి సుధాకర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా ఎన్. అంబిక, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల్లోని ప్రతి ఒక్కరి ఇంటికి వెలుతూ తనకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. తనను గెలిపిస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటూ, వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీల వర్షం గుప్పిస్తున్నారు.