tribal girls
-
బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. మరీ ఇంత దారుణం చేశాడా?
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటూ ట్విటర్లో ఓ పోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. భారత్‌లో అమాయక గిరిజన బాలికలపై వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను తన సంస్థ ( బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్) తరపున అనధికారికంగా నిర్వహించారని , వాటికి పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చారంటూ గ్రేట్‌గేమ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం విడుదల చేసింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి 'అరెస్ట్ బిల్ గేట్స్' అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విటర్లో నెటిజన్ల పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది. మెలిండా గేట్స్‌తో విడాకుల వ్యవహారం, మైక్రోసాఫ్ట్‌లోని ఒక మహిళా ఉద్యోగితో అతని అక్రమ సంబంధంపై వివాదంతో పాటు ప్రస్తుతం తాజా ఆరోపణలు చూస్తుంటే బిల్ గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గ్రేట్‌గేమ్ ఇండియా రాసిన ప్రత్యేక కథనంలో.. 2009లో తెలంగాణ సహా నాగాలాండ్‌లోని గిరిజన బాలికలపైనా అనాధికారంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. 14 వేల మంది కోయ గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో పొందుపరిచింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపినట్లు తెలిపింది. ఆ వ్యాక్సిన్ హ్యూమన్పాపిలోమా వైరస్‌ను నివారించడానికి తయారు చేసింది. అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్న ఎన్జీఓ సంస్థ ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను, పేదరికంలో ఉన్న వారినే ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లా పలువురు గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవల వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. This is the untold story of how @BillGates funded NGO PATH killed tribal girls in India in unauthorised clinical trials and got away with it. #ArrestBillGates https://t.co/yYqCRZ4Ah3 — Tribal Army (@TribalArmy) May 29, 2021 He is a monster and enemy of humanity...He must be stopped for good.#ArrestBillGates #ArrestBillGates#ArrestBillGates pic.twitter.com/sXyaTxV9is — Suraj Samrat 💙 (@samratsurajINC) May 29, 2021 చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
స్ఫూర్తిదాయక ప్రయాణం..
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో కనీస వసతులు కూడా లేని చోట హాకీలో శిక్షణ పొందిన 9 మంది గిరిజన బాలికలు జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. 14– 17 ఏళ్ల వయసున్న ఈ బాలికలకు ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది నాలుగేళ్ల క్రితం నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అక్కడ మైదానం లేకపోవడంతో ఓ హెలిప్యాడ్ స్థలంలోనే గిరిజన బాలికలు హాకీలో శిక్షణ పొందారు. ఆటలో రాటుదేలారు. వీరిలో 9 మంది సబ్–జూనియర్, జూనియర్ జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారని ఐటీబీపీ అధికారులు తెలిపారు. మంచి వసతులు కల్పించి, సరైన శిక్షణ ఇస్తే గిరిజన బాలికలు సైతం అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ‘‘హాకీ మన జాతీయ క్రీడ అని పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే, 2016 దాకా ఆ ఆట గురించి మాకేమీ తెలియదు. ఐటీబీపీ అధికారులు చెప్పిన తర్వాతే తెలుసుకున్నాం. ఇది మొత్తం అటవీ ప్రాంతం. మైదానం లేకపోవడంతో మర్దపాల్ పోలీసు క్యాంప్ సమీపంలోని హెలిప్యాడ్‌లో ప్రాక్టీస్ చేశాం. మైదానం ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నాం’’అని సులోచనా నేతం అనే బాలిక పేర్కొన్నారు. (రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..) -
ఆదివాసీ బాలికలపై అకృత్యాలు..
వారంతా కల్లాకపటం తెలియని వారు. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు కలిగి, వాతావరణ కాలుష్యం లేని నివాసం వారిది. రేయనక..పగలనక.. రాయనక..రప్పనక.. కొండకోనల్లో క్రూరమృగాల మధ్య సంచరిస్తూ జీవనయానం సాగిస్తారు. అడవుల్లో క్రూరమృగాల బారి నుంచి వారిని వారు ఎలాగోలా రక్షించుకోగలుగుతున్నారు. కానీ జనారణ్యంలో మాత్రం మనుషుల ముసుగు వేసుకున్న మృగాళ్ల అకృత్యాలను ఎదుర్కోలేక మగ్గిపోతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని పాలకులు ప్రగల్భాలు పలకడం మాని..ఆదివాసీ ప్రాంతాల్లో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వంచన, అకృత్యాలను గమనించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఒడిశా, బరంపురం: రాజ్యాలు అంతరించాయి. రాజుల పాలన కాలం పోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజా పత్రినిధులే పాలకులు అవుతున్నారు. భారత రాజ్యంగంలో గిరి పుత్రుల రక్షణ, హక్కుల కోసం ఎన్నో చట్ట సవరణలు జరిగాయి. కానీ ఆదివాసీల బతుకులు మాత్రం అంధకారంలోనే ఉన్నట్లు స్పష్టంగా తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొందమాల్ జిల్లాలో అదివాసీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలే ఇందుకు సాక్ష్యాలు నిలుస్తున్నాయి. చట్టాలు చేయడంతోనే సరికాదు. వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటుంది. అది పటిష్టంగా అమలు జరగడం లేదనడానికి కొందమాల్ జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని పలు ఎసీ, ఎస్టీ సంఘాలు అరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని కొందమాల్ జిల్లాలో రోజు రోజుకు కామాంధుల అకృత్యాల వల్ల అడవి బిడ్డలైన ఆదివాసీ బాలికలు వంచన, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు బలవుతున్నారు. ఈ సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వ అధికారులు, బాలాశ్రమ పాఠశాల యాజమన్యాల దురహంకార కామాంధుల చర్యలకు అభం శుభం తెలియని అమాయక అదివాసీ బాలికలు గర్భవతులై బలవుతున్న సంఘటనలు కొందమాల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు గడిచిన వారం రోజుల్లో జిల్లాలో గల దరింగబడి పోలీస్‌స్టేషన్ పరిధి కిరుబడి ఆదివాసీ బాలికల ఆశ్రమంలో బాలిక గర్భం దాల్చి అపై ఆశ్రమంలో ప్రసవించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా అక్కడికి వారం రోజుల్లో జిల్లాలోని జి.ఉదయగిరిలో గల ఆదివాసీ బాలా శ్రమంలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసీ బాలిక గర్భం దాల్చి జి.ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. మెరుగైన చికిత్స కోసం ఆ బాలికను పుల్బణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక ప్రసవించిన శిశువు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం. రైకియాలో పిల్లలను ఎత్తుకున్న ఆదివాసీ యువతులు అవయవ మార్పులపై అవగాహన లేని ఆదివాసీలు రాష్ట్రంలో నూటికి 98 శాతం మంది ఆదివాసీలు నివసించేది కొందమాల్ జిల్లాలోనే. ‘కొందొ’ అనగా ‘ఆదివాసీలు’ మాలొఅనగా ‘ఆరణ్యం’. కొందమాల్ అంటే ‘ఆదివాసీల ఆరణ్యం’ అని అర్థం. కొందమాల్ జిల్లాలో నూటికి 98 శాతం నివసించే ఆదివాసీ ప్రజల సంతానమైన బాలికలకు యుక్త వయసు వస్తున్న సమయంలో వారి శరీరంలో వస్తున్న అవయవాల మార్పులపై అందోళన చేందుతున్నట్లు అటవీ పరిశోధక నిపుణులు తెలియజేస్తున్నరు. ఈ శరీర మార్పులపై వారి తల్లులకు కూడా ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారి మనసులో మరింత అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీ బాలికలు యుక్త వయసులో అడుగు పెడుతున్న సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులపై పిల్లలకు సరైన రీతిలో గైడ్ చేయవలసిన వారి తల్లులకే అవగాహన లేక పోవడం వల్ల ఆదివాసీ బాలికలు యుక్త వయసు వస్తున్న సమయంలో శరీరంలో వస్తున్న మార్పులతో క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారు. అదివాసీ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదివాసీ బాలాశ్రమ పాఠశాలల్లో వందలాది మంది అదివాసీ బాలికలు చదువులు సాగిస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న బాలికలకు యుక్త వయసులో వస్తున్న శరీర మార్పులపై అవగాహన లేక పోవడంతో ఇదే అదునుగా ని అమాయక ఆదివాసీ బాలికలకు మాయమాటలు చెప్పి కామాంధులు వారి పబ్బం గడుపుకుంటున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు గురైతే మరి కొంతమంది వంచనకు బలి అవుతున్నారు. ఆదివాసీ బాలికలపై అటవికంగా కృరమృగాల్లా అధికారులు, ధనవంతులు పడి వారిని దోచుకుంటున్నారు. కొంత మంది ఆదివాసీ బాలికలు వంచన, లైంగికదాడులకు బలైనా కూడా అసలు ఏం జరిగిందో అవగాహన లేకపోవడం, కడుపులో పెరుగుతున్న గర్భాన్ని కూడా తెలుసుకోలేని దీనస్థితిలో గర్భవతులై బిడ్డలకు జన్మనిచ్చి మాతృమూర్తులవుతున్నారు. కామాంధుల దాహానికి బలైన కొంతమంది బాధిత ఆదివాసీలు తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి గిరిజనులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెడుతున్నట్లు బాధితులు అరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు కామాంధులకు కొమ్ముకాస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు పలు గిరిజన, ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బయటకు వెలుగు చూస్తున్న సంఘటనలు కొన్ని అయితే బయటకు రానివి పదుల సంఖ్యలో ఉన్నట్లు కొందమాల్ జిల్లా కుయి సమాజ్ అధ్యక్షుడు లంబోదర్ కార్ తెలియజేస్తున్నారు. పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారులు ధనవంతుల ఒత్తిళ్లు, వంచన, సీఅర్పీఎఫ్ జవాన్ల వేధింపులు భరించలేక అన్యాయం, అక్రమం, వేధింపులను ఎదిరించే శక్తి లేక ఆదివాసీ యువతీ యువకులు ఉద్యమ బాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొందమాల్ జిల్లాలో శిశు మరణాలు దేశంలో శిశు మరణాల్లో కొందమాల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ పరిశోధనలో రుజువైనట్లు తెలుస్తోంది. కొందమాల్ జిల్లాలో నివిసించే ఆదివాసీ బాలికలు యుక్త వయసు వచ్చే సమయంలో శరీరంలో వచ్చే మార్పులపై ఎటువంటి అవగాహన లేక పోవడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. చైతన్య శిబిరాలు అవసరం జిల్లా పాలనయంత్రంగం ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ బాలికలకు యుక్త వయసులో వచ్చే శరీర మార్పులపై శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అదివాసీలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దీని ఫలితంగా కొందమాల్ జిల్లాలో అదివాసీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టవచ్చని అలాగే ఉద్యమ బాటలో పయనిస్తున్న ఆదివాసీ యువతీ, యువకులను నియంత్రించ గలమని కుయి సమాజం అద్యక్షుడు లంబోదర్ నాయక్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఫోన్లు చోరీ చేశారంటూ దాష్టీకం
తోటపల్లిగూడూరు: ఫోన్లు చోరీ చేశారనే అనుమానంతో గిరిజన బాలికలను వాహనంలో తరలించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. నెల్లూరు బీవీనగర్‌కు చెందిన విద్యార్థులు సికిందర్బాబు, రామినేని హర్షచౌదరి, గట్టుపల్లి ప్రసాద్, కంచర్ల నవీన్, తాతిరెడ్డి రవీంద్ర గురువారం మధ్యాహ్నం వ్యాన్‌లో కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. సముద్ర స్నానాల అనంతరం సాయంత్రం వ్యాన్‌లో ఉంచిన నగదు, సెల్ఫోన్లు మాయమైనట్లు సదరు విద్యార్థులు గుర్తించారు. అదే సమయంలో ఆ వ్యాన్ సమీపంలో ఐదేళ్లలోపు ముగ్గురు గిరిజన బాలికలు ఆడుకుంటూ వారికి కనిపించారు. నగదు, సెల్‌ఫొన్లను బాలికలే దొంగతనం చేసి ఉంటారనే అనుమానంతో వారిని దబాయించారు. తాము చోరీ చేయలేదని గిరిజన బాలికలు ఎంత చెప్పినా వినకుండా ముగ్గురు చిన్నారులను భయపెట్టేందుకు తమ వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. అనంతరం సదరు విద్యార్థులు కోపంతో బాలికలను వ్యాన్‌లో నెల్లూరు తీసుకెళ్లే యత్నం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తోటపల్లిగూడూరు పోలీసులు కోడూరు – నరుకూరు మార్గంలోని చింతోపు సమీపంలో వ్యాన్‌ను అడ్డగించి విద్యార్థులతో పాటు గిరిజన బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికల తల్లి కత్తి కామేశ్వరి ఫిర్యాదు మేరకు విద్యార్థులపై కేసు నమోదు చేశామని ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు. -
బాలికలపై వల
లంబాడీ గిరిజన బాలికల జీవితాలతో మోసగాళ్లు చెలగాటమాడుతున్నారు. నిరక్షరాస్యులు, పదో తరగతి లోపు చదివిన మైనర్లే లక్ష్యంగా వల విసురుతున్నారు. వారి బారిన పడి అనేక మంది కష్టాలు అనుభవిస్తుండగా.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.. ఇంకొందరు కనిపించకుండా పోతున్నారు. నెక్కొండలో శుక్రవారం వెలుగు చూసిన కాంట్రాక్ట్ వివాహాల నేపథ్యంలో గతంలో జరిగిన గిరిజన బాలిక ల అదృశ్యం.. మృతి చెందిన ఘటనలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలోని నెక్కొండ మండలం గొట్లకొండ తండాలో ఇద్దరు బాలికలు, ఓ వివాహితను పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన 55 ఏళ్లు పైబడిన ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. ఆ వ్యక్తులతో వివాహానికి సిద్ధమైన ముగ్గురిలో ఇద్దరు పూర్తిగా నిరక్షరాస్యులు. ఒకరు ఆరో తరగతి వరకు చదువుకుని మధ్యలో ఆపేశారు. ఇందులో ఆరో తరగతి వరకు చదివిన ఒక బాలిక వివాహాన్ని వ్యతిరేకించిం తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం శుక్రవారం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు శనివారం తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజనులే లక్ష్యంగా.. మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రానైట్, మార్బుల్స్ వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో వయసు పైడిన వారు, స్థానికంగా పెళ్లి సంబంధాలు కుదరని వారు ఇక్కడి గిరిజన యువతులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంత కాలంగా> ఈ తరహా పద్ధతి చాపకింద నీరులా కొనసాగుతోంది. గిరిజన తండాలు, అందులో పేదరికంలో ఉండే నిరక్ష్యరాస్యులైన బాలికలను వివాహానికి ఒప్పిస్తున్నారు. ఇందుకుగాను గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పని చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి కొందరు పెళ్లికి సిద్ధపడుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నెక్కొండ సంఘటనే నిదర్శనం. పట్టపగలు పార్కులో ఈ తంతు జరగడంతో బాలిక వివాహానికి వ్యతిరేకించడం తేలికైంది. అదే తెలియని ప్రదేశంలో, అపరిచిత వ్యక్తుల సమక్షంలో జరిగితే ఆ బాలిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేది. వీడని మిస్టరీ నెక్కొండ ఘటన నేపథ్యంలో గతంలో ఇక్కడ జరిగిన రెండు దుర్ఘటనలకు కారణం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల పరిధిలో 2012, 2015 సంవత్సరాల్లో చోటుచేసుకున్న రెండు సంఘటనల్లో నలుగురు లంబాడా బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటీకీ ఆ మరణాలకు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలలేదు. చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట దగ్గర బోడగుట్ట తండా వద్ద ఇద్దరు బాలికలు బానోతు ప్రియాం క, బానోతు భూమిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు మరణించి శవాలు కుళ్లిపోయిన దశలో ఓ బాలిక మృతదేహాం తాలూకు పుర్రెను కుక్కలు గ్రామంలోకి తీసుకురావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. చనిపోయిన ఈ బాలికలను 2015 డిసెంబరు 27న గుర్తించారు. ఇద్దరిదీ పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామ శివారు కంబాలకుంట తండా. వీరు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకునే సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎవరు హత్య చేశారు.. బాలికలను అక్కడికి ఎవరు తీసుకెళ్లారు.. అక్కడం ఏం జరిగిందనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. నెక్కొండ మండలం మరిపెల్లి శివారు వాజ్యానాయ క్ తండాకు చెందిన బానోత్ అనూష, జాటోతు వనిత వయస్సు 16 ఏళ్లు. పదో తరగతి చదివే ఈ ఇద్దరు గిరిజన బాలికలు 2012 నవంబరు 14న కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో శవమై కనిపించారు. ఇంటర్మీడియట్ చదవే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు రెండు రోజుల తర్వాత రైల్వేట్రాక్ పక్కన శవాలుగా తేలారు. రైల్వే ట్రాక్ దగ్గరకు ఎందుకు వెళ్లారు.. ఎవరూ తీసుకెళ్లారు.. ఎటు ప్రయాణిస్తున్నారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసు చిక్కుముడి కూడా వీడిపోలేదు. -
ఇద్దరు గిరిజన యువతులపై గ్యాంగ్ రేప్?
► నిందితుల్లో టీడీపీ నేత, పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారులు ► కేసు లేకుండా పంచాయితీ చేసిన ఊరి పెద్దలు ► తాజంగి జాతరలో కలకలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, చింతపల్లి: విశాఖ జిల్లా ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో జాతర కు వచ్చిన ఇద్దరు ఆదివాసీ గిరిజన యువతులపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిందితుల్లో తెలుగుదేశం పార్టీ నేత(ఎంపీటీసీ సభ్యుడు) కుమారుడు, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఉండటంతో ఊరి పెద్దలు కేసు లేకుండా పంచాయితీ చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజంగిలో ఈ నెల 18 నుంచి 20 వరకు పోతు రాజుబాబుల జాతర మహోత్సవం నిర్వహిం చారు. శనివారం చివరిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక నర్సీపట్నం నుంచి కూడా పెద్దసంఖ్యలో ప్రజలు జాతరకు వచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం కురవడంతో జాతర సాంస్కృతిక కార్యక్రమా లకు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో జాతరకు వచ్చిన లంబసింగి సమీప గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు దగ్గరలోని పాఠశాల భవనంలో తలదాచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి కొడుకు, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు, మరో ఐదుగురు యువకులు ఆ యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన యువతుల బంధువులపై దాడికి పాల్పడ్డారు. వీరి చేతిలో దెబ్బలు తిన్న యువతుల బంధువులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఏడుగురు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత పంచాయితీ ఇంతలో పట్టుబడ్డ నిందితుల్లో తమ కొడుకు ఉండటంతో టీడీపీ నేత రంగంలోకి దిగాడు. గ్రామ పెద్దలతో మాట్లాడి పంచాయితీ చేసుకున్నాడు. బాధిత యువతులను వాహనంలో వారి గ్రామానికి పంపించి వేశారు. పోలీసులకు ఫిర్యాదులు, ఎటువంటి కేసులు లేకుండా ఇద్దరు యువతులకూ కలిపి రూ.50 వేలు ముట్టజెప్పాలని పంచాయితీలో నిర్ణయించారు. అనంతరం ఏడుగురు యువకులను మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. నిందితుల్లో టీడీపీ నేత, పోలీస్ కానిస్టేబుల్ కొడుకులు ఉండటంతో గ్రామ పెద్దలు కాని, పంచాయతీ చేసిన పెద్ద మనుషులు కాని ఎవరూ నోరు మెదపడం లేదు.. ఈ విషయమై చింతపల్లి ఎస్ఐ రమేష్‌ను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు గాని సమాచారం గాని అందలేదని తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వద్ద ప్రస్తావించగా..ఎటువంటి సమాచారం లేదని, విచారణ చేసి వాస్తవమని తేలితే నిందితులతో పాటు పంచాయతీ చేసిన పెద్దలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అత్యాచారాలు..అఘాయిత్యాలు
కొందమాల్ జిల్లాలో ఆదివాసీ బాలికల పరిస్థితి దయనీయంగా ఉంది.. కౌమార దశలో శారీరక మార్పుల గురించి ఆదివాసీ బాలిలకు అవ గాహన లేకపోవడాన్ని కామాంధులు అవకాశంగా తీసుకుంటున్నారు.. ఏం జరిగిందో తెలుసుకునేలోగా బాలికలు గర్భం దాలుస్తున్నారు.. ఆడుకునే వయసులోనే తల్లులు కావడంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదివాసీ బాలికలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నవారిలో ధనమదాంధులు, అధికారులు ఉన్నారు. బరంపురం : కొందమాల్ జిల్లాలోని పలు కన్యాశ్రమాల్లో పద్నాలుగేళ్ల బాలికలు గర్భవతులు కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితుల్లో కొందరు యువతులపై లైంగిక దాడి జరిగింది. కానీ ఏం జరిగిందో, ఎవరు లైంగిక దాడికి పాల్పడ్డారో చెప్పలేని స్థితిలో బాలికలు ఉన్నారు. లైంగిక దాడి ఫలితంగా తాము గర్భం దాల్చిన విషయం కూడా తెలియకపోవడంతో బాలికలు అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే గర్భవతులైన బాలికలు మృతి చెందుతున్నారు. అండగా ఉండని పాలకులు ఆదివాసీల అమాయకత్వమే బాలికల పాలిట శాపమైంది. లైంగిక దాడికి గురైన బాలికల్లో ఎక్కువ మంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల బాధిత గిరిజనులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్రహింసల పాల్జేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాడులకు పాల్పడే కామాంధులకు, రాజకీయ నాయకులకు అటవీ, పోలీసు అధికారులు మద్దతుగా నిలుస్తున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లూ... ఆదివాసీ గ్రామాల్లో యువతులు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారని తెలియడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల కిందట దరింగబడి బ్లాక్పరిధిలోని సిమన్బడి ఆదివాసీ గ్రామంలో ముగ్గురు యువతులపై సీఆర్పీఎఫ్ జవాన్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొందమాల్ జిల్లా రైకియా బ్లాక్ పరిధిలోని దాసింగబడి గ్రామ ఆదివాసీ బాలికపై సీఆర్పీఎఫ్ జవాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు జవానును హత్య చేసినట్లు తెలిసింది. ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఈ ఘటనను అధికారులు కప్పిపుచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అవగాహన పెరగాలి దేశంలో శిశు మరణాల్లో కొందమాల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై బాలికలకు అవగాహన ఉండకపోవడం కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారికి అవగాహన కల్పించాల్సి ఉంది. కౌమార దశలో వచ్చే శారీరక మార్పులపై వివరించేందుకు గిరిజన గూడలకు ఆరోగ్య కల్యాణి సమితి, అంగన్వాడీ కార్యకర్తలు వెళుతున్నారని జిల్లా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. గిరిజన గూడలకు వారు వెళ్లినపుడు ఆదివాసీ మహిళలు పనులకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఆదివాసీ బాలికల రక్షణకు చర్యలు ఆదివాసీల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం పలు చట్టాలు రూపొందించింది. బిజూ కొందమాల్ జిల్లా పథకం పేరుతో ప్రత్యేక పథకాన్ని కొందమాల్ జిల్లాలో అమలు చేస్తోంది. ఆదివాసీ బాలికల కోసం ప్రత్యేక కన్యాశ్రమాలు ఏర్పాటు చేశాం. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా కొన్ని చోట్ల ఆదివాసీ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న మాట వాస్తవం. దీనిపై క్యాబినెట్లో చర్చించి కొందమాల్ జిల్లాలో బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. -ఉషారాణి, రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరూ పట్టించుకోవడం లేదు దరింగబడి సమితి సిమన్బడి ఆదివాసీ గ్రామ ంలో మౌలిక సౌకర్యాలు లేవు. తాగేందుకు నీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఆదివాసీ బాలికలపై లైంగికదాడులను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. -సైరమా మల్లిక్, సిమన్బడి గ్రామం ఆందోళన చేసినా స్పందించడం లేదు కొందమాల్ జిల్లాలో యుక్తవయసకు వచ్చిన ఆదివాసీ బాలిక లు లైంగికదాడులకు గురవుతున్నారు. బాధిత బాలికలకు రక్షణ కల్పి ంచాలని, దోషులను శిక్షణించాలని కోరుతూ దక్షణాంచల్ ఆరీ ్డసీ, కలెక్టర్ కార్యాలయాల వద్ద పలుమార్లు ఆందోళన చేశాం. యుక్తవయసులో వచ్చే మార్పులపై ఆదివాసీ బాలికలకు వివరించేందుకు అవ గాహన శిబిరాలు ఏర్పా టు చేయాలని కోరాం. కానీ పాలకులు, అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణం. - ప్రమీలాదేవి త్రిపాఠి, అధ్యక్షురాలు, మహిళా కల్యాణ సమితి -
‘వారి హత్యకు మంత్రులదే బాధ్యత’
వరంగల్: నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినుల మరణానికి మంత్రులదే బాధ్యత అని విరసం నేత వరవరరావు ఆరోపించారు. నర్సంపేట మండలం భాంజిపేటలో గురువారం జరిగిన మావోయిస్టు నేతలు కుమారస్వామి, ఆయన భార్య సోనిల అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను ముక్కలుగా నరికి చంపేశారని..ఈ ఘోరానికి కారకులెవరనేది ఇప్పటి వరకు తెలియలేదని ఆయన తెలిపారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను అధికారులు, రాజకీయ నాయకులు అవసరాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు. వారి హత్యలకు రాష్ట్ర మంత్రులదే బాధ్యతని తెలిపారు. -
‘గిరిజన బాలికలది ముమ్మాటికీ హత్యే’
వరంగల్ జిల్లాలో గిరిజన బాలికల హత్యకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని వివిధ ప్రజా, మహిళ, కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కంబాలకుంట తండాకు చెందిన బానోతు భూమిక(14), ప్రియాంక(14)లది ఆత్మహత్యలా కనబడడం లేదని, అది ఆత్యాచారం జరిపి ముక్కలు ముక్కలుగా చేశారని దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన బాలికల ఘటన ఓ రాకెట్ అని ఆయన ఆరోపించారు. తాము చదువుకుంటున్న నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకని నవంబర్ 24న బయలుదేరి మార్గమధ్యలోనే మాయమయ్యారని ఆయన తెలిపారు. వారిని నిర్బంధించి అత్యాచారం జరిపి, ముక్కలుగా నరికి గుట్టల్లో విసిరేయడం, వారి అవయవాలను కుక్కలు పీక్కుతినడం దుర్మార్గమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో హాస్టల్ వార్డెన్, ఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు స్థానిక మంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెలేలు బాధ్యత వహించాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కులనిర్మూలన పోరాట సమితి ఉపాధ్యక్షులు బూరం అభినవ్, పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, చైతన్య మహిళ సంఘం నాయకురాలు జయ, కిష్టప్ప(డిటిఎఫ్), ట్రైబల్ జేఏసీ నాయకులు ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుకోవాలని ఉంది సారూ..
గొర్రెలకు కాపలాగా వెళుతున్న బాలికల ఆవేదన మెదక్ రూరల్: తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉందని గొర్రెలకు కాపలాగా వెళుతున్న మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన ఇరువురు గిరిజన బాలికలు అనిత, సంగీత వాపోతున్నారు. తమను పెద్దలు గతకొన్నిరోజులుగా చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాజ్‌పల్లి పంటపొలాల్లో జీవాలను మేపుతున్న ఆ బాలికలు సాక్షి ప్రతినిధి కంటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలనే ఉందన్నారు. తండాకు చెందిన లంబాడి హమ్యా లక్ష్మి దంపతులకు సంగీత ఒక్కతే కుమార్తె. ఆమె ప్రస్తుతం రాజ్‌పల్లి ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.సంగీత తండ్రి హమ్య ఇటీవల పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబం గడవటం కష్టంగా మారిందని, చేసేదిలేక తల్లి లక్ష్మి తన కూతురు చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపిస్తోంది. అయితే చదువంటే తనకు ప్రాణమని, ఆర్థిక ఇబ్బందువల్ల తన తల్లి చదువు మాన్పించిందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే చదువుకుంటానని చెబుతోంది. అలాగే ఇదేతండాకు చెందిన మంగ్యా, బీబ్లీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆఖరు సంతానం అనిత ప్రస్తుతం మెదక్‌లోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి తనను చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని అనిత పేర్కొంది. తమకు బాగా చదువుకోవాలని ఉందని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి సంగీత, అనిత తల్లి దండ్రులకు అవగాహన కల్పించి వారిని మళ్లీ బడికి పంపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గిరిజన బాలికలకు స్కూళ్లలో కరాటే శిక్షణ
గిరిజన బాలికలు తమకు ఎదురయ్యే ఆపదల నుంచి తమను తాము రక్షించుకోడానికి వీలుగా వారికి కరాటే శిక్షణ అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వాళ్లు చదువుకునే స్కూళ్లలోనే ఈ శిక్షణ ఇస్తారు. ముందుగా గిరిజన జనాభా ఎక్కువగా ఉండే నీలగిరి, నమక్కల్, సేలం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అసెంబ్లీలో తెలిపారు. 482 పాఠశాలల్లో చదువుతున్న 4,782 మంది అమ్మాయిలకు రూ. 14 లక్షల ఖర్చుతో ప్రాథమికంగా శిక్షణ ఇస్తారు. మరోవైపు, 2014-15 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా పరికరాల కొనుగోళ్లకు రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.