‘వారి హత్యకు మంత్రులదే బాధ్యత’
Published Thu, Jan 28 2016 2:10 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
వరంగల్: నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినుల మరణానికి మంత్రులదే బాధ్యత అని విరసం నేత వరవరరావు ఆరోపించారు. నర్సంపేట మండలం భాంజిపేటలో గురువారం జరిగిన మావోయిస్టు నేతలు కుమారస్వామి, ఆయన భార్య సోనిల అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను ముక్కలుగా నరికి చంపేశారని..ఈ ఘోరానికి కారకులెవరనేది ఇప్పటి వరకు తెలియలేదని ఆయన తెలిపారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను అధికారులు, రాజకీయ నాయకులు అవసరాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు. వారి హత్యలకు రాష్ట్ర మంత్రులదే బాధ్యతని తెలిపారు.
Advertisement
Advertisement