tribal welfare residential schools
-
విద్యార్ధినిపై హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులు
-
గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు
* జూన్‌లో కొమురం భీం ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ * నేడు బడి వయసు పిల్లల గుర్తింపునకు సర్వే సాక్షి, హైదరాబాద్: బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త విద్యార్థులను చేర్చుకునేందుకు జూన్ 15-20 తేదీల్లో ‘కొమురం భీం ఎడ్యుకేషన్ ఫెస్టివల్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కింద గిరిజన తల్లితండ్రులతో టీచర్ల సమావేశాలు, టీచర్లు, పిల్లలతో ర్యాలీలు, టీచర్లు, ఎన్జీవోలు ఇంటింటికీ వెళ్లి కొత్త విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం, బాలికల విద్యా దినోత్సవం వంటి వాటిని నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచాక గిరిజన పిల్లలను చేర్చుకునేందుకు, ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిం చేందుకు ఆయా కార్యక్రమాలు చేపట్టనుంది. అర్హులైన గిరిజన బాలబాలికల వంద శాతం ఎన్రోల్మెంట్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా గిరిజన ఆవాసాల్లో ఐదేళ్లకు పైబడిన బడిఈడు పిల్లలను గుర్తించేందుకు బుధవారం సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రైమరీ స్కూల్ టీచర్లంతా పాల్గొనేలా ఆదేశాలు జారీచేశారు. గిరిజన పిల్లలు స్కూళ్లలో చేరి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టేందుకు 6-14 ఏళ్ల వయసు వారి జాబితాను అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, గ్రామపెద్దల నుంచి తీసుకోనున్నారు. ముందుగా ఆయా పిల్లల వివరాలు, సమాచారాన్ని తీసుకుని వారిని స్కూళ్లలో చేర్పించేందుకు ఉపయోగించుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పిల్లల తల్లితండ్రులకు విద్యావశ్యకతను వివరించి, వారిని పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చొరవ తీసుకోవాలని నిర్దేశించింది. జూన్‌లో గిరిజన విద్యార్థులందరికీ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ అందించాలని, స్కూల్ యూనిఫారాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ... బడులకు దూరమైన విద్యార్థులను ముఖ్యంగా బాలికలను అన్ని కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాల్లో చేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ ఆదేశించింది. ముఖ్యంగా అమ్మాయిలను 10వ తరగతి వరకు చదివించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం గ్రామాల్లోని గిరిజన యువత, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించి గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్పించే విషయంలో తల్లితండ్రులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. విద్యా హక్కు చట్టంపై గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక బృందాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
విద్యార్థుల ఆరోగ్యానికి వందరోజుల ప్రణాళిక
ఏజెన్సీ ఆశ్రమాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్ట ల్ విద్యార్థుల ఆరోగ్యానికి వంద రోజుల ప్రణాళిక అమలుకు సిద్ధం కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. బు ధవారం తన క్యాంపు కార్యాలయంలో గిరిజన వి ద్యాలయాల్లో చేపట్టనున్న పలు కార్యక్రమాలపై స మీక్షించారు. పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై సంక్షేమ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఆశ్రమాల్లో తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బాలికల ఆశ్రమాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఏటీడబ్ల్యూఓలు రో జూ హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికను సాయంత్రానికే అందజేయాలన్నారు. ప్రతి ఆశ్రమానికి రూ.10 లక్ష లు చొప్పున నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇంజినీర్లతో చర్చించి మరుగుదొడ్లు, స్నానపుగదు లు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. విస్తారంగా మొక్కలు నాటాలన్నారు. ఆగస్టు10 నాటికి ఆశ్రమాలను తనిఖీ చేస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, ఉపాధి పథకం ఏపీడీలు ప్రసాద్, లచ్చన్న, నాగేశ్వరరావు, ఏటీడబ్ల్యూఓలు శాంతకుమారి, శ్రీనివాసరావు, శ్రీదేవి, సూర్యనారాయణ, కూడ వెంకటరమణ పాల్గొన్నారు. కీటకజనిత వ్యాధులపై అప్రమత్తం ఏజెన్సీలోని కీటక జనిత వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినయ్చం ద్ మండల ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. రెండో విడత వైద్యపరీక్షలు ఈ నెల 20 నుంచి ఏజెన్సీలో రెండో విడత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పీఓ ఆదేశించారు. ఆశ్రమాల్లో ప్రత్యేక వైద్యసేవలకు సంబంధించి వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. వైద్యులు, సిబ్బంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా అమలు చేయాలన్నారు. దోమల మందు పిచికారీ పనులు కూడా చేపట్టాలన్నారు. టి.బి రోగుల వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఏంహెచ్ఓ శ్యామల, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్నిమండలాల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు పాల్గొన్నారు.