విద్యార్థుల ఆరోగ్యానికి వందరోజుల ప్రణాళిక | One hundred days of the student health plan | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యానికి వందరోజుల ప్రణాళిక

Published Thu, Jul 17 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

One hundred days of the student health plan

  •     ఏజెన్సీ ఆశ్రమాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు
  •      ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్  
  • పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్ట ల్ విద్యార్థుల ఆరోగ్యానికి వంద రోజుల ప్రణాళిక అమలుకు సిద్ధం కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. బు ధవారం తన క్యాంపు కార్యాలయంలో గిరిజన వి ద్యాలయాల్లో చేపట్టనున్న పలు కార్యక్రమాలపై స మీక్షించారు. పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై సంక్షేమ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఆశ్రమాల్లో తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

    బాలికల ఆశ్రమాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఏటీడబ్ల్యూఓలు రో జూ హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికను సాయంత్రానికే అందజేయాలన్నారు. ప్రతి ఆశ్రమానికి రూ.10 లక్ష లు చొప్పున నిధులు అందుబాటులో ఉన్నాయని,  ఇంజినీర్లతో చర్చించి మరుగుదొడ్లు, స్నానపుగదు లు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. విస్తారంగా మొక్కలు నాటాలన్నారు. ఆగస్టు10 నాటికి ఆశ్రమాలను తనిఖీ చేస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, ఉపాధి పథకం ఏపీడీలు ప్రసాద్, లచ్చన్న, నాగేశ్వరరావు, ఏటీడబ్ల్యూఓలు శాంతకుమారి, శ్రీనివాసరావు, శ్రీదేవి, సూర్యనారాయణ, కూడ వెంకటరమణ పాల్గొన్నారు.
     
    కీటకజనిత వ్యాధులపై అప్రమత్తం

    ఏజెన్సీలోని కీటక జనిత వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినయ్‌చం ద్ మండల ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు.  సమస్యాత్మక గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు.
     
    రెండో విడత వైద్యపరీక్షలు
     
    ఈ నెల 20 నుంచి ఏజెన్సీలో రెండో విడత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పీఓ ఆదేశించారు. ఆశ్రమాల్లో ప్రత్యేక వైద్యసేవలకు సంబంధించి వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. వైద్యులు, సిబ్బంది  విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు.  స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా అమలు చేయాలన్నారు.   దోమల మందు పిచికారీ పనులు కూడా చేపట్టాలన్నారు. టి.బి రోగుల వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.   సమావేశంలో డీఏంహెచ్‌ఓ శ్యామల, ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్నిమండలాల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్‌ఓలు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement