tribalwelfare
-
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, పాడేరు: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కొయ్యూరులో 7వ తరగతిలో బాలురకు మూడు సీట్లు, బాలికలకు మూడు సీట్లు ఖాళీలున్నాయని, పాడేరులో 7వ తరగతిలో బాలురకు ఆరు సీట్లు ఖాళీలున్నాయన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణకు దగ్గరలోని గురుకుల పాఠశాల/కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022–23 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిభ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను అమలు చేస్తుందన్నారు. విశాఖలోని మారికవలస ప్రతిభ పాఠశాలలో 8వ తరగతిలో బాలికలకు 45 సీట్లు, విజయనగరం జిల్లా జోగంపేట ప్రతిభ పాఠశాలలో 8వ తరగతి(బాలురు)కు 45సీట్లు కేటాయించారన్నారు. అలాగే ప్రతిభా కళాశాలల్లో సీవోఈ, ఎస్‌వోఈ విభాగాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. మారికవలసలో బాలికలు, జోగంపేటలో బాలురు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, కేవలం గిరిజన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. 8వ తరగతి ప్రవేశాలకు గాను ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు వచ్చేనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశపరీక్షను పాడేరు గురుకుల పాఠశాల, అరకులోయ గురుకుల కళాశాలల్లో మే 29న నిర్వహిస్తామని పీవో వెల్లడించారు. (చదవండి: మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్) -
గిరిజన ప్రగతికి మాస్టర్‌ప్లాన్
పాడేరు: గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణపై భృహత్తర ప్రణాళికను రూపొందించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. పాడేరు సమగ్ర గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఆదివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గిరిజనుల సమస్యలు, అవసరాలు, చేపట్టవలసిన పథకాలపై ప్రజా ప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని తెలిపారు. ఏటా మంజూర య్యే నిధులతో అభివద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించేందుకు సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. మన్యంలో 36 మంది వైద్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని, ఏజñ న్సీలో స్థాయి పెరిగిన ఏరియా ఆస్పత్రులకు వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు కాలేదని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. ఏజెన్సీలోని ఈ ఆస్పత్రులకు ఐటీడీఏ పీఓను చైర్మన్‌గా నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. మలేరియా నిర్మూలనకు పైలెట్ ప్రాజెక్టుమలేరియా పూర్తి నిర్మూలన కోసం 20 గ్రామాలను ఎంపిక చేసి ఒక పైలెట్ ప్రాజెక్టు అమలు చేయబోతున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోనే ప్రజలందరికీ రక్తపరీక్షలు చేసి రాడికల్ ట్రీట్మెంట్ నిర్వహిస్తామన్నారు. ఒడిశా రాయగడలో మలేరియా కారక క్రిములను శాశ్వత నిర్మూలనకు ఈ విధానం విజయవంతమైందని తెలిపారు. మండల కేంద్రాల్లో పని చేసే అధికారులకు వసతి కోసం డార్మెటరీ నిర్మించనున్నట్లు చెప్పారు. కేజీబీవీల్లో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఎస్ఎస్ఏ పీడీని ఆదేశించారు. ఆయా పోస్టుల్లో తాజాగా నియమితులైన వారిని నియమించాలన్నారు. పాఠశాలల పునరుద్ధరణకు చర్యలుఏజెన్సీలో మూతపడిన పాఠశాలలన్నింటినీ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం లేకపోవడం సమస్య కాదని, నిర్లక్ష్యం వహిస్తే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోగస్ సర్టిఫికెట్లతో సీఆర్టీ ఉద్యోగాల్లో చేరిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీలో తాగునీటి సౌకర్యం లేని 424 ఆవాసాలు ఉన్నాయని, గత రెండేళ్లలో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ఏజెన్సీలో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు కాలేదని వెల్లడించారు. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని, ఎమ్మెల్యేలు ఇందుకు కషి చేయాలని కోరారు. పూర్తయిన తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడంలో విద్యుత్‌శాఖ అధికారుల జాప్యంపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. 3వ విడత అటవీ హక్కు పత్రాల పంపిణీ మార్చిలోగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ హరినారాయణన్, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జెడ్పీ వైస్ చైర్మన్ అప్పారావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఏజెన్సీ మండల ప్రాంత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.