గిరిజన ప్రగతికి మాస్టర్‌ప్లాన్
Published Sun, Jul 17 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
పాడేరు: గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణపై భృహత్తర ప్రణాళికను రూపొందించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. పాడేరు సమగ్ర గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఆదివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గిరిజనుల సమస్యలు, అవసరాలు, చేపట్టవలసిన పథకాలపై ప్రజా ప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని తెలిపారు. ఏటా మంజూర య్యే నిధులతో అభివద్ధి ప్రణాళికలను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించేందుకు సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. మన్యంలో 36 మంది వైద్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని, ఏజñ న్సీలో స్థాయి పెరిగిన ఏరియా ఆస్పత్రులకు వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు కాలేదని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. ఏజెన్సీలోని ఈ ఆస్పత్రులకు ఐటీడీఏ పీఓను చైర్మన్‌గా నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు.
మలేరియా నిర్మూలనకు పైలెట్ ప్రాజెక్టుమలేరియా పూర్తి నిర్మూలన కోసం 20 గ్రామాలను ఎంపిక చేసి ఒక పైలెట్ ప్రాజెక్టు అమలు చేయబోతున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోనే ప్రజలందరికీ రక్తపరీక్షలు చేసి రాడికల్ ట్రీట్‌మెంట్ నిర్వహిస్తామన్నారు. ఒడిశా రాయగడలో మలేరియా కారక క్రిములను శాశ్వత నిర్మూలనకు ఈ విధానం విజయవంతమైందని తెలిపారు. మండల కేంద్రాల్లో పని చేసే అధికారులకు వసతి కోసం డార్మెటరీ నిర్మించనున్నట్లు చెప్పారు. కేజీబీవీల్లో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఎస్‌ఎస్‌ఏ పీడీని ఆదేశించారు. ఆయా పోస్టుల్లో తాజాగా నియమితులైన వారిని నియమించాలన్నారు.
పాఠశాలల పునరుద్ధరణకు చర్యలుఏజెన్సీలో మూతపడిన పాఠశాలలన్నింటినీ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం లేకపోవడం సమస్య కాదని, నిర్లక్ష్యం వహిస్తే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోగస్ సర్టిఫికెట్లతో సీఆర్టీ ఉద్యోగాల్లో చేరిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీలో తాగునీటి సౌకర్యం లేని 424 ఆవాసాలు ఉన్నాయని, గత రెండేళ్లలో ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ఏజెన్సీలో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు కాలేదని వెల్లడించారు. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని, ఎమ్మెల్యేలు ఇందుకు కషి చేయాలని కోరారు. పూర్తయిన తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడంలో విద్యుత్‌శాఖ అధికారుల జాప్యంపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. 3వ విడత అటవీ హక్కు పత్రాల పంపిణీ మార్చిలోగా నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ హరినారాయణన్, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జెడ్పీ వైస్ చైర్మన్ అప్పారావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఏజెన్సీ మండల ప్రాంత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement