the tribunal
-
ఆప్షన్‌కు ఓకే
‘స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో మాకు అన్యాయం జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి నియమితులమై..అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి మాకు స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలి.’ అంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన జడ్పీ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ముంపు ప్రాంత ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎంచుకున్న దాన్నిబట్టే ముంపు బదిలీలు - ముంపు స్థానికత ఉన్న వారికీ అవకాశం - ట్రిబ్యునల్ తీర్పుతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు - రేపు గిరిజన సంక్షేమశాఖలో సర్దుబాటు భద్రాచలం :ఏపీలో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్ల మేరకే బదిలీలు జరగనున్నారు. బుధవారం నాడు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముంపు స్థానికత ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామని ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులందరికీ బదిలీల్లో అవకాశం కల్పించాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేయటంతో ఇక అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే బదిలీలు చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విలీన మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను జిల్లాలో సర్దుబాటు చేసేందుకు అంగీకరిస్తూ.. మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 130ని విడుదల చేసింది. కేవలం తెలంగాణ స్థానికత ఉన్న వారికే బదిలీల్లో అవకాశం కల్పించి, ముంపు స్థానికత ఉన్న వారిని అక్కడనే ఉంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల స్థానికత నిర్ధారణ కోసం సర్వీసు రిజిస్టర్లను తనిఖీ చేసి కేవలం తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల జాబితానే బదిలీల కోసం అధికారులు సిద్ధం చేశారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకునే ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్‌ను పూర్తి చేశారు. మరికొన్ని శాఖల్లో బదిలీలు.. జడ్పీ, గిరిజన సంక్షేమశాఖల పరిధిలోని ఉపాధ్యాయులు, రెవెన్యూశాఖ పరిధిలోని వీఆర్వోలకు మాత్రమే ఇంకా బదిలీలు చేయాల్సి ఉంది. అయితే స్థానికత మేరకు చేపట్టే బదిలీలతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖమ్మం జిల్లా ద్వారా నియమితులై.. అన్ని రకాల సంబంధ బాంధవ్యాలను తెలంగాణతోనే ఏర్పాటు చేసుకున్న తమకూ స్థానికతతో ముడిపెట్టకుండా బదిలీలకు అవకాశం కల్పించాలని జడ్పీ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదనలు విన్న ట్రిబ్యునల్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ముంపు మండలాల వాసులే అరుునా సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమాల్లో వారు కూడా పాల్గొన్నృదష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పును శిరసావహించేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే విలీన మండలాల్లోని అన్నిశాఖల వారికి ఆప్షన్ల మేరకే బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆప్షన్ల మేరకు బదిలీలు నిర్వహణకు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వటం హర్షనీయమని ముంపు ఉద్యోగుల ఫోరమ్ సమన్వయకర్త స్వరూప్‌కుమార్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిసింగ్రాథోడ్ పేర్కొన్నారు. రేపు ట్రైబల్ వెల్ఫేర్‌లో... గిరిజన సంక్షేమ శాఖలో గురువారం బదిలీలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశారు. స్థానికత మేరకే బదిలీల జాబితాను తయారు చేసి, జాబితాను ప్రకటించారు. కానీ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు వచ్చే ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున గురువారం జరగాల్సిన సర్దుబాటు బదిలీలను వాయిదా వేశారు. దీన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ నరోత్తమరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
సిబ్బంది విభజనకు రంగం సిద్ధం!
విధివిధానాలు రూపొందించిన ఎస్పీలు డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారమే ప్రక్రియ పోలీసుల్లో తీవ్ర ఆందోళన ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కొందరు గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. దీనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామక ృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటివరకూ ఆచితూచి అడుగులు వేయగా తాజా పరిణామంతో విభజన ప్రక్రియను వెంటనే చేపట్టి సమస్యకు తెరదించాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత సమస్యగా మారడం, నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అర్బన్ ఎస్పీ దీనిపై ద ృష్టి సారించారు. రూరల్ ఎస్పీ రామక ృష్ణ, ముఖ్య అధికారులతో చ ర్చించి విభజనకు విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు రావాలంటే రూరల్‌కు వెళ్లాలంటూ సుమారు 90 మంది కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను అర్బన్ ఇన్చార్జిగా ఉన్నపుడు రూరల్ ఎస్పీ రామక ృష్ణ రూరల్ బదిలీ చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లలో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సిబ్బంది కొరత వల్లే నేరాలను అదుపు చేయలేకపోతున్నామని పలువురు అధికారులు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, గతంలో డీజీపీ ఆమోదించిన జాబితా ప్రకారం చేపట్టాలని ఎస్పీలు నిర్ణరుుంచుకున్నారు. 2008లోనే అర్బన్, రూరల్ జిల్లాలుగా విడిపోగా ఇప్పటికీ సిబ్బంది విభజన జరగకపోవడంపై రాష్ట్ర డీజీపీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా వారి అంగీకారం తీసుకుని అటాచ్మెంట్లు ఇవ్వాలని ఎస్పీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఎస్పీలపై ఒత్తిళ్లకు యత్నాలు.. విభజన ప్రక్రియపై ఆందోళన చెందుతున్న పలువురు సిబ్బంది పోలీస్ అధికారుల సంఘంతో చర్చలు జరిపారు. కొందరు బుధవారం హైదరాబాద్ వెళ్లి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని తమ యూనియన్ల ద్వారా అక్కడి ఉన్నతాధికారులతో ఎస్పీలకు ఫోన్లు కూడా చేయించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా ఎస్పీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగదు.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విభజన ప్రక్రియ ఆగదని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. విభజనను నిబంధన ప్రకారం చేపడతామని, ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదన్నారు. రూరల్ జిల్లా నుంచి అర్బన్‌కు వచ్చేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నట్టు చెప్పారు. -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి విస్సన్నపేట : పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని పుట్రేలలో సోమవారం జరిగిన సీనియర్ కాంట్రాక్టర్ బొల్లారెడ్డి కోటిరెడ్డి పెదఖర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకెళితేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మించాల్సి ఉందన్నారు. ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీరు విడుదల చేస్తే రెండు ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని, ఈ విషయంలో ఆంధ్ర సీఎం చొరవచూపాలని కోరారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులకు ఎటుంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి మంచి పరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ-జగదల్పూర్ మధ్య నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో రుణమాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు ఎస్.వెంకటేశ్వరరావు, మట్టా దయాకర్, కృష్ణా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మోహనరెడ్డి, ఎన్.వీరారెడ్డి, దేశిరెడ్డి రాఘవరెడ్డి, నాయకులు ఓలేటి దుర్గారావు, శీలం నాగనర్శిరెడ్డి, కుటుంబరావు, కృష్ణారావు పాల్గొన్నారు.