
సిబ్బంది విభజనకు రంగం సిద్ధం!
విధివిధానాలు రూపొందించిన ఎస్పీలు
డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారమే ప్రక్రియ
పోలీసుల్లో తీవ్ర ఆందోళన
ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కొందరు
గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. దీనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్‌డీ రామక ృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటివరకూ ఆచితూచి అడుగులు వేయగా తాజా పరిణామంతో విభజన ప్రక్రియను వెంటనే చేపట్టి సమస్యకు తెరదించాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత సమస్యగా మారడం, నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అర్బన్ ఎస్పీ దీనిపై ద ృష్టి సారించారు. రూరల్ ఎస్పీ రామక ృష్ణ, ముఖ్య అధికారులతో చ ర్చించి విభజనకు విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు రావాలంటే రూరల్‌కు వెళ్లాలంటూ సుమారు 90 మంది కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను అర్బన్ ఇన్‌చార్జిగా ఉన్నపుడు రూరల్ ఎస్పీ రామక ృష్ణ రూరల్ బదిలీ చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సిబ్బంది కొరత వల్లే నేరాలను అదుపు చేయలేకపోతున్నామని పలువురు అధికారులు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, గతంలో డీజీపీ ఆమోదించిన జాబితా ప్రకారం చేపట్టాలని ఎస్పీలు నిర్ణరుుంచుకున్నారు. 2008లోనే అర్బన్, రూరల్ జిల్లాలుగా విడిపోగా ఇప్పటికీ సిబ్బంది విభజన జరగకపోవడంపై రాష్ట్ర డీజీపీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా వారి అంగీకారం తీసుకుని అటాచ్‌మెంట్‌లు ఇవ్వాలని ఎస్పీలు యోచిస్తున్నట్టు సమాచారం.
ఎస్పీలపై ఒత్తిళ్లకు యత్నాలు..
విభజన ప్రక్రియపై ఆందోళన చెందుతున్న పలువురు సిబ్బంది పోలీస్ అధికారుల సంఘంతో చర్చలు జరిపారు. కొందరు బుధవారం హైదరాబాద్ వెళ్లి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని తమ యూనియన్‌ల ద్వారా అక్కడి ఉన్నతాధికారులతో ఎస్పీలకు ఫోన్‌లు కూడా చేయించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా ఎస్పీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఎవరికీ అన్యాయం జరగదు..
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విభజన ప్రక్రియ ఆగదని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. విభజనను నిబంధన ప్రకారం చేపడతామని, ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదన్నారు. రూరల్ జిల్లా నుంచి అర్బన్‌కు వచ్చేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నట్టు చెప్పారు.