TRS Members
-
YSRCPలో చేరిన ఖమ్మంజిల్లా టీఆర్ఎస్ నేతలు
-
పార్టీ నేతలకు కేసీఆర్ క్లాసులు!
-
ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్‌సభ
* ప్రత్యేక హైకోర్టుపై టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య వాగ్వాదం * ‘కొందరి’ వల్లే విభజనలో తాత్సారమన్న టీఆర్ఎస్ సభ్యులు * తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు: కవిత * చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పేర్లు ప్రస్తావించిన జితేందర్‌రెడ్డి * టీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వెంకయ్యనాయుడు * ఇక్కడ లేనివారి పేర్లు ప్రస్తావించొద్దు.. రాజకీయం చేయొద్దని ఆగ్రహం * హైకోర్టు ఏర్పాటు కోసం బాబుకు లేఖ రాశామన్న సదానందగౌడ * చంద్రబాబు హైకోర్టుకు ఏర్పాట్లు చేశాకే తదుపరి చర్యలని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రత్యేక హైకోర్టు’ అంశంపై బుధవారం లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణలు.. టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల వాదోపవాదాలు, కేంద్ర మంత్రుల వివరణలతో కొద్దిసేపు తీవ్రస్థాయిలో గందరగోళం చోటుచేసుకుంది. హైకోర్టు విభజన జరుగకుండా కొందరు తాత్సారం చేయిస్తున్నారని, ‘వాళ్లు’ హైకోర్టు ద్వారా తెలంగాణను పాలించాలనుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఇది రాజకీయ నిర్ణయమని పేర్కొంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పేర్లను ప్రస్తావించారు. దీంతో టీడీపీ సభ్యులు లేచి టీఆర్ఎస్ సభ్యులతో వాదనకు దిగారు. మరోవైపు తొలుత హైకోర్టు విభజన అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ చివరలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేకహైకోర్టు అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా... స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఏఎస్ఆర్ నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్తా ప్రతాప్‌రెడ్డి ప్లకార్డులతో మౌన ప్రదర్శన ప్రారంభించారు. అందులో కొత్తేం లేదు: ప్రత్యేక హైకోర్టు అంశంపై సదానందగౌడ ప్రకటన తరువాత జితేందర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మంత్రి ప్రకటనలో కొత్త విషయమేం లేదు. అయితే మీడియాలో, పత్రికల్లోనే కాకుండా అందరూ చెప్పేదేంటంటే చంద్రబాబు, వెంకయ్యనాయుడు’’ అంటూ ప్రస్తావించబోతుండగా.. స్పీకర్ జోక్యం చేసుకున్నారు. మీడియా విషయాలపై ఇక్కడ చర్చ సరికాదన్నారు. తాను చెప్పేది తప్పయితే రికార్డుల నుంచి తొలగించాలని జితేందర్‌రెడ్డి చెబుతుండగానే.. ‘ఇకపై మీరు మాట్లాడేది రికార్డులకు వెళ్లదు’ అని చెప్పారు. మళ్లీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేనేం చెప్పాలనుకున్నానంటే న్యాయమంత్రిపై ఉత్తుత్తి ఆరోపణలు చేస్తున్నారు’’ అని వివరణ ఇచ్చారు. ‘‘నిన్న కేంద్ర మంత్రి సమాధానం తరువాత మేమంతా అరుణ్ జైట్లీని కలిశాం. నిన్న మా సహచరుడు వినోద్ సభలో కూడా చెప్పారు. ఏపీ సచివాలయం హైదరాబాద్‌లోనే ఉంది. డీజీపీ ఇక్కడే ఉన్నారు. ఏసీబీ ఇక్కడే ఉంది. వారి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఒక విషయమైతే... హైకోర్టు ఇవ్వడం కూడా ముఖ్యమైన విషయం. ఇప్పుడు న్యాయమంత్రి రివ్యూ పిటిషన్ ఉందంటున్నారు. అసలు అదెందుకు వేశారు? హైకోర్టుకు భవనాలను ఇస్తామని, పదేళ్లపాటు అన్ని వసతులు అందిస్తామని చెబుతూ వేసిన పిటిషన్ అది. మా సీఎం వాళ్లను బాగా చూసుకుంటారు. ఇప్పటివరకు కూడా హైదరాబాద్‌లో విద్వేషపూరిత నేరాలేవీ జరగలేదు. పార్లమెంటరీ మంత్రికి అభ్యం తరం లేనప్పుడు, హోం మంత్రి, ఆర్థిక మంత్రి, న్యాయమంత్రికి అభ్యంతరం లేనప్పుడు మరి తాత్సా రం ఎందుకు? ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు. కేవలం రాజ కీయపర నిర్ణయం. ఒక్కరాత్రిలో తీసుకునే నిర్ణయం. ఒకవేళ ఈరోజు కేబినెట్ సమావేశం జరిగితే ఆ నిర్ణయం తీసుకుంటే తేలిపోతుంది. మీరే చూస్తున్నారు. మీకు మేం ఇబ్బంది కల్గించడం లేదు. మేమే నిల్చొని మా బాధను మౌనంగా తెలుపుతున్నాం. అయినా నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నా’’ అని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ అంశం: అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేసిందంటే.. న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ పరిధిని చాలెంజ్ చేశారు. కేంద్రం వేయాల్సిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఇదొక రాజకీయ అంశం.. (కవిత ఈ సందర్భంలో పలువురి పేర్లు ప్రస్తావించగా స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించారు) వాళ్లు తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుంటూ ‘‘వాళ్ల పేర్లు ఉండకూడదు. ఎలాంటి ఆరోపణలు ఎవరిపైనా ఉండకూడదు. కవితా.. ఇది సరికాదు’’ అని సూచించారు. అనంతరం కవిత మాట్లాడుతుండగా.. మా నాయకుడి పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్నాయుడు వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతి వాదనకు దిగారు. వెంకయ్య ఆగ్రహం: సదానందగౌడ సమాధానం తర్వాత బాల్క సుమన్ తదితర టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు ఏర్పాటులో తాత్సారం వెనక కొందరు ఉన్నారంటూ వారి పేర్లను బిగ్గరగా చెప్పడంతో.. వెంకయ్యనాయుడు లేచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దుష్పరిణామం. హైకోర్టు విభజనలో చాలా స్పష్టంగా ఉన్నాం. వినోద్.. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వినే ఓపికా ఉండాలి. మీకు వినాలని లేకుంటే నేను వదిలేస్తాను. తాను చేసిన ప్రకటనను కూడా ఉపసంహరించుకోవాలని మా న్యాయమంత్రికి చెబుతా.. మీరు చేయాలనుకున్నది చేసుకోండి’’ అంటూ కూర్చున్నారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు తిరిగి పలు ఆరోపణలు చేయడంతో వెంకయ్య మళ్లీ లేచారు. ‘‘ఆ ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతం ఏంటి? మాది ప్రాంతీయ పార్టీ కాదు. ఇక్కడ లేని వారి పేర్లను ప్రస్తావించవద్దు. హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుందన్న విషయం మనం గ్రహించాలి. మీరిచ్చిన హామీలన్నీ 14 నెలల్లో నెరవేర్చలేదని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? ఏపీ హైకోర్టుకు సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నందున ఈ అంశాన్ని కూడా హైకోర్టు ముందుంచాలని నేను మా న్యాయమంత్రిని కోరుతున్నా.. దీన్ని రాజకీయం చేయొద్దు’’ అంటూ మండిపడ్డారు. అనంతరం సదానందగౌడ మాట్లాడుతూ ‘‘ఏపీ హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరుతాం. అవి ఏర్పాటు కాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం..’’ అని చెప్పారు. న్యాయస్థానం పరిధిలో ఉంది.. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ప్రత్యేక హైకోర్టు అంశంపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ ఒక ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుంది, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతంలో హైకోర్టుకు భవనాలు, న్యాయమూర్తులు, సిబ్బందికి నివాస గృహాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇది ఏపీ ప్రభుత్వ బాధ్యత. దీనిని ఉమ్మడి హైకోర్టుతో చర్చించి నెరవేర్చాల్సి ఉంది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం కలసి నిర్ణయించుకున్న తరువాత, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేంద్రం తదుపరి చర్యల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. దానిపై మే 1, 2015న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ పరిధిలో హైకోర్టు ఏర్పాటుకు తగిన ప్రాంతాన్ని గుర్తించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోపు ఏపీ సీఎం, చీఫ్ జస్టిస్ కలసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 14న ఉందని కూడా తెలిపారు. అందువల్ల ఈ అంశం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది..’’ అని సదానందగౌడ పేర్కొన్నారు. -
పార్టీ ఫిరాయింపులపై అట్టుడికిన సభ
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ శాసనసభ అట్టుడికింది. మునుపెన్నడూ లేనిరీతిలో సభలో గందరగోళం రేగింది. ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే ఈ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యలు లేవనెత్తారు. గవర్నర్ ప్రసంగాన్ని అడుగడునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ప్రధానంగా సభ దృష్టికి తేవాలన్న లక్ష్యంతో విపక్ష సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగం కాపీలను చించేసి విసిరారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం, తోపులాటకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మాధవరావులను అడ్డుకునే యత్నంలో టీఆర్ఎస్ సభ్యులు వీరిని పక్కకు తోసేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేలను తోసేసిన టీఆర్ఎస్ సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు బాహాబాహికి దిగారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదులాట, తోపులాట చోటుచేసుకుంది. సభలో నిరసన తెలుపుతున్న కుకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరావును టీఆర్ఎస్ సభ్యులు తోసేశారు. రేవంత్ రెడ్డిని పక్కకు నెట్టేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. విపక్షాల నిరసనల నడుమ గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. -
వాస్తవదూరంగా ‘ద్రవ్య’ బిల్లు
* సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే బడ్జెట్ పెట్టారు * బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి * పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వికార సంస్కృతి * ప్రభుత్వం తీరుపై అంతటా అసంతృప్తి ఉందని వ్యాఖ్య * ఉత్తమ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్లో చూపిన గణాంకాలపై సాధ్యాసాధ్యాల ను లోతుగా పరిశీలించకుండానే గారడీ చేశారని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌పైనా, ప్రభుత్వ వ్యవహారశైలిపై అన్నివర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్న ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ శాసనసభా పక్షంపూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. తన ప్రసంగంలో గత ప్రభుత్వాల్లో ఆదాయం, వృద్ధిరేటు మొదలుకొని ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావించిన లోటు భర్తీ, భూముల అమ్మకం, భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని అంశాలను ప్రస్తావించారు. మొత్తం బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2012-13లో రూ.7,600కోట్లు, 2013-14లో రూ.8,991కోట్లు వచ్చిందని, ఈ లెక్కన ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ.10 వేల కోట్ల వరకు అంచనా వేయొచ్చని, కానీ ప్రభుత్వం చెబుతున్న రూ.21 వేలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా సాధ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూముల అమ్మకాలను చేపడితే వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రస్తుతం భూములు అమ్మితే రూ.6,500 కోట్లువస్తాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కేవలం 4 నెలల కాల వ్యవధిలో భూములను గుర్తించి, టెండర్లు పిలిచి, వాటిని అమ్మి ఆదాయం సమకూర్చుతామనడం ఎలా సాధ్యమన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ప్రణాళిక వ్యయం కింద చూపిన రూ.48 వేల కోట్లలో సగానికి మించి ఖర్చు చేయడం సాధ్యమయ్యేలా లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఏమాత్రం సరిపోదని అన్నారు. కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ కారణం అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్ర వాటా 54 శాతం సాధ్యమైందని, ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి, భూపాలపల్లి, సింగరేణిల ద్వారా మరో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం దక్కిందన్నారు. ఆ రిజర్వేషన్లు సాధ్యమేనా? 9.3శాతం ఉన్న గిరిజనులకు 12, అలాగే 11 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యేదేనా?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని ఉత్తమ్ ప్రశ్నించారు. గతంలో మంజూరై ప్రస్తుత నిర్మాణం కొనసాగుతున్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ కొట్లాడితే, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వికార సంస్కృతిని టీఆర్ఎస్ మానుకోవాలన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. -
ఉభయసభలకూ ఆర్డినెన్సు సెగ
* పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఆందోళన * సభ సజావుగా సాగకపోవడంతో వాయిదా వేసిన స్పీకర్ * అటు రాజ్యసభ కూడా వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: ఆర్డినెన్సు సెగ కొత్తగా కొలువుదీరిన 16వ లోక్‌సభకూ తాకింది. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ సభ్యులు సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు కడియం శ్రీహరి, వినోద్‌కుమార్, కవిత, జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్, నర్సయ్యగౌడ్ సహా ఆ పార్టీకి చెందిన మిగిలిన సభ్యులు, వైఎస్సార్సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లకార్డులతో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలిచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో తాము చేసిన ప్రతిపాదనలపై చర్చకు పట్టుపట్టాలని బీజేడీ సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలిచ్చారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కోసం అంశాన్ని లోక్‌సభ టేబుల్‌పై పెట్టారు. అనంతరం జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ (తెలంగాణ), మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ (మహబూబాబాద్) పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేశారు. సభ కొనసాగుతుండగా ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒడిశాలో గిరిజన గ్రామాలు కనుమరుగు కానున్నాయని మరోవైపు బీజేడీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో తాము చేసిన ప్రతిపాదనలపై చర్చకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. సభ్యులకు సర్దిచెప్పడానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు విజ్ఞప్తులు చేసినా వారు పట్టించుకోలేదు. ఆర్డినెన్సుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు అనుమతి ఇస్తానని స్పీకర్ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ నిరసనలు రాజ్యసభలో ఆర్డినెన్సు అంశం ఆందోళనకు తెరలేపింది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం 12.30 గంటలకు సభ్యుల ప్రమాణంతో సభ మొదలైంది. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు (ఆంధ్రప్రదేశ్), టి.సుబ్బరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్), గరికపాటి మోహన్‌రావు (తెలంగాణ), దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), బీహార్, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం నుంచి ఎన్నికైన సభ్యులతో చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. అనంతరం దివంగత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే, సభ్యులు నేదురుమల్లి జనార్దనరెడ్డి, బంగారు లక్ష్మణ్, భువనేశ్ చతుర్వేది, కుశ్వంత్ సింగ్, స్కాటో స్వేయు, అధిక్ శిరోద్కర్ , ఆర్ఎన్ ఆర్య మృతికి సభ శ్రద్ధాంజలి అర్పించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్, టి.టీడీపీ ఎంపీల నిరసన మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభ బీజేపీ పక్ష నేతగా జైట్లీ, విపక్ష నేతగా గులాంనబీ ఆజాద్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 2వ తేదీన ఈ విషయం తనకు తెలియపర్చారని అన్సారీ సభకు తెలిపారు. మొన్నటివరకు జైట్లీ రాజ్యసభ విపక్ష నేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో విపక్ష నేతగా గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్) ఉంటారు. లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా కొనకళ్ల నారాయణ టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. ప్యానెల్ స్పీకర్లో మొత్తం పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కొనకళ్ల నారాయణతో పాటు అర్జున్ చరణ్ సేఠి, తంబిదొరై, హకుందేవ్ నారాయణ యాదవ్, కె.వి.థామస్, ఆనందరావు అడసూల్, ప్రహ్లాద్ జోషీ, రత్నాడే, రమెన్డెకా, హుకుం సింగ్‌లు ప్యానెల్ స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. -
కేసిఅర్ విజయోత్సవ ర్యాలీ
-
సీమాంధ్ర ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ దూకుడు
సభలో చొక్కా పట్టుకుంటారా.. ఇదేం దౌర్జన్యం: గాదె ఆగ్రహం క్షమాపణకు కాంగ్రెస్, టీడీపీ డిమాండ్.. విచారం వ్యక్తం చేసిన ఈటెల సాక్షి, హైదరాబాద్: టీ-బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్ఎస్ సభ్యులు ఒకవైపు, సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోవైపు మోహరించడంతో సభలో యుద్ధవాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ సభ్యులు ఒక దశలో కాంగ్రెస్ సభ్యులవైపు దూసుకువెళ్లి వారిని వెనక్కి నెట్టడం, దీనికి వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అరుపులు, నినాదాలతో దద్దరిల్లి, కొంతసేపు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య నెట్టివేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు క్షమాపణ చెప్పాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కాగా, డిప్యూటీస్పీకర్ సూచన మేరకు టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ చింతిస్తున్నామని చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లుపై శుక్రవారం శాసన సభలో టీఆర్ఎస్ తరపున ఈటెల రాజేందర్ మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. పొట్టి శ్రీరాములు కూడా చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే సమయంలోనే మోసం జరిగిందని, తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టంగా పేరు పెట్టాల్సి ఉన్నా...తెలంగాణ పదాన్ని తొలగించారని, గడసరి వారితో అమాయక తెలంగాణ వారు తట్టుకోవడం కష్టమన్న నెహ్రూ అభిప్రాయం...వంటి విషయాలను ఈటెల ఉటంకించారు. ఈ దశలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుని... చరిత్రను రాజేందర్ వక్రీకరిస్తున్నారని, ఇలాంటి రెచ్చగొట్టే వక్రీకరణల వల్లనే తెలంగాణలో వెయ్యి మంది అమాయకులు మృతి చెందారని ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఆగ్రహించి ద్రోణంరాజు శ్రీనివాస్ వద్దకు వెళ్లి వాదనకు దిగారు. పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తదితరులు అక్కడికి వచ్చి వారిని సముదాయించారు. అయితే టీఆర్ఎస్ సభ్యుడు కావేటి సమ్మయ్య అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చి గాదె వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరని వెనక్కి నెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇదేసమయంలో గాదెకు మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు,టీఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా తెలంగాణ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది.దీంతో పరిస్థితి చే యి దాటిపోతుందని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదరరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీ్‌శ్ రావు, జూపల్లి కృష్ణారావు వంటి వారు ఇరు వర్గాలను శాంతింపజేశారు.అనంతరం గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ,‘ సభలో చొక్కా పట్టుకుంటారండి...ఇదేం సంస్కృతి ? ఇదేం దౌర్యన్యం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘వారితో తనకు క్షమాపణ చెప్పించాల’ని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో మంత్రి శైలాజానాథ్,ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ, పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే...రేపు తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రుల భద్రతకు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ఈ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు నరేంధ్ర , బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు వారికి మద్దతుపలికారు. అంతేకాక టీఆర్ఎస్ సభ్యులు తీరును ఖండిస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. దురుసు ప్రవర్తనకు క్షమాపణ చెప్పించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క జోక్యం చేసుకుని వాదనల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహాజం, సభలో అందరూ, హుందాగా ఉండాలని కోరారు. ఆయన సూచనతో ఈటెల రాజేందర్ ‘ఈ సంఘటనను మేం మర్యాద అని అన డం లేదు...జరిగిన దానికి చింతిస్తున్నామ’ని చెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది. 18 నుంచీ మళ్లీ అసెంబ్లీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచీ శాసనసభ, శాసనమండలి తిరిగి ప్రారంభం కానున్నారుు. 17న ఏఐసీసీ సమావేశం ఉన్నందున ఆ రోజు శాసనసభ, శాసనమండలికి సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు స్పీకర్, చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమోదం తెలిపిన స్పీకర్ నాదెండ్ల మనోహర్, చైర్మన్ చక్రపాణి.. 18వ తేదీ నుంచి సభలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. 19వ తేదీ ఆదివారం కూడా సభలు జరుగుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ శుక్రవారం విడుదల చేసిన బులెటెన్‌లో పేర్కొన్నారు.