trunk box
-
గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్‌కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ట్రంకు పెట్టెల గోల్మాల్
సాక్షి, అనంతపురం: బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు ట్రంకు పెట్టెల సరఫరాలో గోల్మాల్ జరిగింది. పెట్టెల సరఫరా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద, రెండొందలు కాదు.. ఏకంగా రూ.89,50లక్షలు ఏజెన్సీ ఖాతాలోకి జమ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు చేరకపోవడం చూస్తే.. అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి పెట్టెలను హాస్టళ్లకు సరఫరా చేసిన తర్వాత నిబంధనల ప్రకారం నాణ్య తను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే, ఒక్కటంటే ఒక్క పెట్టె సరఫరా చేయక ముందే బిల్లు చెల్లించడం గమనార్హం. ఫిబ్రవరిలో బిల్లు పెట్టిన అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న బిల్లు మంజూరు చేసిన అధికారులు ట్రెజరీకి పంపించారు. అయినా సదరు ఏజెన్సీ పెట్టెలు సరఫరా చేయలేదు. అనివార్య కారణాల వల్ల బిల్లు ట్రెజరీలో పెండింగ్ పడినా మే 2న ఏజెన్సీ ఖాతాలో జమ అయ్యింది. నాలుగు రోజులు గడిస్తే సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేసినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారమైనా ఇంకా 2,784 ట్రంకు పెట్టెలు సరఫరా చేయాల్సి ఉంది. 8వేల పెట్టెలు మాత్రమే సరఫరా చేశారనేది బీసీ సంక్షేమశాఖ అధికారుల లెక్క. అంటే.. ఇంకా 3,784 సరఫరా చేయాల్సి ఉంది. ఎవరి లెక్కలు వాస్తవమో వారికే తెలియాలి. టెండరు దక్కించుకున్న తర్వాత నెలలోపు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడు నెలలవుతున్నా పూర్తిస్థాయిలో పెట్టెలు సరఫరా చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అన్నింటా ఇదే పరిస్థితి హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రలు సరఫరా చేయడంలోనూ అధికారులు ఇదేరకంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వస్తువులు సరఫరా చేయకముందే పునీత్ ఏజెన్సీకి రూ.73 లక్షల బిల్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్లేట్లు, గ్లాసులకు సంబంధించి రూ.13,81,610, వాటర్ డ్రమ్ములకు రూ.2,88,000, చార్జింగ్ లైట్లకు రూ.5,25000 చెల్లించారు. అలాగే వంటపాత్రల సరఫరాకు దాదాపు రూ.51 లక్షలు ముట్టజెప్పారు. ఈ బిల్లులను ఏకంగా జనవరి 10వ తేదీనే పెట్టారు. ట్రెజరీలో జాప్యం జరగడంతో వెనక్కు వచ్చాయి. తిరిగి 20 రోజుల కిందట ఈ మొత్తం బిల్లులు ట్రెజరీకి పంపించేశారు. ఏ క్షణమైనా ఏజెన్సీ ఖాతాలో జమ కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్క గ్లాసు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఇంకా నెల పట్టొచ్చు హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు సరఫరా చేసేందుకు ఇంకా నెల పట్టొచ్చు. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేశాం. ఇంకా 2,784 ఇవ్వాల్సి ఉంది. సచివాలయ పరీక్షల నిర్వహణకు వివిధ మెటీరియల్ అవసరమని జిల్లా అధికారులు చెప్పడంతో పెట్టెల తయారీని పక్కనపెట్టాం. – శతృసింగ్, పునీత్ ఏజెన్సీ నేను రాకముందే ఇచ్చేశారు ట్రంకు పెట్టెలకు సంబంధించిన బిల్లు నేను చార్జ్ తీసుకోకముందే ఇచ్చేశారు. పెట్టెలు సరఫరా చేయాలని ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటిదాకా 8వేలు ఇచ్చారు. హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రల సరఫరాకు సంబంధించిన బిల్లు ట్రెజరీకి పంపాం. ఇన్ ఆపరేషన్ అకౌంటులో ఉండేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వస్తువులు సరఫరా చేసిన తర్వాతే ఆ మొత్తం డ్రా చేసుకునేలా చూస్తాం. – యుగంధర్, బీసీ సంక్షేమ శాఖ డీడీ -
బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
ట్రంక్బాక్స్ల్లో అవినీతి ఫలితం! తప్పించేందుకు ప్రయత్నం? కరీంనగర్ సిటీ : ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడిన బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఓ పర్యవేక్షణ స్థాయి అధికారిపై వేటు పడినట్లు సమాచారం. సదరు అధికారిని సస్పెండ్‌చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని, సెలవులో ఉన్న కలెక్టర్ తిరిగి రాగానే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం. ఇదీ కారణం... బీసీ సంక్షేమ శాఖకు చెందిన సదరు అధికారి ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడనే అభియోగాలున్నాయి. ఇటీవల బీసీ హాస్టల్ విద్యార్థులకు 3706 ట్రంక్బాక్స్లు వచ్చాయి. 24 గేజ్‌తో ఉన్న ఒక్కో పెట్టె రూ.436 చొప్పున సరఫరా చేసేందుకు వరంగల్‌కు చెందిన కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. సరఫరా చేసిన ట్రంక్బాక్స్ల్లో నాసిరకంవి ఉన్నాయని, కలెక్టరేట్ సాక్షిగా కాంట్రాక్టర్ నుంచి సదరు అధికారి డబ్బులు తీసుకోవడంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించి నాలుగు రోజుల పాటు బాక్స్‌ల గేజ్‌ను తూకం వేశారు. అధికారికంగానే 513 బాక్స్‌లు నాసిరకం వచ్చాయని తేల్చారు. ట్రంక్బాక్స్ల అక్రమాలకు కారణమైన సదరు అధికారి, గతంలో సెక్షన్ క్లర్క్‌గా ఉన్న సమయంలోనూ బాక్స్‌ల సరఫరాలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అప్పుటి అవినీతి ఫలితంగా ఆ సమయంలో పనిచేసిన డీబీసీబ్ల్యూవో రిటైర్డ్ అయినా ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడైన సదరు అధికారిపై పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తప్పించేందుకు ప్రయత్నం? ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిని సస్పెన్షన్ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ తిరిగి రాగానే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండడంతో ఆ లోగానే అప్పీల్ పేరుతో శిక్ష తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. దీనికోసం కొంతమంది అధికారులతో పలువురు సంఘ నాయకులు చర్చించినట్లు వినికిడి. శిక్ష ఖాయమని, కనిష్టంగా ఇంక్రిమెంట్లలో కోత, గరిష్టంగా సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశముందని ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డుగా వెల్లడించడం విశేషం.