TS tagore
-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో దిలీప్ బి. బొసాలే భేటీ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాగూర్‌తో హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి. బొసాలే శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు పరిధిలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఈ సందర్భంగా బొసాలే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. హైకోర్టు విభజించాలని తెలంగాణలోని న్యాయవాదులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా...తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ఆదివారం న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాగూర్‌తో సమావేశం కానుంది. హైకోర్టు విభజన అవశ్యకతపై ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్‌కు ఈ బృందం వివరించనుంది. -
‘కొత్త పోలీసు’ కావాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో నిష్పాక్షికంగా, సమర్థంగా, రాజకీయ జోక్యం లేకుండా న్యాయవిచారణ జరిపేందుకు అత్యున్నత శిక్షణ పొందిన పోలీసు అధికారులు కావాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. దేశంలో పోలీసు సంస్కరణలపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం రాష్ట్ర స్థాయిలో భద్రతా మండలి ఏర్పాటు, పోలీసు అధికారుల ఎంపికలో పారదర్శకత వంటి అంశాలను పేర్కొంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.