సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాగూర్తో హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి. బొసాలే శనివారం భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాగూర్తో హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి. బొసాలే శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు పరిధిలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఈ సందర్భంగా బొసాలే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. హైకోర్టు విభజించాలని తెలంగాణలోని న్యాయవాదులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా...తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ఆదివారం న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాగూర్తో సమావేశం కానుంది. హైకోర్టు విభజన అవశ్యకతపై ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్కు ఈ బృందం వివరించనుంది.