‘కొత్త పోలీసు’ కావాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో నిష్పాక్షికంగా, సమర్థంగా, రాజకీయ జోక్యం లేకుండా న్యాయవిచారణ జరిపేందుకు అత్యున్నత శిక్షణ పొందిన పోలీసు అధికారులు కావాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. దేశంలో పోలీసు సంస్కరణలపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం రాష్ట్ర స్థాయిలో భద్రతా మండలి ఏర్పాటు, పోలీసు అధికారుల ఎంపికలో పారదర్శకత వంటి అంశాలను పేర్కొంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.