TTD Calendars
-
టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్
-
2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు వచ్చేశాయ్.. దక్కించుకోండి ఇలా..
తిరుమల: టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్ రూ.130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30గా నిర్ణయించారు. ఆన్లైన్లో, తపాలా శాఖ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు 99639 55585, 0877–2264209 నంబర్లలో సంప్రదించవచ్చు. (క్లిక్ చేయండి: పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్) -
ఆన్లైన్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
తిరుపతి సెంట్రల్: టీటీడీ 2021 క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. వీటిని పోస్టు ద్వారా కూడా భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ‘ఈవో, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటీ.రోడ్, తిరుపతి’ అనే చిరునామాకు పంపాలి. టు పే విధానం (పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు క్యాలెండర్, డైరీలను టీటీడీ పంపనుంది. మరింత సమాచారం కోసం 0877– 2264209, 9963955585 నంబర్లను సంప్రదించాలి. (చదవండి: లోక కళ్యాణార్థం టీటీడీలో అఖండ పారాయణం) టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో మూసివేసిన మార్గాలను పునరుద్ధరిస్తుంది. గురువారం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే, దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే నడకదారిలో అనుమతిస్తామని చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బందితో నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. అలాగే రెండు ఘాట్ రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. పూర్వ కాలం నుంచి తిరుమల కొండకు రెండు సోపాన మార్గాలున్నాయి. మొదటిది శ్రీవారి మెట్టు. దీన్నే నూరు మెట్ల దారి అంటారు. ఇది శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్గం గుండా భక్తులను అనుమతినిస్తున్నట్లు టీటీడీ సెక్యూరిటీ అధికారి గోపినాధ్ జెట్టి పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని సివియస్ఓ గోపినాధ్ జెట్టి తనిఖీ చేశారు. లాక్డౌన్లో కృర మృగాలు మెట్ల మార్గంలో వస్తుండటంతో శ్రీవారి మెట్లను గతంలో మూసి వేశారు. నేడు భక్తులు సంఖ్య పెరగడంతో మెట్ల మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసారు. -
అందుబాటులో టీటీడీ కేలండర్లు, డైరీలు
తిరుమల : నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ కేలండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచారు. 12 షీట్ల కేలండర్ రూ.75, శ్రీవేంకటేశ్వర స్వామివారి పెద్ద కేలండర్ రూ.10, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి చిన్న కేలండర్ రూ.7, డైరీ రూ.100 ప్రకారం విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ శ్రీ బాలాజీ భవన్‌లోని టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు. అలాగే తిరుమల ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, నిత్యాన్నప్రసాద భవన కేంద్రం, ఏటీసీ వద్ద కూడా విక్రయిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం పక్కన ధ్యానమందిరం, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల వద్ద అందుబాటులో ఉంచారు. వివరాలకు ఫోన్ (040-23220852,23220457) ద్వారా సంప్రదించాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తలారి రవి విజ్ఞప్తి చేశారు.