Tummalapally
-
డీఆర్డీవో హైదరాబాద్‌లో అప్రెంటిస్‌లు ఖాళీలు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)కు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 40 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–30, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–10. ► విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తదితరాలు. అర్హత ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 వరకు చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు. ► శిక్షణ వ్యవధి: 12 నెలలు ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్), డీఆర్డీవో, కాంచన్‌బాగ్, హైదరాబాద్–500058 చిరునామకు పంపించాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: https://www.drdo.gov.in యూసీఐఎల్, తుమ్మలపల్లిలో 30 అప్రెంటిస్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 30 ► విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్ డీజిల్, టర్నర్/మెషినిస్ట్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్వీసీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 02.11.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: www.ucil.gov.in -
'కరప్షన్ క్యాన్సర్ కన్నా ప్రమాదం'
సాక్షి, విజయవాడ : కరెప్షన్ అనే పదానికి దూరంగా ఉండాలని అది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాలను గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2019ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కరెప్షన్ అనే పదం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అని గవర్నర్ తెలిపారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు జరగనున్న విజిలెన్స్ వారోత్సవాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తుమ్మలపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, తుమ్మలపల్లి : దేశంలోనే అత్యధిక యురేనియం నిల్వలు కలిగిన తుమ్మలపల్లి యురేనియం ప్లాంటు వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, గ్రామాల ప్రజలు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ముందు శనివారం ధర్నాకు దిగారు. ఫిబ్రవరిలో స్థానిక సమస్యలను ప్రజలు వైఎస్సార్ సీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు అవినాష్ చెప్పారు. ‘యూసీఐఎల్‌లో ఉన్న టెయిల్ పాండ్‌లోని నీరు భూమిలోకి ఇంకి చుట్టుపక్కల పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. బోర్ల నుంచి వచ్చే నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గాలి, నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. ఫిబ్రవరి 21న యూసీఐఎల్ సీఎండీ బాధిత గ్రామాల్లో పర్యటించారు. సీఎండీకి ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించమని కోరారు. గ్రామాల్లో తాగునీరుకు పైప్‌లైన్ వేయించమని అడిగారు. నీరు ఇంకకుండా టెయిల్ పాండ్‌ను పునఃనిర్మించాలని కోరారు. గ్రామాల ప్రజల సమ్మతితో ఇళ్లు, పొలాలను యూసీఐఎల్ సేకరించాలని అడిగారు. ఈ మేరకు డిమాండ్లతో సీఎండీకి వినతి పత్రం సమర్పించాం. ప్రజల డిమాండ్లపై రెండు వారాల్లోగా స్పందిస్తానన్న సీఎండీ ఇప్పటివరకూ స్పందించలేదని చెప్పారు. ఆయన సమాధానం కోసమే ధర్నా చేస్తున్నాం’ అని అవినాష్ వెల్లడించారు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
పెనుబల్లి (ఖమ్మం) : ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకటేష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి లోకేష్(14 నెలల) అనే బాబు ఉన్నాడు. గురువారం వెంకటేష్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ఇంటి పనులు చక్కబెడుతుండగా.. ఇంటి ముందు ఆడుకుంటున్న లోకేష్ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.