tungabhadra water
-
తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం
(సాక్షి ప్రతినిధి, కర్నూలు): తుంగభద్ర జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి ఏటా అన్యాయమే జరుగుతోంది. విడుదల చేసిన నీళ్లు రాష్ట్రానికి చేరే విషయంలో మరింత దారుణంగా ఉంటోంది. కర్ణాటక రైతులు అడుగడుగునా నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో రాష్ట్ర రైతులు ఎండిన కాలువలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్ణాటక జల చౌర్యం, అధికారుల నిర్లిప్తత వెరసి రాష్ట్రంలోని తుంగభద్ర ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి రాష్ట్ర (ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు) రైతుల తాగు, సాగు అవసరాల కోసం 56.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 24 టీఎంసీలు కేటాయించారు. అయితే గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా కోటా మేర నీళ్లు హెచ్చెల్సీ, ఎల్ఎల్సీకి వదల్లేదు. ఇదీ హెచ్చెల్సీ పరిస్థితి హెచ్చెల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికరజలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీబోర్డు మాత్రం ఏటా సగటున 18 టీఎంసీలు మాత్రమే ఇస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తున్నారు. వాస్తవానికి ఆమేర కూడా అందించ లేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్చెల్సీకి మళ్లించేలా జీవో జారీ చేశారు. అందులో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో ఏటా 20 టీఎంసీల నికరజలాలు సీమ రైతులు కోల్పోతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకూ 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ పైపులు వేసుకుని మోటర్ల ద్వారా వాడేసుకుంటున్నారు. హెచ్చెల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కర్నూలుకు, పీబీసీ (పులివెందుల బ్రాంచ్ కెనాల్), మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా వైఎస్సార్ జిల్లాకు తుంగభద్రజలాలు చేరాలి. ప్రధాన కాలువ ద్వారా అనంతపురంలోని పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యామ్‌కు నీరు చేరుతుంది. అయితే విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడంలేదని రైతులు ఏటా ఆందోళనలకు దిగుతున్నారు. పీబీసీ ఆయకట్టుకు 8 ఏళ్లుగా చుక్కనీరు అందడంలేదు. విడుదలయ్యే అరకొర నీరు తాగునీటి అవసరాలకే సరిపోతోంది. ఫలితంగా పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్ఎల్సీ పరిస్థితి ఇదీ ఎల్ఎల్సీ (లోలెవల్ కెనాల్)కి డ్యామ్ నుంచి 24 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఈ నీటిపై ఆధారపడి కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. గత ఏడేళ్లుగా కేటాయింపులు పరిశీలిస్తే 6 టీఎంసీల నుంచి 15 టీఎంసీల లోపే ఉన్నాయి. ఇందులో కూడా 3.5 టీఎంసీలు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన నీటినే సాగుకు వినియోగించాలి. దీంతో ఎల్ఎల్సీ కింద ఎప్పుడూ సగం మేర ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ ఏడాది పరిస్థితులు మరీ దారుణం టీబీడ్యాంలో నీటి నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతేడాది ఈ సమయానికి 94.01 టీఎంసీలు ఉంటే, ప్రస్తుతం డ్యాంలో 24.44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది డ్యాంలో ఇన్‌ఫ్లో 54,380 క్యూసెక్కులు, ఉంటే ఈ ఏడాది 14,683 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దీంతో ఎల్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు వర్షాలు కూడా లేకపోవడంతో ఈ ఏడాది పంటలు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జటిలం
- ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా - పొంచి ఉన్న నీటి ముప్పు - 200 గ్రామాల్లో తీరని దాహార్తి - నిండని ఎస్ఎస్ ట్యాంకులు - టీబీ డ్యాంలో అడుగంటిన నీరు ఆదోని: జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్రం కానుంది. దాహారికి తీర్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లోని 200 గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాగునీటి కోసం రబీ పంటలను రైతులు త్యాగం చేశారు. దాదాపు లక్ష ఎకరాల్లో రబీ పంటలకు సెలవు ప్రకటించారు. పంటలు సాగు చేస్తే మొత్తం నీటిని వినియోగించుకోవాల్సి వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తుంగభద్ర రిజర్వాయర్‌లో ఏపీ వాటా కేటాయింపులో ఇంకా 2 టీఎంలసీల నీరు నిల్వ ఉన్నాయి. అయితే జిల్లా ప్రజల తాగు నీటి అవసరాల మేరకు నీటిని సరఫరా చేయకుండా అర్ధంతరంగా నిలిపి వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మూడు రోజుల్లోనే పడిపోయిన నీటి మట్టం వేసవిలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతో సహా 200 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. దీంతో ఈ నెల 9న టీబీ డ్యాం నుంచి 760 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అవి ఈ నెల 14న జిల్లా సరిహద్దుకు చేరుకున్నాయి. మొదటి మూడు రోజులు 350 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉండడంతో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఎస్ఎస్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కనీసం 10 రోజుల పాటు కాలువలో నీటి ప్రవాహం 350 క్యూసెక్కులు ఉంటే ఎస్ఎస్ ట్యాంకులను పూర్తిగా నింపుకోవచ్చు. అయితే నీటి సరఫరా ప్రారంభం అయిన మూడో రోజు నుంచే కాలువలో నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చింది. శుక్రవారం బోర్డు సరిహద్దు అయిన హానువాళు వద్ద కాలువలో నీటి మట్టం 290 క్యూసెక్కులకు పడిపోయింది. ఎగువన ఉన్న కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని అక్రమంగా మళ్లించుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దాహం తీరేదెలా.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో 28 ఎస్ఎస్ ట్యాంకులు నిర్మించారు. వీటికి వారం రోజులుగా నీటిని నింపుతున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలలోని ఎస్ఎస్ ట్యాంకులకు రెండు రోజుల క్రితమే నీటి పంపింగ్ ప్రారంభం అయింది. మొత్తం 8 ట్యాంకులకు మాత్రం 50 శాతంకు పైగా నీటిని పంపింగ్ చేశారు. అయితే నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆదివారానికి నీటి మట్టం పూర్తిగా పడిపోతోంది. దీంతో నీటి పంపింగ్ కూడా నిలిచిపోతోంది. ప్రస్తుతం ఆయా ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరు నెలలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ట్యాంకులు ఖాళీ అయితే బిందెడు నీరు కూడా దొరక్క తాగు నీటి దాహార్తితో పడరాని పాట్లు పడాల్సి వస్తోందని ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం ఖాళీ తుంగభద్ర జలాశయం ఖాళీ కావడంతో బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. కనీసం 2 టీఎంసీలు ఉండాల్సి ఉండగా తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1.75 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు వచ్చి జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరిగితే వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని బోర్డు అధికారులకు సూచించాం. ఇందుకు బోర్డు అధికారులు కూడా అంగీకరించారు. - భాస్కరరెడ్డి, ఈఈ, ఆదోని తుంగభద్ర ప్రాజెక్టు -
తుంగభద్రలో క‘ర్నాటకం’!
భారీ జల దోపిడీకి తెరతీసిన కర్ణాటక ప్రభుత్వం - టీబీ డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడాన్ని సాకుగా చూపుతోన్న వైనం - 35 టీఎంసీల సామర్థ్యంతో రూ.5,600 కోట్లతో కొత్త జలాశయం నిర్మాణం - హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకం - ప్ర తిపాదనలకు అంగీకరించాలని ఏపీ సర్కార్‌కు లేఖ - అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాలను ఇప్పటికే అడ్డగోలుగా తోడేస్తోన్న కర్ణాటక.. జలదోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సరి కొత్త నాటకాలకు తెర తీసింది. తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో పూడిక పేరుకుపోవడాన్ని సాకుగా చూపి.. డ్యాం ఎగువన కొప్పళ జిల్లా నవిలే గ్రామం సమీపంలో రూ.5600 కోట్ల అంచనా వ్యయంతో 35 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. ఇందులో 35 శాతం వ్యయాన్ని భరించాలని ఏపీ సర్కార్‌ను కోరింది. టీబీ డ్యాం కుడిగట్టు ఎగువ కాలువ(హెచ్చెల్సీ), ఎడమ గట్టు కాలువ(రాయచూర్ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి సహకరించాలని ప్రతిపాదిస్తూ వారం క్రితం ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. కర్ణాటక ప్రతిపాదనలకు అంగీకరిస్తే.. తుంగభద్ర జలాలు ఒక్క చుక్క కూడా రాష్ట్రానికి దక్కవని, రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50 టీఎంసీలు, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్‌కు 10, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.91, నీటి ప్రవాహ నష్టాలు 5.50.. వెరసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 78.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీలను కేటారుుంచింది. 1953లో టీబీ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. పూడిక పేరుకుపోతోండటంతో ఏటా 53 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత 151 టీఎంసీలకు పడిపోరుుందని లెక్క కట్టిన టీబీ బోర్డు.. దామాషా పద్ధతిలో రాష్ట్రానికి 48.50 టీఎంసీలు కేటారుుస్తూ వస్తోంది. కానీ మూడేళ్లుగా ఏనాడూ కేటారుుంచిన మేరకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాదీ హెచ్చెల్సీకి 22.50 టీఎంసీలు కేటారుుస్తే 6.5టీఎంసీలు, ఎల్లెల్సీకి 17.45 టీఎంసీలు కేటారుుస్తే 2.49, కేసీ కెనాల్‌కు 1.01 టీఎంసీలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. దాంతో రాయలసీమలో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు బంజరుగా మారింది. వ్యూహాత్మకంగా పావులు.. భారీగా జల దోపిడీ టీబీ డ్యాంలో పూడికతీతకు భారీగా ఖర్చు వస్తుందని ఆ ప్రతిపాదనలను కర్ణాటక ప్రభుత్వం పక్కన పెట్టింది. నూతన జలాశయం నిర్మాణం.. హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి టీబీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేరుుంచింది. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వాలని ఐదు దశాబ్దాలుగా ఏపీ సర్కార్ కోరుతున్నా పట్టించుకోని కర్ణాటక సర్కారు.. ఇప్పుడు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తూనే రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువ తవ్వకానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించాలని మెలిక పెట్టింది. తుంగభద్ర ప్రధాన ఉప నది తుంగపై అప్పర్ తుంగ ప్రాజెక్టు, సింగటలూరు ఎత్తిపోతల పథకం, మరో ఉప నది భద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్టును అధికారికంగా చేపట్టి పూర్తి చేసింది. ఆ ప్రాజెక్టుల దిగువన భారీ ఎత్తున ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను చేపట్టి అడ్డగోలుగా నీటిని తోడేస్తోంది. పర్యవసానంగా తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గిపోరుుంది. హెచ్చెల్సీ 196.43 కి.మీలలో 105.487 కి.మీలు కర్ణాటక పరిధిలో ఉంది. ఎల్లెల్సీ 348.2 కి.మీలలో కర్ణాటక పరిధిలో 131.50 కి.మీలు ఉంది. ఏపీ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక పరిధిలో రైతులు ఎక్కడికక్కడ గండ్లు కొడుతూ నీటిని తరలిస్తోన్నా ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో కర్ణాటక పరిధిలో లోలెవల్ కెనాల్(ఎల్లెల్సీ)పై 118.2 కి.మీల వద్ద అదనంగా మరో డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుకు టీబీ బోర్డు ఆమోదముద్ర వేసినా ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీని వల్ల కర్ణాటక జలదోపిడీకి ఏపీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లరుుంది. అంగీకరిస్తే అంతే సంగతి కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోవడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాయచూర్ కెనాల్‌కు ఇష్టారాజ్యంగా నీటిని విడుదల చేస్తూ జలదోపిడీ చేస్తోన్న కర్ణాటక.. వరద కాలువ తవ్వితే జలదోపిడీకి అడ్డే ఉండదు. మరో జలాశయం నిర్మాణం తర్వాత భారీ ఎత్తున ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని తరలించడానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. ఈ ప్రతిపాదనల వల్ల ఏపీ సర్కార్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని వినియోగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ఆధునికీకరణకు కర్ణాటక సర్కార్ ససేమిరా అంటోండటం గమనార్హం. ఈ అంశంపై ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావును ‘సాక్షి’వివరణ కోరగా.. టీబీ డ్యాంకు ఎగువన కొత్త జలాశయం నిర్మాణం, హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి అంగీకరించాలని కోరుతూ కర్ణాటక సర్కార్ లేఖ రాసిందని చెప్పారు. రాయచూర్ కెనాల్ ద్వారా కర్ణాటక ఇప్పటికే భారీ ఎత్తున నీటిని అక్రమంగా వినియోగిస్తోందన్నారు. కర్ణాటక ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
తుంగభద్రకు జలకళ
► కర్ణాటకలో భారీవర్షాలు ► తుంగభద్రకు పోటెత్తిన వరద ► టీడీడ్యాం నుంచి నీటివిడుదల ► 29వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీటిపారుదల ► ఆయకట్టు పంటలకు ఊపిరి ► తీరనున్న తాగునీటి సమస్య ► ఇండెంట్‌కు స్పందించిన అధికారులు శాంతినగర్ : వేసవిలోనూ ఆర్డీఎస్ కెనాల్ నిండుకుండలా ప్రవహిస్తోంది. ప్రతిఏట లేట్ఖరీఫ్కు అందని సాగునీరు ఈ ఏడాది పూర్తిస్థాయిలో పారుదల అవడమేగాక ఏప్రిల్ చివరలోను నీరు ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులేగాక మండల ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వడ్డేపల్లి మండల పరిధిలోని డిస్ట్రిబ్యుటరి 24 నుండి 28 వరకు ఉన్న చివరి ఆయకట్టుకు ప్రతిఏట సాగునీరందక పోవడం, పంటలు చివరిదశలో ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఈ ఏడాది అధికారుల ముందస్తు ప్రణాళిక, వరుణదేవుడు అనుకూలించడంతో పూర్తిస్థాయిలో రైతులు పంటలు పండించుకోగలిగారు. ఏప్రిల్ మొదటివారం వరకు ఇండెంట్ నీటి వాటాతో ప్రవహిం చిన ఆర్డీఎస్ కెనాల్‌కు వచ్చే ఖరీఫ్ వరకు నీరు కూడా వచ్చేవికావు. ఎగువనఉన్న కర్నాటక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షా లు కురవడంతో తుంగభద్రకు టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో ఆర్డీఎస్ హెడ్వర్క్స్వద్ద నీటి ప్రవాహం ఓవర్‌ఫ్లో అవుతూ వస్తోంంది. స్పందిం చిన ఆర్డీఎస్ అధికారులు కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ఎగువన ఉన్న 12 తూములను మూయించి దిగువకు నీటిని విడుదల చేస్తూ వస్తున్నా రు. ప్రస్తుతం డిస్ట్రిబ్యుటరి 29 వరకు నీర ందుతోంది. జూలెకల్ శివారులోని ప్రధా న కాలువలో ఐదు అడుగులమేర నీరు ప్రవహిస్తోంది. ఊహించని విధం గా ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు రావడంతో సుబాబు ల రైతులకు అదృష్టం వరించినట్లయింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో తడులు ఇస్తే జూ న్లో వర్షాలు కురిసే వరకు చెట్లు నీటి ఎ ద్దడిని తట్టుకోవడాని కి ఆస్కారం ఉం టుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అంతేగాక కెనాల్ సమీపాన ఉన్న గ్రా మాస్తులకు తాగునీటికి అవకాశం లభించి ంది. సమీపంలోని బోర్‌బావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం కూడా ఉంది. తుంగభద్రకు జల కళ అలంపూర్: తుంగభద్ర నదికి వేసవిలో జల కళ వచ్చింది. సాధారణంగా వేసవిలో నదిలో నీటి ప్రవాహం తగ్గి తాగునీటి, ఎత్తిపోతల పథకాలకు నీరందని పరిస్థితి ఉండేది. అనూహ్యంగా తుంగభద్రకు నీరు వచ్చి చేరడంతో నదిలో నీటి ప్రవాహం కొంత పెరిగింది. నదీకి నీరు చేరడంతో తాగునీటి, ఎత్తిపోతల పథకాలకు కొంత ఊరట చేకూరనుంది. నది పక్కలోనే పంట సాగు చేస్తున్న రైతులకు కొంత వరకు మేలు చేకూరుతుంది.