తుంగభద్రకు జలకళ
► కర్ణాటకలో భారీవర్షాలు
► తుంగభద్రకు పోటెత్తిన వరద
► టీడీడ్యాం నుంచి నీటివిడుదల
► 29వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీటిపారుదల
► ఆయకట్టు పంటలకు ఊపిరి
► తీరనున్న తాగునీటి సమస్య
► ఇండెంట్‌కు స్పందించిన అధికారులు
శాంతినగర్ : వేసవిలోనూ ఆర్డీఎస్ కెనాల్ నిండుకుండలా ప్రవహిస్తోంది. ప్రతిఏట లేట్‌ఖరీఫ్‌కు అందని సాగునీరు ఈ ఏడాది పూర్తిస్థాయిలో పారుదల అవడమేగాక ఏప్రిల్ చివరలోను నీరు ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులేగాక మండల ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వడ్డేపల్లి మండల పరిధిలోని డిస్ట్రిబ్యుటరి 24 నుండి 28 వరకు ఉన్న చివరి ఆయకట్టుకు ప్రతిఏట సాగునీరందక పోవడం, పంటలు చివరిదశలో ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు.
ఈ ఏడాది అధికారుల ముందస్తు ప్రణాళిక, వరుణదేవుడు అనుకూలించడంతో పూర్తిస్థాయిలో రైతులు పంటలు పండించుకోగలిగారు. ఏప్రిల్ మొదటివారం వరకు ఇండెంట్ నీటి వాటాతో ప్రవహిం చిన ఆర్డీఎస్ కెనాల్‌కు వచ్చే ఖరీఫ్ వరకు నీరు కూడా వచ్చేవికావు. ఎగువనఉన్న కర్నాటక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షా లు కురవడంతో తుంగభద్రకు టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌వద్ద నీటి ప్రవాహం ఓవర్‌ఫ్లో అవుతూ వస్తోంంది.
స్పందిం చిన ఆర్డీఎస్ అధికారులు కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ఎగువన ఉన్న 12 తూములను మూయించి దిగువకు నీటిని విడుదల చేస్తూ వస్తున్నా రు. ప్రస్తుతం డిస్ట్రిబ్యుటరి 29 వరకు నీర ందుతోంది. జూలెకల్ శివారులోని ప్రధా న కాలువలో ఐదు అడుగులమేర నీరు ప్రవహిస్తోంది. ఊహించని విధం గా ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు రావడంతో సుబాబు ల రైతులకు అదృష్టం వరించినట్లయింది.
ప్రస్తుతం పూర్తిస్థాయిలో తడులు ఇస్తే జూ న్‌లో వర్షాలు కురిసే వరకు చెట్లు నీటి ఎ ద్దడిని తట్టుకోవడాని కి ఆస్కారం ఉం టుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అంతేగాక కెనాల్ సమీపాన ఉన్న గ్రా మాస్తులకు తాగునీటికి అవకాశం లభించి ంది. సమీపంలోని బోర్‌బావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
తుంగభద్రకు జల కళ
అలంపూర్: తుంగభద్ర నదికి వేసవిలో జల కళ వచ్చింది. సాధారణంగా వేసవిలో నదిలో నీటి ప్రవాహం తగ్గి తాగునీటి, ఎత్తిపోతల పథకాలకు నీరందని పరిస్థితి ఉండేది. అనూహ్యంగా తుంగభద్రకు నీరు వచ్చి చేరడంతో నదిలో నీటి ప్రవాహం కొంత పెరిగింది. నదీకి నీరు చేరడంతో తాగునీటి, ఎత్తిపోతల పథకాలకు కొంత ఊరట చేకూరనుంది. నది పక్కలోనే పంట సాగు చేస్తున్న రైతులకు కొంత వరకు మేలు చేకూరుతుంది.