మలుపు మింగేసింది
– నన్నూరు సమీపంలో రోడ్డు ప్రమాదం
– ఒకరు మృతి, నలుగురికి గాయాలు
ఓర్వకల్లు : కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నన్నూరు సమీపంలోని రబ్బాని గోడౌన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. కాల్వ గ్రామానికి చెందిన గోవిందరాజులు(40) హుసేనాపురానికి చెందిన రాముడు కారులో కర్నూలుకు బయలుదేరారు. మార్గమధ్యలో రబ్బాని గోడౌన్ వద్దకు చేరుకోగానే కర్నూలు వైపు నుంచి రబ్బాని గోడౌన్‌కు ధాన్యం బస్తాలు తరలిస్తున్న ‘ఐచర్’ వాహనం మలుపు తిరిగే క్రమంలో కారును బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న గోవిందరాజులు అక్కడికక్కడే మతిచెందాడు. రాముడు స్వల్పంగా గాయపడ్డాడు. అదే సమయంలో కారు వెనుక వేగంతో వస్తున్న బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న లొద్దిపల్లె గ్రామానికి చెందిన విజయ్, నాగలక్ష్మి, రామలింగమ్మ గాయపడ్డారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజులు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మతునికి భార్య అనుపమ, ముగ్గురు కుమార్తెలున్నారు.