రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: కాల్వబుగ్గ–రామళ్లకోట రహదారిలో శనివారం రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. బేతంచెర్ల మండలం యంబాయి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(42) హుసేనాపురం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో కంకర ఫ్యాక్టరీ మలుపు వద్ద అదే గ్రామానికి చెందిన స్వాములు బైకు వస్తుండగా ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు తీవ్రంగా రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్వాములు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.