బైక్‌లు ఢీకొని ఇద్దరి దుర్మరణం | Stumbling bikes, two killed | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీకొని ఇద్దరి దుర్మరణం

Published Tue, Nov 11 2014 3:19 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

బైక్‌లు ఢీకొని ఇద్దరి దుర్మరణం - Sakshi

బైక్‌లు ఢీకొని ఇద్దరి దుర్మరణం

రొళ్ల:
 మండల పరిధి హొట్టేబెట్ట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యూరు. వివరాలు ఇవీ... గుడిబండ మండలం పూజారిపల్లికి చెందిన పాతలింగప్ప(వెంకటేష్-32) ద్విచక్రవాహనంపై మడకశిర వైపు వెళుతుండగా, మడకశిర వైపు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం కల్లురొప్పం వస్తున్న జయరామప్ప కుమారుడు రాజన్న(32) హొట్టెబెట్ట మలుపు వద్ద ఢీకొట్టాడు.

దీంతో తలకు బలమైన గాయమైన రాజన్న ప్రమాద స్థలంలోనే మృత్యువాతపడ్డాడు. కొన  ఊపిరితో ఉన్న వెంకటేష్‌ను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు,  చుట్టుపక్కల ప్రజలు తరలివచ్చి సంఘటన జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. స్థానిక ఎస్‌ఐ ఆంజినేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వెంకటేష్‌కు భార్యతోపాటు కుమార్తె ఉంది. రాజన్నకు భార్య(ప్రస్తుతం ఆమె గర్భవతి), కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం పావగడ ఆస్పత్రికి తీసుకెళ్లి పనిమీద స్వగ్రామానికి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఆకస్మికంగా మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ కొత్తపాళ్యం తిమ్మప్ప, నాయకులు అనంతరాజు, నరసింహారెడ్డి, ప్రకాష్‌తోపాటు కాంగ్రెస్ కన్వీనర్ దేవరాజు కొల్లురొప్ప గ్రామానికి చేరుకుని రాజన్న మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement