Twin murder case
-
పట్టుబడిన కిరాతకులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల జరిగిన వేర్వేరు జంట హత్యల కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మలికాగర్గ్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 3న రాత్రి టంగుటూరుకు చెందిన బంగారం వ్యాపారి జలదంకి రవి భార్య శ్రీదేవి(43), ఆమె కుమార్తె వెంకట లేఖన (19)లు దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు నిఘా పెట్టి టంగుటూరు ఎస్.జంక్షన్ వద్ద ఆదివారం అక్కల శివకోటయ్య, కంకిపాటి నరేష్‌లను అరెస్ట్ చేశారు. గతంలో సంచలనం సృష్టించిన చీమకుర్తి డబుల్ మర్డర్ కేసు కూడా వీరే చేసినట్లు విచారణలో తేలింది. జైలులో పరిచయంతో.. కందుకూరు సాయినగర్‌కు చెందిన అక్కల శివకోటయ్య, జరుగుమల్లి మండలం దావగూడూరుకు చెందిన కంకిపాటి నరేష్‌లకు గతంలో కేసులకు సంబంధించి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక నరేష్ ఇటీవల టంగుటూరులో మెకానిక్ షాపు తెరిచాడు. తన షాపునకు ఎదురుగా ఉన్న రోడ్డులో జలదంకి రంగాకు చెందిన బంగారం దుకాణంలో గతేడాది జూన్‌లో బంగారం ఎత్తుకెళ్లారు. అనంతరం జలదంకి రవికిషోర్ ఇంట్లోకి వెళ్లి రంగా కుమార్తె లేఖన, భార్య శ్రీదేవిలను హత్య చేసి బంగారు నగలు దోచుకెళ్లారని దర్యాప్తులో తేలింది. చీమకుర్తిలో 2018 సెప్టెంబర్ 18న జరిగిన జంట హత్యల కేసులోనూ అక్కల శివకోటయ్య నిందితుడిగా గుర్తించారు. వెంకటసుబ్బారావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి ఆయనను ఇనుపరాడ్డుతో హతమార్చాడు. సుబ్బారావు భార్య రాజ్యలక్ష్మిని కూడా ఇనుప రాడ్‌తో హత్యచేసి బంగారంతో ఉడాయించినట్లు తేలింది. విచారణలో నిందితులు మరో మూడు నేరాలు చేసినట్లు తేలింది. మొత్తం రూ.53.48 లక్షల సొత్తు చోరీ కాగా.. నిందితుల నుంచి రూ.32.48 లక్షల సొత్తును పోలీసులు సీజ్ చేశారు. 612 గ్రాముల బంగారం, ఒక ఫోర్డ్‌కారు, రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. -
విద్యార్థినుల 'మిస్టరీ' హత్య కేసు సీఐడీకి
- డీఎస్పీ బాలు జాదవ్‌కు దర్యాప్తు బాధ్యతలు నర్సంపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇంకా మిస్టరీగానే ఉండిపోయిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల హత్యకేసు దర్యాప్తు సీబీసీఐడీ విభాగానికి బదిలీ అయింది. రెండు నెలలు కావస్తున్నప్పటికీ నిందితులను వెదికిపట్టుకోవడంలో జిల్లా పోలీసులు విఫలం కావడంతో సీఐడీ దర్యాప్తు అనివార్యమైంది. చనిపోయిన బాలికల తల్లిదండ్రులు 20 రోజుల కిందట డీజీపీ అనురాగ్‌శర్మను కలసి దర్యాప్తును వేగవంతం చేయాలని వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్‌కు అప్పగించారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు జారీ అయ్యాయని, మేడారం జాతర బందోబస్తులో ఉండడం వల్ల బాధ్యతలు తీసుకోలేకపోయానని, అతి త్వరలోనే కేసును టేకప్ చేస్తానని డీఎస్సీ జాదవ్ 'సాక్షి'కి తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న భానోత్ భూమిక, భానోత్ ప్రియూంకలను గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా చంపి, పూడ్చిపెట్టిన ఉదంతం గత ఏడాది డిసెంబర్ 27న వెలుగులోకి వచ్చింది. చెన్నారావుపేట వుండలం ఖాదర్‌పేట గుట్ట వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సవాల్‌గా నిలిచిన ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. -
ఆరుషి తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష
ఆరుషి జంట హత్యల కేసులో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష పడింది. న్యాయస్థానం మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వారికి శిక్ష ఖరారు చేసింది. అయిదున్నరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు... ఆరుషి తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లను దోషులుగా తేల్చింది. రాజేష్ దంపతులే ఆరుషితో పాటు పనిమనిషి హేమరాజ్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. దోషులుగా తేలిన రాజేష్ దంపతులకు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ... దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కాగా తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు నూపూర్ తల్వార్ దంపతులు సిద్ధం అవుతున్నారు. కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై నేడు కూడా వాదనలు జరిగాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.