Udyama Simham Movie
-
యూట్యూబ్‌లో...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య తారాగణంగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కింది. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 29న విడుదలకావాల్సి ఉంది. కొందరు ఈ సినిమా విడుదల కాకుండా ఇబ్బందులు సృష్టిస్తుండటంతో ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడి కేసీఆర్‌గారు తెలంగాణను సాధించారు? బంగారు తెలంగాణాగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటి? అన్నదే ఈ చిత్రకథ. సినిమా చాలా బాగా వచ్చింది. అయితే కొందరు మా సినిమా విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లని, సినిమా థియేటర్ ఓనర్స్‌ని బెదిరించారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో ఫ్రీగా విడుదల చేస్తున్నా. ఈ చిత్రానికి కాపీ రైట్స్ సమస్య లేదు. ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, కెమెరా: ఉదయ్ కుమార్. -
‘ఉద్యమ సింహం’ యూట్యూబ్ లో విడుదల
తెలంగాణ ఉద్యమసారధి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం 29న విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ఈ సినిమా విడుదల అవ్వకుండా సమస్యలు రేపుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లని , సినిమా థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమాను ఎవరు విడుదల చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. అయితే నిర్మాతలు కల్వకుంట్ల నాగేశ్వర రావు ఎవరికి భయపడకుండా ఉద్యమ సింహం చిత్రాన్ని యూట్యూబ్ లో టీవీ చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భం గా ఫిలించాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ "ఉద్యమ సింహం సినిమా ని ఈ నెల 29 న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ కొందరు మా సినిమాను విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. ఈ సినిమా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథ తో ఉండే సినిమా. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కేసీఆర్ సాధించాడు. ఆ తరువాత దాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు అయన చేస్తున్న కృషి ఏమిటన్నది ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను యూట్యూబ్ , టీవీ చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నాను. యూట్యూబ్ నిర్వాహకులు మీ సినిమాని మా ఛానల్లో పెట్టుకోవచ్చు , కాపీ రైట్స్ సమస్య లేదు. ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు" అని తెలిపారు. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి దిలీప్ బండారి సంగీతాన్ని అందించారు. -
విడుదలైన ‘ఉద్యమ సింహం’ ఆడియో
పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్ (కరాటే రాజా) కేసీఆర్ పాత్రలో నటిస్తున్నారు. సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిలీప్ బండారి సంగీతం అందిచారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. కరాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్కరించారు. నటుడు రవివర్మ టీజర్ రిలీజ్ చేసారు. అనంతరం కరాటే రాజా మాట్లాడుతూ, ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేసాను. కానీ ఉద్యమ సింహం వాటికి భిన్నంగా, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప పాత్ర’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘కేసీఆర్ గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన కథను వీళ్లంతా ఓ టీమ్ గా ఏర్పాటై తెరకెక్కించటం చాలా సంతోషంగా ఉంది. నాలుగు పాటలు, ఫైట్లు, హీరోయిన్ పెట్టుకుని కమర్శియల్ సినిమా చేసి డబ్బులు వచ్చేలా సినిమా చేయోచ్చు. కానీ నిర్మాత కేసీఆర్ పై అభిమానంతో ఇష్టంతో సినిమా చేయడం గొప్ప విషయం. ఇలాంటి ఉద్యమనేత సినిమా యువతలో స్ఫూర్తిని నింపుతుంద’న్నారు. చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘కేసీఆర్ కథని సినిమాగా చేయడం కష్టం. ఆయన గురించి ఎంతో కథ ఉంది. మూడు గంటల్లో చెప్పేది కాదు. అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలతో కథ తయారు చేసుకున్నాం. మంచి సందేశాత్మక సినిమా అవుతుంది.ఈ నెలాఖరున సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తాం’ అని అన్నారు. చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ‘మంచి కథ ఇది. తెలుగు ప్రేక్షకులంతా కేసీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాత, నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మారు కాబట్టే సినిమా చేయగలిగాను. నా డైరెక్షన్ టీమ్ నాకన్నా ఎక్కువగా కష్టపడింది. అందుకే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాను’ అన్నారు. -
టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది
‘‘ఉద్యమ సింహం’ టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేసీఆర్‌గారంటే నాకు ఇష్టం. నిర్మాతలంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో నాగేశ్వరరావుగారు కేసీఆర్‌పై సినిమా చేయడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా ఇది. కొన్ని సీన్స్ చూశా.. చాలా బాగా తీసారు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ప్రధాన పాత్రల్లో అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందించి, నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘జూన్‌లో ప్రారంభించిన ‘ఉద్యమ సింహం’ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయింది. మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ నెల 16న ఆడియో, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం. కేసీఆర్ పాత్ర ఎవరు పోషించారు? మిగతా నటీనటులు ఎవరు? అన్నది ఆడియో విడుదల రోజున చెబుతాం’’ అని అల్లూరి కృష్ణంరాజు అన్నారు. సంగీత దర్శకుడు దిలీప్ బండారి, మాటల రచయిత కృష్ణ రాపోలు, ఛాయాగ్రాహకుడు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ∙నాగేశ్వరరావు, రాజ్ కందుకూరి -
కేసీఆర్ బయోపిక్.. ఫస్ట్ లుక్ ఇదే!
పద్మనాయక ప్రొడక్షన్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ ఉద్యమ సింహం టైటిల్ల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కేసీఆర్ నాకు ఇష్టమైన నాయకులు. ఆయనపై ఎంతో ఇష్టంతో దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్న రోజుల్లో నాగేశ్వరరావు ఆయనపై అభిమానంతో, ఎంతో ఇష్టంతో కేసీఆర్ పై సినిమా చేయడం గొప్ప విషయం. కేసీఆర్ పై సినిమా అనగానే? అంతా ఆయన రాజకీయన నేపథ్యంపై చేస్తున్నారనుకుంటున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా. కేసీఆర్ బయోపిక్ లా ఆయన గురించి అన్ని విషయాలు సినిమాలో చూపిస్తున్నట్లు నాకు చెప్పారు. కొన్ని సీన్స్ చూసాను. చాలా బాగా తీశారు’ అని అన్నారు. చిత్ర నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, ` జూన్ లో సినిమా ప్రారంభించాం. నేటి (సోమవారం)తో షూటింగ్ పూర్తయింది. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. టెక్నికల్ గాను సినిమా బాగా వస్తోంది. 16న ఆడియా విడుదల చేస్తాం. అతిత్వరలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు. చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ` కథ ఎంత బాగో వచ్చిందో.. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలో సినిమాలో చూపించబోతున్నాం. సినిమా నిర్మాణానికి నాగేశ్వరరావు ఎక్కడా రాజీపడలేదు. ఎంతో ఫ్యాషన్ తో సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 16న ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆరోజున కేసీఆర్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? మిగతా నటీనటులు ఎవరు? అనేది రివీల్ చేస్తాం` అని అన్నారు.ఈ చిత్రంలో జెన్నీ, సి.హెచ్.పి.విఠల్, ఆకేళ్ల గోపాలకృష్ణ, గిరిధర్, జలగం సుధీర్, మాధవిరెడ్డి, లత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సి.హెచ్. రాములు, కొరియోగ్రఫీ: గణేష్, ఫైట్స్: సూపర్ ఆనంద్, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫి: ఉదయ్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రాపోలు కృష్ణ అందిస్తున్నారు. -
సెట్లో చెత్త ఎత్తిన సీనియర్ యాక్టర్
సినిమాల్లో తెరపై నీతులు చెప్పే స్టార్లు.. రియల్ లైఫ్‌లో అది పాటించటం చాలా అరుదు. అయితే విలక్షణ నటుడు నాజర్ మాత్రం అలా కాదు. స్వయంగా తానే సెట్లో చెత్త ఎత్తి చూపించారు. పంచె ఎగ్గట్టి స్పాట్లో టీ కప్పులు, చెత్త కవర్లను ఏరి డస్ట్ బిన్లో పడేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అది పట్టించుకోకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఆ ఘటనను తన మొబైల్లో షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ వ్యక్తి తెలుగు మాట్లాడటం గమనించొచ్చు. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? వీడియో పాతదా? కొత్తదా? స్పష్టతలేదుగానీ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సీనియర్ నటుడు, పైగా నడిగర్ సంఘం ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కూడా ఆయన అలా చేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం లో నాజర్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. -
చాలా గర్వంగా ఉంది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. కేసీఆర్ పాత్రలో నటుడు నాజర్ నటిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాజర్ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి.. గెలిచిన కేసీఆర్‌గారి పాత్రలో నటించడం చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. కేసీఆర్‌గారి వీడియోలు చాలా చూశా. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా’’ అన్నారు. ‘‘కేసీఆర్‌గారు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం నుంచి బంగారు తెలంగాణ వరకు ఈ సినిమా ఉంటుంది. నవంబర్ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్రావు. ‘‘కేసీఆర్‌గారి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. నాజర్గారైతే పర్ఫెక్ట్గా ఉంటుందని ఆయన్ని తీసుకున్నాం’’ అన్నారు కృష్ణంరాజు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి, సహ నిర్మాత: మేకా రాఘవేంద్ర. -
కేసీఆర్ బయోపిక్.. ‘ఉద్యమ సింహం’
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.