కృష్ణంరాజు, నాగేశ్వర రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య తారాగణంగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కింది. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 29న విడుదలకావాల్సి ఉంది. కొందరు ఈ సినిమా విడుదల కాకుండా ఇబ్బందులు సృష్టిస్తుండటంతో ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడి కేసీఆర్‌గారు తెలంగాణను సాధించారు? బంగారు తెలంగాణాగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటి? అన్నదే ఈ చిత్రకథ. సినిమా చాలా బాగా వచ్చింది. అయితే కొందరు మా సినిమా విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లని, సినిమా థియేటర్ ఓనర్స్‌ని బెదిరించారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో ఫ్రీగా విడుదల చేస్తున్నా. ఈ చిత్రానికి కాపీ రైట్స్ సమస్య లేదు. ఎవరైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, కెమెరా: ఉదయ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment