Ultraviolet rays
-
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Dark Skin: షియాబట్టర్, అలోవీరా ఉండే మాయిశ్చరైజర్ రోజూ రాసుకుంటే!
సాధారణంగా దుస్తులు కప్పి ఉంచే భాగాలు మంచి నిగారింపుతోనూ, కప్పి ఉంచని భాగాల్లో అంటే చేతులు, ముఖం మరీ నల్లగానూ ఉండటం మామూలే. కానీ కొన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ తేడా ఎక్కువగా కనిపిస్తుండటంతో యువతీ యువకులు మరీ ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారు బాధపడుతుంటారు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు అల్ట్రా వయొలెట్ కిరణాల కారణంగా కొద్దిగా డార్క్‌గా మారుతుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు మరీ నల్లగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా మెరుస్తూ, మంచి నిగారింపుతో ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతంలో చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మాయిశ్చరైజర్ పూసుకోవడం మంచిది. ►బయటికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలు... అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ప్రతి మూడుగంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. ఆరుబయట ఎండలో ఉన్నంతసేపు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ►గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో చర్మంపై పూసుకోండి. ►ఫుల్స్లీవ్స్ దుస్తులు తొడుగుతున్నప్పుడు ఆ భాగాలు మిగతాచోట్ల కంటే ఎక్కువ నిగారింపుతోనూ, ఫెయిర్‌గానూ ఉండటం తెలిసిందే. అందుకే మామూలు సమయాల్లో వీలైనంతవరకు ఫుల్స్లీవ్స్ ధరిస్తూ... ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడు టీ–షర్ట్స్ వేసుకుంటే... ఫుల్స్లీవ్స్ వల్ల నిగారింపుతో ఉన్న భాగాలు మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ►ఈ సూచనల తర్వాత కూడా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే భాగాలు, మిగతా భాగాల్లో తేడా ఇంకా ఎక్కువ డార్క్గానే ఉన్నట్లయితే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో ఈ తేడాను సరిచేస్తారు. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
గరిష్ట వార్షిక పరిమాణానికి చేరుకున్న ఓజోన్ రంధ్రం
అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం దాని ‘గరిష్ట వార్షిక పరిమాణానికి’ చేరుకుందని ఓజోన్ పొరను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల సంవత్సరాలలో ఇది అతిపెద్ద, లోతైన వాటిలో ఒకటి అని వారు తెలిపారు. ఓజోన్ పొర భూ ఆవరణలలో ఒకటైన స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఆ కిరణాల నుంచి మానవాళిని ఇతర ప్రాణులను కాపాడుతుంది. ఇండిపెండెంట్.కో. యూకే నివేదిక ప్రకారం, కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) శాస్త్రవేత్తలు ఓజోన్ సాంద్రతలు అంటార్కిటికాపై 20 - 25 కిలోమీటర్ల ఎత్తులో సున్న విలువకు పడిపోయాయని కనుగొన్నారు. ఈ జోన్‌ను ట్రైఆక్సిజన్ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఓజోన్ పొరలో చిన్న రంధ్రం ఏర్పడిందని, అది తరువాత పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలైన క్లోరో ఫ్లోరో కార్భన్ల( సీఎఫ్‌సీ)పై నిషేధాన్ని అమలు చేయాలని సైంటిస్ట్‌లు 2019లో చాలా బలంగా చెప్పారు. సీఎఫ్‌సీ ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. గత వారం నుంచి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో ఓజోన్ క్షీణత ఎక్కువ అయ్యిందని సైంటిస్ట్‌లు తెలిపారు. 2019లో స్వల్ప ఓజోన్ పొర క్షీణతను గుర్తించిన తాము ఈ ఏడాది కొంచెం పెద్ద రంధ్రాన్నే కనుగొన్నామని వారు చెప్పారు. దీనిని ఆపాలంటే మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అన్ని దేశాలు తప్పకుండా పాటించాలని సైంటిస్ట్‌లు విజ్ఞప్తి చేశారు. చదవండి: షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు.. -
ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
జెనీవా: హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది. -
రసాయనాలు తాగించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి చూస్తున్న ట్రంప్ అత్యంత ప్రమాదకర సలహాలు ఇవ్వడానికీ వెనుకాడటం లేదు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా అధ్యయనంలో సూర్యరశ్మి, గాలితో తేమ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తేలింది. దీంతో ట్రంప్ కోవిడ్ రోగులకు వైరస్‌ను నాశనం చేసే రసాయనాలు ఇంజెక్ట్ చేయాలని, అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించి వైరస్‌ను చంపాలని సలహా ఇచ్చారు. వైట్ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో హోంల్యాండ్ సెక్యూరిటీ చేసిన అధ్యయనం ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్ బ్రయాన్ వెల్లడించిన వెంటనే ట్రంప్ కోవిడ్ రోగుల్లోకి వైరస్‌ను చంపేసే రసాయనాలు ఇంజెక్ట్ చేయాలని సలహా ఇచ్చారు. ‘రసాయనాలు, ఎండ తీవ్రతకి వైరస్ కేవలం నిముషంలోనే చచ్చిపోవడం చూస్తున్నాం. కోవిడ్ రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్ కిరణాల్ని పంపించి చంపలేమా ? అది ఎలా చేయాలో ఆలోచించండి’అంటూ వ్యాఖ్యాని ంచడం అందరినీ విస్మయంలోకి నెట్టేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. రోగుల ప్రాణాలతో ఆడుకునే అలాంటి ప్రమాదకరమైన సలహాలు పాటించవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. చైనా మూల్యం చెల్లించుకుంటుంది కరోనా మహమ్మారిపై సమాచారాన్ని ఇతర దేశాలతో పంచకుండా ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన చైనా తగిన మూల్యం చెల్లించు కుంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ► బ్రిటన్ యువరాజు చార్లెస్ భారత్ సహా దక్షిణాసియా దేశాలను ఆదుకోవడానికి కోవిడ్ అత్యవసర నిధిని ప్రారంభించారు. ► టర్కీలో ఇస్తాంబుల్ మరో వూహాన్‌గా మారిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫరేటిన్ కోకా ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీలో లక్షా 4 వేలకి పైగా కేసులు నమోదైతే, 2,600 మంది వరకు మృతి చెందారు. అందులో అత్యధికభాగం ఇస్తాంబుల్‌లోనే నమోదయ్యాయి. ► రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై బంగ్లాదేశ్ నిషేధం విధించింది. దేశంలో కరోనా కేసులు 5 వేలకు చేరడంతో అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో 50 వేల మంది మృతి అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 50వేల మరణాలు దాటాయి. గత 24 గంటల్లోనే 3,176 మంది మరణించినట్లు తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మరణాలు నమోదైన దేశం అమెరికానే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడొంతుల్లో ఒక వంతు అగ్రరాజ్యంలోనే ఉన్నాయి. -
వర్షాకాలం.. జిడ్డుగా ఉంటే..
వర్షాకాలం చర్మం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు నూనెగ్రంథులు ఎక్కువ నూనెను స్రవించడంతో చర్మం జిడ్డుగా అనిపిస్తుంది. వానలో తడిసి, ఆరగానే పొడిబారినట్టుగా గరుకుగా చేతికి తగులుతుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే... ♦ ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, చర్మానికి బాగా ఇంకాక శుభ్రపరుచుకోవాలి. ♦ దానిమ్మలో చర్మం ముడతలు పడనివ్వని ఓషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు ఈ కాలం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కాంతిని పెంచుతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం, కప్పుడు ఓట్స్, 2 టేబుల్స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి, కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి, మెత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నిగారింపు పెరుగుతుంది. ♦ ఈ కాలం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా, లేదా! అనే సందేహం తలెత్తుతుంది. జిడ్డు ఎక్కువ అనిపించేది కాకుండానూ, అలాగని పొడిబారనీయని లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఎంచుకోవాలి. ♦ వాతావరణం మబ్బులుగా ఉంటుంది కదా, సన్‌స్క్రీన్ అవసరం ఉండదని చాలా మంది అభిప్రాయం. కానీ, మబ్బుల దాటుకుని వచ్చే సూర్యకాంతిలోనూ అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ లోషన్ (ఎస్.పి.ఎఫ్ -30) రాసుకోవాలి. ♦ జిడ్డును నియంత్రించాలంటే 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టేబుల్‌స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి, ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ♦ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకని సోప్-ఫ్రీ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ (మార్కెట్లో లభిస్తుంది) ని ఉపయోగించడం మేలు. -
హ్యాంగర్.. సూపర్..
ఇదో వినూత్న హ్యాంగర్. దీని పేరు ప్యూర్ టవల్. మనం స్నానం చేసి.. తుడుచుకున్న తర్వాత టవల్‌ను ఈ హ్యాంగర్‌కు తగిలిస్తే చాలు.. సెకన్లలో శుభ్రపరిచేస్తుంది. ఇందులో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాలు బ్యాక్టీరియాను చంపేసి.. టవల్‌ను శుభ్రపరుస్తాయి. అంతేకాదు.. ఇందులో ఉండే హైస్పీడ్ డ్రయర్ వెంటనే దీన్ని అరబెట్టేస్తుంది. ఇందుకు పట్టే సమయం 10 సెకన్లే! ఈ డిజైన్‌ను మెక్సికోకు చెందిన లియోబార్డో అర్మెంటా రూపొందించారు. ఎలక్ట్రోలక్స్ డిజైన్ ల్యాబ్ అవార్డు-2014కు పోటీ పడుతున్న డిజైన్లలో ప్యూర్ టవల్ కూడా ఒకటి. -
మైక్రో ఓవెన్లలో ఉండే తరంగాలు?
Civils Prelims Paper - I (Physics) కాంతి (అదృశ్య వికిరణాలు) అతి నీలలోహిత కిరణాలు అతి నీలలోహిత కిరణాలను రిట్టర్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్యం 4000అని నుంచి 100అని వరకు ఉంటుంది.క్వాంటం సిద్ధాంతం ప్రకారం. ఈ కిరణాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అతి నీలలోహిత కిరణాలను దాదాపు అన్ని రకాలైన గాజు పదార్థాలు శోషణం చేసుకుంటాయి. క్వార్ట్జ గాజు ద్వారా ఈ కిరణాలు చొచ్చుకు వెళతాయి. అందువల్ల క్వార్ట్జ గాజుతో తయారైన కటకాలను, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని గుర్తించవచ్చు. అతి నీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి. అనువర్తనాలు: 1. పాలలో, నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేయడానికి 2. ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలంపాటు నిల్వ చేయడానికి ఉదా: బ్రెడ్, పచ్చళ్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాటికి సోడియం బెంజోయేట్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు. 3. వైద్యరంగంలో హానికరమైన బ్యాక్టీరియాను నశింపచేసేందుకు వాడతారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. 4. సహజ, కృత్రిమ దంతాలను వేర్వేరుగా గుర్తించడానికి వాడతారు. 5. కుళ్లిన కోడిగుడ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. 6. తొలిదశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను గుర్తించడానికి 7. టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో 8. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడంలో 9. అతినీలలోహిత కిరణాలు మన శరీరంపైన పతనమైనప్పుడు 1ఝఝ లోతుకు చొచ్చుకొని వెళ్లి విటమిన్ ఈ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. 10. వేలిముద్రలను విశ్లేషించడానికి 11. {ధువ పత్రాలు, కరెన్సీ నోట్లు అసలువా, నకిలీవా తేల్చడానికి ఉపయోగిస్తారు. నష్టాలు: సూర్యుని నుంచి వచ్చే మొత్తం కాంతిలో అతి నీలలోహిత కిరణాలు 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కిరణాల శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మానవులపై పతనమైనప్పుడు చర్మ క్యాన్సర్ కలుగుతుంది. ఈ హానికరమైన కిరణాలను భూమి వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కాబట్టి ఈ కిరణాలు భూమిని చేరవు. కానీ క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడి వాటి ద్వారా ఈ కిరణాలు భూమిని చేరుతున్నాయి. కాబట్టి ఈ నష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జపాన్‌లోని క్యోటోనగరంలో 1996 డిసెంబరులో ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 16న ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని క్యోటో ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 2005 ఫిబ్రవరి 16న అమల్లోకి వచ్చింది. లేజర్ కిరణాలు LASER - Light Amplification by Stimulated Emmision of Radiation. లేజర్ కిరణాలకు సంబంధించిన సూత్రాన్ని 1954లో చార్లెస్ హెచ్టౌన్స ప్రతిపాదించాడు. ఈ సూత్రం ఆధారంగా 1958లో థైడర్మెమన్ అనే శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. లేజర్ కిరణాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. ఘన పదార్థాల్లో రూబిస్ స్ఫటికాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. వాయు పదార్థాల్లో జడవాయువులను (హీలి యం, నియాన్) ఉపయోగించి హెవిజావాన్ అనే అమెరికా శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. ఈ వాయువుల నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: సంబద్ధత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం లాంటివి సమానంగా ఉంటాయి. ఈ లక్షణాన్ని సంబద్ధత అంటారు. ఏకవర్ణీయత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల తరంగదైర్ఘ్యం ఎల్లప్పుడూ కూడా ఒకేవిధంగా ఉండటం వల్ల ఈ కిరణాల రంగు కూడా ఒకే విధంగా ఉంటుంది. దీన్ని ఏకవర్ణీయత అంటారు. దిశనీయత: లేజర్ కిరణాలు అత్యధిక దూరం రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఈ లక్షణాన్ని దిశనీయత అంటారు. తీవ్రత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాలు అధిక తీవ్రతను కలిగి ఉంటాయి. ఉపయోగాలు: మానవ అవసరాల మేరకు తగిన శక్తిని కలిగి ఉన్న లేజర్ కిరణాలను ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి. - భూమి నుంచి ఇతర గ్రహాలు, ఉపగ్రహాలకు మధ్య దూరాలను కచ్చితంగా లెక్కించడానికి - భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యను, ఎత్తును తెలుసుకోవడానికి - భూమి ఆత్మభ్రమణ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి - ఒక ఘన పదార్థంలో అణువుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడానికి - భిన్న ఐసోటోపులను గుర్తించి, వాటిని వేరుచేయడానికి - పుప్పొడి రేణువుల కదలికలను అధ్యయనం చేయడానికి - అత్యంత దృఢ పదార్థాలైన వజ్రం, లోహాలు, లోహమిశ్రమాలు, రాళ్లు మొదలైన వాటికి రంధ్రాలను చేయడానికి, కోయడానికి - అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విస్ఫోటనం చెందించడానికి - యుద్ధంలో లక్ష్యాన్ని గురిపెట్టడానికి - పురాతన కట్టడాలు, విగ్రహాలను శుభ్రపరిచేందుకు - సాంస్కృతిక కార్యక్రమాల్లో (లేజర్ షో) బార్‌కోడ్‌లను చదవడానికి స్పష్టమైన ప్రింటింగ్, జిరాక్స్‌ల కోసం ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఉపయోగించే లేజర్ కిరణాలను అర్ధవాహక పదార్థాలైన సిలికాన్, జెర్మేనియం నుంచి ఉత్పత్తి చేస్తారు. - వాహనాల వేగాన్ని లెక్కించడానికి, స్పీడ్‌గన్ అనే కెమెరా, సిడీలు, డీవీడీలు మొదలైన వాటిలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి - ఆప్టికల్ ఫైబర్‌లో సమాచార ప్రసారం కోసం - ఎండోస్కోపిక్ విధానంలో - హోలోగ్రఫీ విధానంలో ఒక వస్తువును 3డీ పద్ధతిలో ఫొటో తీయడానికి వాడతారు. - వాతావరణ కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి అంటారు. - రెటీనాపై ఏర్పడే పొరను తొలగించడానికి - గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి - మెదడులో ఏర్పడిన కణతులను తొలగిం చడానికి - సుదూరం ప్రయాణించే రాకెట్లు, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగిస్తారు. లేజర్ కిరణాల ధర్మాలను అధ్యయనం చేసి, వాటిని ఉత్పత్తి చేయడానికి భారత అణుశక్తి సంఘం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డాక్టర్ రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. రేడియో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 1ఝ నుంచి 100ఝ వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. వీటి వేగం శూన్యంలో, గాలిలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఈ తరంగాలను టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో, వాతావరణాన్ని విశ్లేషించ డంలో ఉపయోగిస్తారు. మైక్రో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 10-6ఝ పరిధిలో ఉంటుంది. మైక్రో తరంగాలు కూడా ఒకరకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అందువల్ల ఈ కిరణాలు గాలిలో, శూన్యంలో కాంతివేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. మైక్రో తరంగాలను సమాచార రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఒక ప్రదేశాన్ని భౌతికంగా తాకకుండా, దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పద్ధతిని సెన్సింగ్ విధానం అంటారు. మైక్రో ఓవెన్లలో ఆహార పదార్థాలను వేడిచేయడానికి ఈ తరంగాలను వాడతారు. ఆహార పదార్థాలను అలోహ పదార్థాలతో తయారు చేసిన పాత్రల్లో నింపి మైక్రో ఓవెన్లో అమర్చాలి. ఈ మైక్రో తరంగాలు ఆహారపు అణువుల్లోకి చొచ్చుకుపోయి వాటి కంపన పరిమితిని అనేకరెట్లు పెంచుతాయి. అందువల్ల ఈ కంపన శక్తి ఉష్ణశక్తిగా మారడం వల్ల ఆహారపు పదార్థాలు వేడెక్కుతాయి. ఈ మైక్రో ఓవెన్‌ను స్పెన్సర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కిరణాలు కిరణాలను క్రీ.శ. 1895లో రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతనికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి 1901లో లభించింది. ధర్మాలు - ఉపయోగాలు: ఈ కిరణాల తరంగధైర్ఘ్య అవధి 100అని నుంచి 0.010అని వరకు ఉంటుంది. తరంగధైర్ఘ్యం తక్కువగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. అందువల్ల ఇవి ఒక రకమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు మాత్రమే. ్ఠ-కిరణాల వేగం గాలిలో, శూన్యంలో కాంతివేగానికి (ఇ= 3 ప 108ఝ/ట) సమానంగా ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం లేకపోవడం వల్ల విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో వంగి ప్రయాణించకుండా, రుజుమార్గంలో వెళతాయి. ఈ కిరణాలకు ఆవేశం లేకపోవడం వల్ల వీటి అయనీకరణ సామర్థ్యం దాదాపు శూన్యం. ఈ కిరణాలు ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను ప్రభావితం చెందిస్తాయి. కిరణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కఠిన ్ఠ-కిరణాలు: వీటి తరంగ ధైర్ఘ్య అవధి 0.010అని నుంచి 4అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాల శక్తి ఎక్కువగా ఉంటాయి. మెత్తని పదార్థాలు, కఠిన పదార్థాల ద్వారా చొచ్చుకు వెళతాయి. ఈ కిరణాలను కిందివాటిలో ఉపయోగిస్తారు. పెద్ద పైపులు, బాయిలర్స, డ్యాములలో పగుళ్లు, రంధ్రాలను గుర్తించడానికి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దులు, దర్శనీయ స్థలాల వద్ద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయడానికి. మృదు ్ఠ- కిరణాలు: వీటి తరంగదైర్ఘ్య అవధి 4అని100అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాల శక్తి తక్కువగా ఉండి కేవలం మెత్తగా ఉన్న రక్తం, మాంసం ద్వారా మాత్రమే చొచ్చుకొని వెళతాయి. కఠినమైన ఎముకల ద్వారా చొచ్చుకు వెళ్లవు. వైద్యరంగంలో ఈ మృదు ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. జీర్ణాశయానికి సంబంధించి ్ఠ-కిరణాల ఫొటోను తీయడానికి ముందుగా రోగికి Barium Sulphate - Baై4 అనే రసాయన పదార్థాన్ని తాగిస్తారు. ఈ పదార్థం ్ఠ-కిరణాలను జీర్ణాశయంలో కావాల్సిన అవయవాలపై కేంద్రీకృతం చేస్తుంది. కంప్యూటెడ్ టోమాగ్రఫీ స్కానింగ్ (సీటీ స్కానింగ్)లో ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. వైద్యరంగంలో ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని రేడియో గ్రఫీ, రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అని అంటారు. ్ఠ కిరణాలను ఉపయోగించి పనిచేసే వైద్యుడిని రేడియాలజిస్ట్ అని పిలుస్తారు. కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ నాళాన్ని వాడతారు. దీన్ని సీసంతో నిర్మించిన పెట్టెలో అమర్చుతారు. ఎందుకంటే, సీసం ద్వారా ్ఠ-కిరణాలు చొచ్చుకు వెళ్లవు. విశ్వ కిరణాలు (కాస్మిక్ రేస్) విశ్వంలో ఏదో ఒకచోట జనించిన అత్యంత శక్తివంతమైన కిరణాలు నిరంతరంగా భూమిని చేరుతున్నాయి. వీటిని విశ్వకిరణాలు అంటారు. ఈ కిరణాల ఉనికిని సీటీఆర్ విల్సన్ అనే శాస్త్రవేత్త గుర్తించగా, ప్రయోగాత్మకంగా మిల్లికాన్ కనుగొన్నాడు. ధర్మాలు: విశ్వ కిరణాల్లోని కణాల్లో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, ప్రోటాన్లు, న్యూ ట్రాన్ల్లు మొదలైనవి. వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు ఉంటాయి. ఒక ప్రదేశంలోని విశ్వకిరణాల ఉనికిని, దిశను తెలుసుకోవడానికి కాస్మిక్ రే టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. భూమి ధ్రువాల వద్ద ఈ కిరణాల తీవ్రత ఎక్కువగా, భూ మధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. విశ్వకిరణాల శక్తి 109్ఛఠి నుంచి 1020్ఛఠి వరకు ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం వీటి తరంగదైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాలు అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. విశ్వ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కఠిన కాస్మిక్ కిరణాలు: ఇవి 10 సెం.మీ. మందం కలిగి ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్తాయి. మృదు కాస్మిక్ కిరణాలు: ఈ కిరణాల శక్తి తక్కువగా ఉంటుంది. 10 సెం.మీ. మందం ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్లలేవు. -
మైక్రో ఓవెన్లలో ఉండే తరంగాలు?
కాంతి (అదృశ్య వికిరణాలు) అతి నీలలోహిత కిరణాలు, అతి నీలలోహిత కిరణాలను రిట్టర్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్యం 4000అని నుంచి 100అని వరకు ఉంటుంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం. ఈ కిరణాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అతి నీలలోహిత కిరణాలను దాదాపు అన్ని రకాలైన గాజు పదార్థాలు శోషణం చేసుకుంటాయి. క్వార్ట్జ గాజు ద్వారా ఈ కిరణాలు చొచ్చుకు వెళతాయి. అందువల్ల క్వార్ట్జ గాజుతో తయారైన కటకాలను, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని గుర్తించవచ్చు. అతి నీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి. అనువర్తనాలు: 1. పాలలో, నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేయడానికి 2. ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలంపాటు నిల్వ చేయడానికి ఉదా: బ్రెడ్, పచ్చళ్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాటికి సోడియం బెంజోయేట్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు. 3. వైద్యరంగంలో హానికరమైన బ్యాక్టీరియాను నశింపచేసేందుకు వాడతారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. 4. సహజ, కృత్రిమ దంతాలను వేర్వేరుగా గుర్తించడానికి వాడతారు. 5. కుళ్లిన కోడిగుడ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. 6. తొలిదశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను గుర్తించడానికి 7. టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో 8. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడంలో 9. అతినీలలోహిత కిరణాలు మన శరీరంపైన పతనమైనప్పుడు 1ఝఝ లోతుకు చొచ్చుకొని వెళ్లి విటమిన్ ఈ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. 10. వేలిముద్రలను విశ్లేషించడానికి 11. {ధువ పత్రాలు, కరెన్సీ నోట్లు అసలువా, నకిలీవా తేల్చడానికి ఉపయోగిస్తారు. నష్టాలు: సూర్యుని నుంచి వచ్చే మొత్తం కాంతిలో అతి నీలలోహిత కిరణాలు 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కిరణాల శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మానవులపై పతనమైనప్పుడు చర్మ క్యాన్సర్ కలుగుతుంది. ఈ హానికరమైన కిరణాలను భూమి వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కాబట్టి ఈ కిరణాలు భూమిని చేరవు. కానీ క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడి వాటి ద్వారా ఈ కిరణాలు భూమిని చేరుతున్నాయి. కాబట్టి ఈ నష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జపాన్‌లోని క్యోటోనగరంలో 1996 డిసెంబరులో ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 16న ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని క్యోటో ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 2005 ఫిబ్రవరి 16న అమల్లోకి వచ్చింది. లేజర్ కిరణాలు LASER - Light Amplification by Stimulated Emmision of Radiation. లేజర్ కిరణాలకు సంబంధించిన సూత్రాన్ని 1954లో చార్లెస్ హెచ్టౌన్స ప్రతిపాదించాడు. ఈ సూత్రం ఆధారంగా 1958లో థైడర్మెమన్ అనే శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. లేజర్ కిరణాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. ఘన పదార్థాల్లో రూబిస్ స్ఫటికాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. వాయు పదార్థాల్లో జడవాయువులను (హీలి యం, నియాన్) ఉపయోగించి హెవిజావాన్ అనే అమెరికా శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. ఈ వాయువుల నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: సంబద్ధత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం లాంటివి సమానంగా ఉంటాయి. ఈ లక్షణాన్ని సంబద్ధత అంటారు. ఏకవర్ణీయత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల తరంగదైర్ఘ్యం ఎల్లప్పుడూ కూడా ఒకేవిధంగా ఉండటం వల్ల ఈ కిరణాల రంగు కూడా ఒకే విధంగా ఉంటుంది. దీన్ని ఏకవర్ణీయత అంటారు. దిశనీయత: లేజర్ కిరణాలు అత్యధిక దూరం రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఈ లక్షణాన్ని దిశనీయత అంటారు. తీవ్రత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాలు అధిక తీవ్రతను కలిగి ఉంటాయి. ఉపయోగాలు: మానవ అవసరాల మేరకు తగిన శక్తిని కలిగి ఉన్న లేజర్ కిరణాలను ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి. * భూమి నుంచి ఇతర గ్రహాలు, ఉపగ్రహాలకు మధ్య దూరాలను కచ్చితంగా లెక్కించడానికి * భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యను, ఎత్తును తెలుసుకోవడానికి * భూమి ఆత్మభ్రమణ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి * ఒక ఘన పదార్థంలో అణువుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడానికి * భిన్న ఐసోటోపులను గుర్తించి, వాటిని వేరుచేయడానికి * పుప్పొడి రేణువుల కదలికలను అధ్యయనం చేయడానికి * అత్యంత దృఢ పదార్థాలైన వజ్రం, లోహాలు, లోహమిశ్రమాలు, రాళ్లు మొదలైన వాటికి రంధ్రాలను చేయడానికి, కోయడానికి * అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విస్ఫోటనం చెందించడానికి * యుద్ధంలో లక్ష్యాన్ని గురిపెట్టడానికి * పురాతన కట్టడాలు, విగ్రహాలను శుభ్రపరిచేందుకు * సాంస్కృతిక కార్యక్రమాల్లో (లేజర్ షో) * బార్‌కోడ్‌లను చదవడానికి * స్పష్టమైన ప్రింటింగ్, జిరాక్స్‌ల కోసం ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఉపయోగించే లేజర్ కిరణాలను అర్ధవాహక పదార్థాలైన సిలికాన్, జెర్మేనియం నుంచి ఉత్పత్తి చేస్తారు. * వాహనాల వేగాన్ని లెక్కించడానికి, స్పీడ్‌గన్ అనే కెమెరా, సిడీలు, డీవీడీలు మొదలైన వాటిలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి * ఆప్టికల్ ఫైబర్‌లో సమాచార ప్రసారం కోసం * ఎండోస్కోపిక్ విధానంలో * హోలోగ్రఫీ విధానంలో ఒక వస్తువును 3డీ పద్ధతిలో ఫొటో తీయడానికి వాడతారు. * వాతావరణ కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని lLIDAR (Light Ditection and Raging) అంటారు. * రెటీనాపై ఏర్పడే పొరను తొలగించడానికి * గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి * మెదడులో ఏర్పడిన కణతులను తొలగిం చడానికి * సుదూరం ప్రయాణించే రాకెట్లు, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగిస్తారు. లేజర్ కిరణాల ధర్మాలను అధ్యయనం చేసి, వాటిని ఉత్పత్తి చేయడానికి భారత అణుశక్తి సంఘం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డాక్టర్ రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. రేడియో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 1m నుంచి 100m వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. వీటి వేగం శూన్యంలో, గాలిలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఈ తరంగాలను టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో, వాతావరణాన్ని విశ్లేషించ డంలో ఉపయోగిస్తారు. మైక్రో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 10-6ఝ పరిధిలో ఉంటుంది. మైక్రో తరంగాలు కూడా ఒకరకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అందువల్ల ఈ కిరణాలు గాలిలో, శూన్యంలో కాంతివేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. మైక్రో తరంగాలను సమాచార రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఒక ప్రదేశాన్ని భౌతికంగా తాకకుండా, దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పద్ధతిని సెన్సింగ్ విధానం అంటారు. మైక్రో ఓవెన్లలో ఆహార పదార్థాలను వేడిచేయడానికి ఈ తరంగాలను వాడతారు. ఆహార పదార్థాలను అలోహ పదార్థాలతో తయారు చేసిన పాత్రల్లో నింపి మైక్రో ఓవెన్లో అమర్చాలి. ఈ మైక్రో తరంగాలు ఆహారపు అణువుల్లోకి చొచ్చుకుపోయి వాటి కంపన పరిమితిని అనేకరెట్లు పెంచుతాయి. అందువల్ల ఈ కంపన శక్తి ఉష్ణశక్తిగా మారడం వల్ల ఆహారపు పదార్థాలు వేడెక్కుతాయి. ఈ మైక్రో ఓవెన్‌ను స్పెన్సర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. x-కిరణాలు x-కిరణాలను క్రీ.శ. 1895లో రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతనికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి 1901లో లభించింది. ధర్మాలు - ఉపయోగాలు: * ఈ కిరణాల తరంగధైర్ఘ్య అవధి 100A° నుంచి 0.010A° వరకు ఉంటుంది. తరంగధైర్ఘ్యం తక్కువగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ శక్తి ఉంటుంది. * ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. అందువల్ల ఇవి ఒక రకమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు మాత్రమే. ్ఠ-కిరణాల వేగం గాలిలో, శూన్యంలో కాంతివేగానికి (C= 3 ´ 108m/s) సమానంగా ఉంటుంది. * ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం లేకపోవడం వల్ల విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో వంగి ప్రయాణించకుండా, రుజుమార్గంలో వెళతాయి. * ఈ కిరణాలకు ఆవేశం లేకపోవడం వల్ల వీటి అయనీకరణ సామర్థ్యం దాదాపు శూన్యం. * ఈ కిరణాలు ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను ప్రభావితం చెందిస్తాయి. * x--కిరణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కఠిన ్ఠ-కిరణాలు: వీటి తరంగ ధైర్ఘ్య అవధి 0.010A° నుంచి 4A° వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాల శక్తి ఎక్కువగా ఉంటాయి. మెత్తని పదార్థాలు, కఠిన పదార్థాల ద్వారా చొచ్చుకు వెళతాయి. ఈ కిరణాలను కిందివాటిలో ఉపయోగిస్తారు. * పెద్ద పైపులు, బాయిలర్స, డ్యాములలో పగుళ్లు, రంధ్రాలను గుర్తించడానికి * విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దులు, దర్శనీయ స్థలాల వద్ద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయడానికి. * మృదు ్ఠ- కిరణాలు: వీటి తరంగదైర్ఘ్య అవధి 4A°100A° వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాల శక్తి తక్కువగా ఉండి కేవలం మెత్తగా ఉన్న రక్తం, మాంసం ద్వారా మాత్రమే చొచ్చుకొని వెళతాయి. కఠినమైన ఎముకల ద్వారా చొచ్చుకు వెళ్లవు. వైద్యరంగంలో ఈ మృదు ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. జీర్ణాశయానికి సంబంధించి ్ఠ-కిరణాల ఫొటోను తీయడానికి ముందుగా రోగికి ఆ్చటజీఠఝ ఠఞజ్చ్ట్ఛి ఆ్చై4 అనే రసాయన పదార్థాన్ని తాగిస్తారు. ఈ పదార్థం ్ఠ-కిరణాలను జీర్ణాశయంలో కావాల్సిన అవయవాలపై కేంద్రీకృతం చేస్తుంది. * కంప్యూటెడ్ టోమాగ్రఫీ స్కానింగ్ (సీటీ స్కానింగ్)లో x-కిరణాలను ఉపయోగిస్తారు. * వైద్యరంగంలో ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని రేడియో గ్రఫీ, రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అని అంటారు. ్ఠ కిరణాలను ఉపయోగించి పనిచేసే వైద్యుడిని రేడియాలజిస్ట్ అని పిలుస్తారు. x-కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ నాళాన్ని వాడతారు. దీన్ని సీసంతో నిర్మించిన పెట్టెలో అమర్చుతారు. ఎందుకంటే, సీసం ద్వారా ్ఠ-కిరణాలు చొచ్చుకు వెళ్లవు. విశ్వ కిరణాలు (కాస్మిక్ రేస్) విశ్వంలో ఏదో ఒకచోట జనించిన అత్యంత శక్తివంతమైన కిరణాలు నిరంతరంగా భూమిని చేరుతున్నాయి. వీటిని విశ్వకిరణాలు అంటారు. * ఈ కిరణాల ఉనికిని సీటీఆర్ విల్సన్ అనే శాస్త్రవేత్త గుర్తించగా, ప్రయోగాత్మకంగా మిల్లికాన్ కనుగొన్నాడు. ధర్మాలు: విశ్వ కిరణాల్లోని కణాల్లో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, ప్రోటాన్లు, న్యూ ట్రాన్ల్లు మొదలైనవి. వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు ఉంటాయి. ఒక ప్రదేశంలోని విశ్వకిరణాల ఉనికిని, దిశను తెలుసుకోవడానికి కాస్మిక్ రే టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. భూమి ధ్రువాల వద్ద ఈ కిరణాల తీవ్రత ఎక్కువగా, భూ మధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. విశ్వకిరణాల శక్తి 109ev నుంచి 1020ev వరకు ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం వీటి తరంగదైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాలు అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. విశ్వ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కఠిన కాస్మిక్ కిరణాలు: ఇవి 10 సెం.మీ. మందం కలిగి ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్తాయి. మృదు కాస్మిక్ కిరణాలు: ఈ కిరణాల శక్తి తక్కువగా ఉంటుంది. 10 సెం.మీ. మందం ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్లలేవు.