uma maheswar rao
-
నల్లగొండ వాసికి సీశాబ్ బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణ వాసి కరణం ఉమామహేశ్వర్ రావుకి కేంద్ర విద్యా శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీశాబ్) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం వరుసగా మూడోసారి కావడం విశేషం.నల్లగొండ పట్టణంలోని రామగిరికి చెందిన ఉమామహేశ్వర్రావు పదో తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. ఇంటర్ హైదరాబాద్‌లోని నృపతుంగ జూనియర్ కళాశాలలో, బీటెక్ కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (ఐఐటీ బెనారస్)లో ఎంటెక్ పూర్తి చేశారు. 1989లో ఖరగ్‌పూర్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తిచేశారు. సీశాబ్ ఆధ్వర్యంలోనే సీట్ల భర్తీకేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ (జీఎఫ్‌టీఐ) తదితర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే ఇతర విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 6, 7 విడతల్లో సీశాబ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
రైతుల కష్టాలు తీరుస్తాం
ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రి దేవినేని ఉమ కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు రైతుల కష్టాలను తీరుస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన గురువారం ఉదయం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కేసీ కెనాల్ వెంట మంత్రి పర్యటించారు. జూపాడుబంగ్లా సమీపంలోని కేసీ కెనాల్‌ను మంత్రి పరిశీలించి ప్రస్తుతం కేసీ కెనాల్‌కు విడుదలవుతున్న నీరు, చేపడుతున్న పనుల వివరాలపై అధికారులను ప్రశ్నించారు. నీటి పారుదల శాఖ సీఈ జీ చిట్టిబాబు మ్యాప్ ద్వారా మంత్రి కోరిన వివరాలను తెలిపారు. అనంతరం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు చేరుకున్న మంత్రి అక్కడి రైతులతో కూడా మాట్లాడారు. వర్షపు నీరు వృధాగా సముద్రంలో కలిసి పోకుండా 44 వేల క్యూసెక్కుల శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, అవుకు, గోరుకల్లు తదితర రిజర్వాయర్లకు మళ్లించి నీటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. అందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఎస్ఆర్బీసీ కెనాల్ వెడల్పు పనుల వేగం పెంచాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. అనంతరం బానకచెర్ల రిజర్వాయర్ వద్దకు చేరుకున్న మంత్రి బానకచెర్ల నుంచి మూడు వైపులా వెళ్తున్న తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ నీటి పారుదలతో పాటు అలగనూరు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఆర్బీసీ కుడి కెనాల్ వెడల్పు పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను కూడా ఆయన పరిశీలించారు. మంత్రి పర్యటనలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, నీటి పారుదల శాఖ సీఈ జి చిట్టిబాబు, ఎస్ఈ కే శ్రీనివాసరావు, హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్, ఎస్ఈ శ్యాంసుందరం, తెలుగుగంగ ఎస్ఈ సన్యాసినాయుడు, ఈఈలు విశ్వనాథం, రెడ్డి శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు, డీఈఈలు రమేష్‌బాబు, లక్ష్మణకుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'మాకు నీరు.. మీకు విద్యుత్'
విజయవాడ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేసి.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సూచించారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి కోసం ఏపీ ఇబ్బంది పడుతుంటే తెలంగాణ వృథా చేస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉండకూడదనే తమ ఉద్దేశమని చెప్పారు. ఏపీ పరిస్థితిని ఎప్పటికప్పడు తెలంగాణ అధికారులకు తెలియజేస్తున్నామని వివరించారు. రైతులందరూ బాగుండాలని తాము కోరుకుంటామని, బచావత్ కేటాయింపుల అనుగుణంగానే నడుచుకుంటున్నామని ఉమా మహేశ్వరరావు చెప్పారు. శుక్రవారం నాగార్జున్ సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా, తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు వివరణ ఇవ్వగా, అనంతరం ఉమా మహేశ్వర రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలని, ఉన్ననీటిని రెండు రాష్ట్రాలు సమానంగా వాడుకోవాలని ఉమా మహేశ్వర రావు అన్నారు. వాస్తవాల ఆధారంగా కృష్ణా బోర్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు. -
నామినేషన్ పత్రం ముట్టింది
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ సమరంలో గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల్లో 52 జెడ్పీటీసీ స్థానాలు 149, 636 ఎంపీటీసీ స్థానాలకు 1,329 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు జెడ్పీటీసీలకు 440, ఎంపీటీసీ స్థానాలకు 3,359 వచ్చాయి. మొత్తం జెడ్పీటీసీలకు 589, ఎంపీటీసీలకు 4,688 పోటీ పడుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల పరిశీలన జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సంబంధించిన నామినేషన్ల పత్రాలను శుక్రవారం పరిశీలించనున్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్, సహాయ రిటర్నింగ్ అధికారులు జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ ఉమామహేశ్వర్‌రావుతోపాటు మరో ఐదుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు పరిశీలించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మండల పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులతోపాటు ఇద్దరు సహాయ రిటర్నింగ్ అధికారులు పత్రాలు పరిశీలిస్తారు. ఈ నెల 23న తిరస్కరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ, ఈనెల 24న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సాయంత్రం 3 గంటల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. కాగా, మరో పదహారు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం కొత్త పాలక వర్గం ఏర్పడుతుంది. వ్యూహ రచనలో పార్టీలు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఇక పార్టీలు వ్యూహ రచనలో పడ్డాయి. పార్టీల టిక్కెట్ దొరకని అభ్యర్థులు రెబెల్‌గానైనా పోటీలో ఉంటామని ప్రకటిస్తున్నారు. ఇదీ కొందరు అభ్యర్థులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వీరిని ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. పార్టీల్లోని ముఖ్యనాయకులతో చెప్పిస్తున్నారు. వారికి తాయిలాలు ఇస్తామని బరిలో ఉండే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. దీంతో ఎంత మేరకు సఫలం అవుతారో వేచిచూడాలి. కొందరు నాయకులు జిల్లా పరిషత్ స్థానాల్లో సగం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నాయకులు జెడ్పీటీసీ స్థానాలను 30 వరకు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు వెళ్లి వివరించేందుకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అదే తరుణంలో జిల్లా పరిషత్ పోరులో సగం సీట్లు మహిళలకు కేటాయించడంతో తల్లులు, భార్యలను బరిలోకి దింపారు. దాఖలైన నామినేషన్లను బట్టి చూస్తే ఒక జిల్లా పరిషత్ స్థానానికి త్రిముఖ పోరు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.