'మాకు నీరు.. మీకు విద్యుత్' | uma maheswar rao reacts on nagarjuna sagar issue | Sakshi
Sakshi News home page

'మాకు నీరు.. మీకు విద్యుత్'

Published Fri, Feb 13 2015 7:41 PM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

uma maheswar rao reacts on nagarjuna sagar issue

విజయవాడ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు నీటిని విడుదల చేసి.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సూచించారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 నీటి కోసం ఏపీ ఇబ్బంది పడుతుంటే తెలంగాణ వృథా చేస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉండకూడదనే తమ ఉద్దేశమని చెప్పారు. ఏపీ పరిస్థితిని ఎప్పటికప్పడు తెలంగాణ అధికారులకు తెలియజేస్తున్నామని వివరించారు. రైతులందరూ బాగుండాలని తాము కోరుకుంటామని, బచావత్ కేటాయింపుల అనుగుణంగానే నడుచుకుంటున్నామని ఉమా మహేశ్వరరావు చెప్పారు. శుక్రవారం నాగార్జున్ సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా, తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు వివరణ ఇవ్వగా, అనంతరం ఉమా మహేశ్వర రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలని, ఉన్ననీటిని రెండు రాష్ట్రాలు సమానంగా వాడుకోవాలని ఉమా మహేశ్వర రావు అన్నారు. వాస్తవాల ఆధారంగా కృష్ణా బోర్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement