అన్ని పార్టీల నేతలు సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలి
రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు ఒకే మాట మీద నిలబడితే సమైక్యాంధ్ర సాధ్యమని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగస్థుల ఫోరం అధ్యక్షడు మురళీకృష్ణ వెల్లడించారు. ఆదివారం ఆయన ప్రకాశంజిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల నేతలు జెండాలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆరు కోట్ల సీమాంధ్ర తెలుగు ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహారించిందని మురళీకృష్ణ ఆక్షేపించారు.