Understanding Agreement
-
India-US: సెమీకండక్టర్లపై భారత్‌తో ఒప్పందం
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్లకు సంబంధించి భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి గినా రైమాండో తెలిపారు. ఈ రంగంలో అపార అవాకాశాలున్నాయంటూ, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒప్పందం తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు సంబంధించి యూఎస్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వివిధ దేశాల మధ్య విస్తరించుకోవాలనే (వైవిధ్యం) బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు రైమాండో తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లడారు. ‘‘రెండు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, వాటికి సంబంధించి వాణిజ్య అవకాశాలపై మాట్లాడుకున్నాం. సెమీకండక్టర్ల ఎకోసిస్టమ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కావాల్సిన విధానాలపై చర్చలను ఏ విధంగా కొసాగించాలనే అంశంపైనా మాట్లాడాం. జాయింట్ వెంచర్లు లేదా టెక్నాలజీ భాగస్వామ్యాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి’’అని రైమాండో వివరించారు. స్వల్పకాల అవకాశాలతోపాటు, దీర్ఘకాల వ్యూహాత్మక అవకాశాలను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో అమెరికా, భారత్ పెద్ద పాత్రను పోషించగలవన్నారు. రెండు దేశాలూ వేటికవే సెమీకండక్ట్ రాయితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయంటూ.. ఈ విషయంలో రెండు దేశాలు ఏ విధంగా సహకారం ఇచ్చిపుచ్చుకోగలవనే దానిపై మాట్లాడినట్టు చెప్పారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చా కార్యక్రమం, భారత్–అమెరికా సీఈవోల ఫోరం సమావేశం కోసం రైమాండో భారత్‌కు వచ్చారు. ఆమె వెంట అత్యున్నత స్థాయి వాణిజ్య బృందం కూడా ఉంది. -
ప్రోత్సహించేవారూ బాధ్యులే
కఠ్మాండు: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయాలని బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) దేశాలు పిలుపునిచ్చాయి. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కావని ఎండగట్టాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. నేపాల్ రాజధాని కఠ్మాండులో నాలుగో బిమ్స్టెక్ దేశాల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా 7 సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరిగిందని, విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలు పునరుద్ఘాటించాయని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్ నేపాల్ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. అనంతరం నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యారు. తదుపరి బిమ్స్టెక్ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. డిక్లరేషన్ ముఖ్యాంశాలు.. ► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి. ► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి. ► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి. ► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి. ► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి. ► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్టెక్ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. ► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి. ► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి. ► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్టెక్ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి. భాగమతి తీరంలో యాత్రికులకు బస.. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన 400 పడకల విడిది భవనాన్ని మోదీ, నేపాల్ ప్రధాని ఓలితో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో భాగమతి నదీ ఒడ్డున నిర్మించిన ఈ భవనంలో యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి గదులు, కిచెన్, భోజన శాల, లైబ్రరీ తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇది కేవలం విశ్రాంతి భవనమే కాదని, భారత్–నేపాల్‌ల స్నేహానికి చిహ్నమని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా మోదీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాక్సాల్ (బిహార్)–కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి. -
రష్యా, ఏపీల మధ్య అవగాహన ఒప్పందం
-
ఏఎస్డీసీతో జతకట్టిన టాటా మోటార్స్
న్యూఢిల్లీ: సంస్థ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఏఎస్‌డీసీ)తో అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలోని ఆరు టాటా మోటార్స్ ప్లాంట్లలో పనిచేస్తున్న వారందరికీ ఈ అవకాశం లభించనుంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా టాటా మోటార్స్-ఏఎస్‌డీసీ జోడి పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ అందిచనున్నారు. -
గోపీచంద్ అకాడమీతో ‘సాయ్’ ఒప్పందం
న్యూఢిల్లీ: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (పీజీబీఎఫ్), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో హైదరాబాద్‌లోని ఈ అకాడమీ ఇక నుంచి సాయ్ గోపీచంద్ జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీగా మారనుంది. సాయ్ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా జాతీయ క్రీడా అభివృద్ధి నిధి సహాయంతో పీజీబీఎఫ్‌లో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జాతీయ శిక్షణ శిబిరాలు, పోటీలకు అకాడమీలో ఉన్న సౌకర్యాలను సాయ్ వినియోగించుకోనుంది. మరోవైపు జాతీయ స్థాయి ప్రతిభాన్వేషనలో భాగంగా నైపుణ్యం కలిగిన 11 నుంచి 14 ఏళ్ల లోపు 50 మంది చిన్నారులను అకాడమీ ఎంపిక చేయనుంది. తమ కోచ్‌లనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, రైల్వేస్ ఇంతర కేంద్ర సంస్థలు, రాష్ట్ర పీఎస్‌యూల నుంచి కోచ్‌లను సాయ్ బదిలీ చేయనుంది. ‘దేశంలోని క్రీడా కోచింగ్‌ను మరింతగా రాటుదేల్చేందుకు ఇది రోల్ మోడల్‌గా పనిచేస్తుంది’ అని సాయ్ డీజీ శ్రీనివాస్ అన్నారు. దేశంలో క్రీడాభివృద్ధికి సాయ్తో జతకట్టడం ఆనందంగా ఉందని కోచ్ గోపీచంద్ తెలిపారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కూడా ఇందులో భాగస్వామి అవుతుందని అన్నారు. -
బీడీఎల్, ఈసీఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్: భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్(ఈసీఐఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ రంగంలో క్షిపణులు, నీటి అడుగున ఆయుధ వ్యవస్ధ తయారీలో పరస్పర సహకారంతో పనిచేయాలని సోమవారం బీడీఎల్‌లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు బీడీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ వి. ఉదయ భాస్కర్, ఈసీఐఎల్ మేనేజింగ్ డైరక్టర్ పి. సుధాకర్‌లు అంగీకార పత్రా లపై సంతకాలు చేసినట్లు సీనియర్ డీజీఎం ఎసీ రావు తెలిపారు.