న్యూఢిల్లీ: సంస్థ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఏఎస్‌డీసీ)తో అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలోని ఆరు టాటా మోటార్స్ ప్లాంట్లలో పనిచేస్తున్న వారందరికీ ఈ అవకాశం లభించనుంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా టాటా మోటార్స్-ఏఎస్‌డీసీ జోడి పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ అందిచనున్నారు.