Union Minister Rajnath Singh
-
లడక్ వెళ్లనున్న రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ సరిహద్దులో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఆయన జమ్మూకశ్మీర్ లోని అత్యంత ఎత్తయిన ప్రాంతమైన లడక్ లో పర్యటించనున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం, మంగళవారం ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా కార్గిల్, లడక్ ప్రాంతాల్లో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది రాజ్ నాథ్ సింగ్ నాలుగో పర్యటన. గత నెల (సెప్టెంబర్ 4-5)న అఖిలపక్షాన్ని తీసుకొని రాజ్ నాథ్ జమ్ముకశ్మీర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. -
రాజ్‌నాథ్ నుంచి కేసీఆర్‌కు ఫోన్..!
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ నుంచి కేసీఆర్‌కు ఫోన్ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లినట్లు సమాచారం. బుధవారం ఉదయం టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే జిల్లాలు 683 ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. దేశ వ్యాప్తంగా జిల్లాల్లో సగటు జనాభా 18.3లక్షలు అని అన్నారు. కానీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇది 36లక్షలు ఉందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటుపై అవసరమైన సూచనలు చేయండని కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఈలోగా ఆయనకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ రావడంతో సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. -
పోలీసుల చర్య అప్రజాస్వామికం
ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ గుంతకల్లు: అనంతపురంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ధర్నా సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు విచక్షణరహితంగా విరుచుకుపడడం అప్రజాస్వామికమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. సోమవారం స్థానిక తిలక్‌నగర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ధర్నాలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన పోలీసులే అమాయక ప్రజలపై లాఠీలు ఝళిపించడం సరికాదన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న ఎస్పీని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజనాథ్సింగ్ ప్రత్యేక దృష్టి సారించి,జిల్లాలో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.