లడక్ వెళ్లనున్న రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ సరిహద్దులో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఆయన జమ్మూకశ్మీర్ లోని అత్యంత ఎత్తయిన ప్రాంతమైన లడక్ లో పర్యటించనున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది.
సోమవారం, మంగళవారం ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా కార్గిల్, లడక్ ప్రాంతాల్లో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది రాజ్ నాథ్ సింగ్ నాలుగో పర్యటన. గత నెల (సెప్టెంబర్ 4-5)న అఖిలపక్షాన్ని తీసుకొని రాజ్ నాథ్ జమ్ముకశ్మీర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.