Union Power Ministry
-
పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
విద్యుత్ చోరీ చేస్తే.. పేరు టాంటాం!
‘నేమ్ అండ్ షేమ్’ ప్రచారోద్యమం నిర్వహించాలని కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి పేర్లను ఎప్పటికప్పుడు ప్రకటించి వారిలో సిగ్గు కలిగించే రీతిలో ప్రచారోద్యమం (నేమ్ అండ్ షేమ్ క్యాంపెయిన్) నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. విద్యుత్ చౌర్యం నియంత్రించేందుకు ఈ ప్రచారం నిర్వహించాలని కోరింది. ‘ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్)’ పథకానికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య ఈ నెల 4న త్రైపాక్షిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందం మేరకు డిస్కంలు తీసుకోవాల్సిన చర్యల్లో ‘నేమ్ అండ్ షేమ్’ ప్రచారోద్యమాన్ని కేంద్రం చేర్చింది. నిర్దేశిత గడువుతో లక్ష్యాలు డిస్కంల కార్యనిర్వహణ, ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత గడువులతో పలు లక్ష్యాలను విధించింది. ఆ వివరాలు ► వాస్తవ సరఫరా విలువ (ఏసీఎస్), వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) మధ్య వ్యత్యాసాన్ని 2018–19లోగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. ► ఫీడర్ల విభజనను మార్చి 2018లోగా పూర్తి చేయాలి. దీంతో వ్యవసాయానికి వాస్తవంగా సరఫరా అవుతున్న విద్యుత్ ఎంతో వెల్లడవుతుంది. ► నెలకు 500 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులందరికీ 2018 డిసెంబర్ 31లోగా స్మార్ట్ మీటర్లను బిగించాలి. నెలకు 200 యూనిట్లకు మించి వినియోగించేవారికి 2019 డిసెంబర్ 31లోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ► 2017 జూన్ 30లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, ఫీడర్లకు 100 శాతం మీటర్లు బిగించాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ స్థాయి వరకు విద్యుత్ సరఫరాపై 2018 మార్చి 31లోగా ఆడిట్‌కు శ్రీకారం చుట్టాలి. ► విద్యుత్ సరఫరా లేని గృహాలకు 2018–19లోగా విద్యుత్ సదుపాయం కల్పించాలి. ► ప్రస్తుత వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లలో కనీసం 10 శాతం పంపుసెట్లను మార్చి 2019లోగా ఇంధన పొదుపు సామర్థ్యమున్న పంపు సెట్లతో మార్చాలి. ► కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా పారదర్శక విధానంలో మాత్రమే విద్యుత్ కొనుగోళ్లు జరపాలి. ► అధికారుల వేధింపులు, విద్యుత్ చౌర్యం, భద్రత సంబంధిత ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు కేంద్రీకృత కస్టమర్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. ► ఏటా వార్షికాదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లను సకాలంలో ఈఆర్సీకి సమర్పించాలి. ► నష్టాల తగ్గింపు, మీటరింగ్, బిల్లింగ్, బిల్లుల వసూళ్ల విషయంలో బాధ్యుడైన ప్రతి అధికారి పనితీరుకు సూచికల (కీ పర్ఫామెన్స్) విధానాలను ప్రవేశపెట్టాలి. నష్టాలు తగ్గించుకోవాల్సిందే త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. డిస్కంలు సాంకేతిక, వాణిజ్య సమ్మిళిత (ఏటీ అండ్ సీ) నష్టాలను ప్రస్తుతమున్న 12.29 శాతం నుంచి 2018–19 నాటికి 9.95 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో సరఫరా, పంపిణీ దశల్లో జరిగే విద్యుత్ తరుగుదలను సాంకేతిక నష్టాలుగా, పంపిణీ చేసిన మొత్తం విద్యుత్‌లో బిల్లుల చెల్లింపులు జరగని విద్యుత్‌ను వాణిజ్య నష్టాలుగా పరిగణిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే చౌర్యానికి గురైన విద్యుత్‌నే వాణిజ్య నష్టాలుగా పిలుస్తారు. మొత్తంగా ఈ రెండు రకాల నష్టాలను తగ్గించుకోవడానికి సబ్ డివిజన్, డివిజన్, సర్కిల్, జోనల్ స్థాయిల్లో లక్ష్యాలను నిర్దేశించాలని కేంద్ర విద్యుత్ శాఖ డిస్కంలను ఆదేశించింది. నష్టాలు తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటలను పెంచాలని సూచించింది. -
ఏడాదికోసారే విద్యుత్ ‘చార్జీ’
► కేంద్రాన్ని ఒప్పించిన రాష్ట్రం ► మూడు నెలలకోసారి నిబంధన నుంచి మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) అమలు చేసినా.. రాష్ట్రంలో ఏడాదికోసారి మాత్రమే విద్యుత్ చార్జీలు పెంచేందుకు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. తీవ్ర అప్పుల భారంలో మునిగి ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకణ కోసం ఉదయ్ పథకంలో తెలంగాణ చేరబోతోంది. ఉదయ్‌లో చేరికకి సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు బుధవారం ఢిల్లీలో పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నారు. రాష్ట్రం ఈ పథకంలో చేరితే కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు డిస్కంల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యుత్ చార్జీలను సవరించాలని ఉదయ్ పథకంలోని ఓ నిబంధన పేర్కొంటోంది. రాష్ట్రంలో మాత్రం ఈ నిబంధనను అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యథాతథంగా ఏడాదికోసారి విద్యుత్ చార్జీలను పెంచుకునేందుకు కేంద్రం మినహాయింపు ఇచ్చిందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఉదయ్ పథకానికి సంబంధించిన మరికొన్ని నిబంధనల మార్పు విషయంలో సైతం కేంద్రం మినహాయింపులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఉదయ్ నిబంధనల మేరకు 2015 సెప్టెంబర్ 30 నాటికి డిస్కంల 75శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలోగా స్వాధీనం చేసుకోనుంది. డిస్కంల అప్పులు రూ.12 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉదయ్‌లో చేరిన అనంతరం మొత్తం అప్పుల్లో రూ.9 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ అప్పులకు గ్యారెంటీగా 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లను రుణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. -
‘భద్రాద్రి’కి దారి చూపండి!
- పర్యావరణ అనుమతులు నిరాకరిస్తే రాష్ట్రానికి భారీ నష్టం - కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు జెన్కో లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మించతలపెట్టిన 1080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇటీవల కేంద్ర పర్యా వరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి త్వ శాఖ(ఎంఓఈఎఫ్) అనుమతులు నిరాకరిం చడంపై రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) తక్షణమే స్పందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ(ఎంఓపీ) పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నెల 4న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-22)లో కేవలం సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను మాత్రమే అనుమతించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి భారీ నష్టం జరగనుందని జెన్కో యాజమాన్యం స్పందించింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే రూ.1000 కోట్ల వ్యయం చేశామని, ఈ దశలో ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావ రణ అనుమతులను జారీ చేయాలని కోరుతూ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తాజాగా పర్యా వరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంతో ప్లాంట్‌కు అనుమతినివ్వలేమన్న నిర్ణయం సరికాదన్నా రు. వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు, ప్రభుత్వ రంగా ల్లో 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, ఇవన్నీ 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తి అవుతాయన్నారు. అరుునా, ఒక్క భద్రాద్రి విషయంలోనే అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. -
డిస్కంలపై ప్రై‘వేటు’ పడగ!
' ఫ్రాంచైజీల పరం కానున్న విద్యుత్ పంపిణీ ' చంద్రబాబు బాటలో కిరణ్ సర్కార్ ' తన హయూంలో మీటరింగ్, బిల్లింగ్ సేవలను ప్రైవేటుకప్పగించిన చంద్రబాబు ' తాజాగా బిల్లు వసూళ్లు, కొత్త లైన్లు, కనెక్షన్ల బాధ్యతలూ ప్రైవేటు కంపెనీలకే ' 10 నుంచి 12 ఏళ్ల పాటు కాంట్రాక్టుకు అవకాశం ' త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం ' తొలి విడత చార్మినార్, బేగంబజార్, రాయచోటి, భీమవరం, నిజామాబాద్ జోన్లలో అమలుకు రంగం సిద్ధం కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ ప్రైవేటుసంస్థల పరం కానుంది. తొలివిడతగా రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఫ్రాంచైజీ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. సీపీడీసీఎల్ పరిధిలోని చార్మినార్, బేగం బజార్, ఎస్పీడీసీఎల్ పరిధిలో రాయచోటి, ఎన్పీడీసీఎల్ పరిధిలో నిజామాబాద్, ఈపీడీసీఎల్ పరిధిలోని భీమవరంలో విద్యుత్ పంపిణీ ప్రక్రియ యూవత్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు ఆయూ ప్రాంతాల్లో పంపిణీ నష్టాలు అధికంగా ఉన్నాయంటూ సాకు చెబుతోంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తొలుత ఐదు జోన్లకే పరిమితమైనా విడతలవారీగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ ఈ విధానాన్ని వర్తింపజేసే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. అరుుతే డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక నష్టాల సాకు దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థికనష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ సరఫరా మేరకు బిల్లులు వసూలు కాకపోవడాన్ని పంపిణీ నష్టంగా పేర్కొంటున్నారు. ఈ పంపిణీ నష్టాల నుంచి డిస్కంలను బయటపడేసేందుకు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీని కింద డిస్కంల రుణాల్లో సగం మొత్తానికి కేంద్రం, మిగిలిన సగానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వడ్డీ భారాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం భరిస్తారుు. కానీ ఈ ప్యాకేజీ వర్తించాలంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం షరతు విధించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఫ్రాంచైజీ విధానాన్ని అమలు చేస్తామని 2014 జనవరి 1న జరిగిన ఒప్పందం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రుణ భారం తగ్గించే పేరిట విద్యుత్ పంపిణీ వ్యవస్థను మొత్తం ప్రైవేట్‌పరం చేసేందుకు రంగం సిద్ధం చేయడాన్ని విద్యుత్‌రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. మళ్లీ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో..! చంద్రబాబు తన హయూంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ)గా ఉన్న రాష్ట్ర విద్యుత్ రంగాన్ని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పేరిట మూడు ముక్కలు చేశా రు. డిస్కంలను క్రమంగా ప్రైవేటీకరించాలనేది అప్పట్లోనే బాబు ఎజెండా. అరుుతే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు ఫ్రాంచైజీల రూపంలో అప్పగించాలని ప్రపంచ బ్యాంకు నిర్దేశించింది. ఈ మేరకు మీటరింగ్, బిల్లింగ్ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు అప్పగించారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పూర్తిగా పక్కకు పెట్టేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్యుత్‌రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే అభివృద్ధి చేశారు. కానీ తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ చంద్రబాబు బాట పట్టింది. ప్రపంచబ్యాంకు షరతుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీలకు అప్పగించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఫ్రాంచైజీల పంజా..! ఫ్రాంచైజీ విధానం అంటే పూర్తిగా ప్రైవేట్ సంస్థల రాజ్యమే. ఈ విధానంలో మీటరింగ్, బిల్లింగ్‌తో మొదలు బిల్ కలెక్షన్, నెట్వర్క్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం), కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు వంటి బాధ్యతలన్నీ ఎంపికచేసిన ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తారు. సంబంధిత జోన్లో ప్రస్తుతం యూనిట్‌కు సగటున ఎంత ఆదాయం వస్తుందో లెక్కిస్తారు. అంతకంటే ఎక్కువ ధర చెల్లించే కంపెనీకి విద్యుత్ పంపిణీ బాధ్యతలను అప్పగిస్తారు. అంటే ఈ ప్రాంతంలో సదరు బాధ్యతలన్నిటి నుంచి ప్రభుత్వం వైదొలుగుతుంది. అంటే డిస్కంల పాత్ర పరిమితమవుతుంది. ఒప్పందం మేరకు 10- 20 ఏళ్ల వరకు ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఈ కాలాన్ని మళ్లీ పొడిగించే అవకాశమూ ఉంటుంది. సరఫరా చేసిన విద్యుత్ మొత్తానికి బిల్లులు రాబట్టడమే లక్ష్యంగా ఫ్రాంచైజీలు పనిచేస్తారుు. ఉత్తరప్రదేశ్‌లో ఫెరుుల్..! - పంజాబ్‌లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ ఇంజనీర్లే స్వయంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించారు. దాంతో అక్కడ ఇప్పుడు ఫ్రాంచైజీ విధానం అమలు నిలిచిపోయింది. - ఫ్రాంచైజీ విధానం ఉత్తరప్రదేశ్‌లో విఫలమయ్యింది. నష్టాలు తగ్గకపోగా ప్రైవేటు సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు డిస్కంలకు సరిగ్గా చెల్లించడం లేదు. - ఫ్రాంచైజీ విధానం అమల్లోకి వస్తే డిస్కంల ఉద్యోగులు ఆయూ ప్రాంతాల్లో విధుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వీరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ప్రశ్న. - ఫ్రాంచైజీ విధానంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు సబ్సిడీని ప్రైవేటు సంస్థలకు ముందుగానే చెల్లిం చాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ప్రభుత్వం ఆలస్యం చేస్తే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జోన్ల వారీగా పంపిణీ నష్టాలు (శాతాల్లో) జోన్ పేరు పంపిణీ నష్టాలు చార్మినార్ 58.00 బేగంబజార్ 38.00 రాయచోటి 12.66 నిజామాబాద్ 15.60 భీమవరం 13.10