Unique ID number
-
ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్!
సాక్షి, అమరావతి: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి ‘యూనిక్ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్కార్డులే అధికం..! మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు/సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్‌లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్‌కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్.. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబైల్ వినియోగదారులు అందరికీ యూ నిక్ ఐడీ నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మా త్రం ఒక్కటే ఉంటుంది. దేశంలో ఎక్కడ సిమ్ కార్డు కొనుగోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్‌ను ఉపయోగిస్తున్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ పంపించి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ‘అస్త్ర’ అప్డేట్.. సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించనున్నారు. మొబైల్ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా నకిలీ సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్‌ఫోన్ కనెక్షన్లకు చెక్ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్ ఐడీ నంబర్‌తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. -
బీపీ, షుగర్ రోగులకు ఐడీ నంబర్
సాక్షి, హైదరాబాద్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్ ఇచ్చి, అందులోని యూనిక్ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్లైన్లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్ ఐడీ నంబర్ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది. 5.14 లక్షల మందికి నంబర్లు.. రాష్ట్రంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి బీపీ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50 శాతం మందికి సర్వే నిర్వహించే వరకూ తెలియదు. మిగిలిన జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయి ఆరో గ్య కార్యకర్తలు గుర్తించిన అనుమానిత కేసులకు పీహెచ్సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. సర్వే పూర్తైన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీరికి కూడా యూనిక్ ఐడీ నంబర్ ఇస్తారు. త్వరలో అందరి హెల్త్ ప్రొఫైల్.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలో హెల్త్ ప్రొఫైల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్ ప్రొఫైల్ చేపట్టే అంశంపై అధికారులకు ఆదేశాలు రానున్నాయి. ముందుగా సీఎం నియోజకవర్గం నుంచి ప్రారంభించి దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.మొత్తం వైద్య ఆరోగ్య శాఖతోపాటు హెల్త్ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి త్వరలో సమీక్ష చేసే అవకాశముంది. -
నగదు బదిలీకి రంగం సిద్ధం
* ఈ నెల 15 నుంచి అమల్లోకి * రంగంలోకి దిగిన గ్యాస్ ఏజెన్సీలు * ఆధార్ లేని వారికి యూనిక్ ఐడీ నంబర్లతో నగదు బదిలీ రామచంద్రపురం : గ్యాస్ వినియోగదారులకు మళ్లీ నగదు బదిలీ అమలుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఈ నెల 15నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆధార్‌తో అనుసంధానం చేయడంతో గతంలో నగదు బదిలీకి పలు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డీబీటీఎల్ పథకం ద్వారా నగదు బదిలీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీబీటీఎల్ పథకం ద్వారా అమలు ఆధార్‌తో సంబంధం లేకుండా డీబీటీఎల్ పథకం ద్వారా వినియోగదారులకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆధార్ సీడింగ్ లేని వారికి ఈసారి నగదు బదిలీకి 17 అంకెల యూనిక్ ఐడీని గ్యాస్ ఏజెన్సీలు అందిస్తున్నాయి. ఇప్పటికే వినియోగదారుల మొబైల్ ఫోన్ల్‌కు 17 అంకెల యూనిక్‌ఐడీ నంబర్‌ను ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తున్నారు. ఇదివరలో ఆధార్ సీడింగ్ అయినవారికి ఇది అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఆధార్ సీడింగ్ జరగని వారికి ఆధార్ కార్డుతో పాటుగా రెండు రకాల ఫారాలను అందించాలి. ఫారం-1, 2లను నింపి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో, ఖాతా కలిగిన బ్యాంకులో అందించాలి. ఆధార్ కార్డు లేని వారు ఏజెన్సీలు అందించిన 17 అంకెల యూనిక్ ఐడీ నంబర్‌ను వేసి ఫారం-3, 4లను పూర్తి చేసి బ్యాంకుతో పాటుగా గ్యాస్ ఏజెన్సీలలో అందించాలి. ఈ ప్రక్రియ ఈనెల 15 నుంచి ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు. అయితే గతంలో ఆధార్ సీడింగ్ ద్వారా నగదు బదిలీని అందుకున్నవారు ఎటువంటి ఫారాలు ఇవ్వాల్సిన పనిలేదు. సిలిండర్‌కు పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే ఈ నెల 15 నుంచి నగదు బదిలీ అమలు కానుంది. జిల్లాలోని 54 గ్యాస్ ఏజేన్సీల ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల వరకు వంట గ్యాస్ వినియోగదారులున్నారు. వీరందరూ ప్రస్తుతం సబ్సిడీపై రూ.443 చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వినియోగదారులు ముందుగానే సిలిండర్‌ను రూ.960 చెల్లించి కొనుగోలు చే యాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం రూ. 520 ఢిల్లీలోని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేస్తారు. గతంలో నగదు బదిలీని అందుకున్న వారికి యథావిధిగా సబ్సిడీ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేనివారు సెల్‌ఫోన్‌కు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్‌ను తీసుకువెళ్లినా బ్యాంకుల్లో సబ్సిడీ సొమ్ములను అందించనున్నారు.