University of California scientists
-
డార్క్ చాకొలెట్లతో ఒత్తిడికి చెక్
లాస్ ఏంజెలిస్: వయసు మీదపడటం వల్ల తలెత్తే ఒత్తిడి, నాడీ సంబంధ సమస్యలకు డార్క్ చాకొలెట్లు మంచి ఔషధంగా పనిచేస్తాయని పరిశోధకులు గుర్తించారు. వీటిలోని ఎపికెటెచిన్(ఎపి) అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడుతో పాటు ఇతర నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు ఆందోళన స్థాయిలు తగ్గినట్లు వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో కనుగొన్నారు. అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో డార్క్ చాకొలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిర్ధారణకు వచ్చారు. వయసు మీద పడ్డ ఎలుకలకు ఎపికెటెచిన్ ఇచ్చి ఒత్తిడి, నాడిమండల వ్యవస్థల్లో మార్పుల్ని గమనించారు. వాటిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు, ఆందోళన స్థాయిలు తగ్గినట్లు పరిశోధకులు గమనిం చారు. డార్క్ చాకొలెట్లు తినేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండడానికి కారణాలపై ఈ పరిశోధనతో కొంత స్పష్టత వచ్చిందన్నారు. -
నానో చేపలు.. మందులు చేరవేస్తాయి!
శరీరంలో అవసరమైన చోటుకి మందులను చేరవేసే అత్యాధునిక నానోస్థాయి రోబోను కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి చేరిస్తే చాలు.. ఇవి అయస్కాంతాల సాయంతో నిర్దేశిత ప్రాంతానికి చేపల్లా గా ఈదుతూ వెళ్లి మందులను విడుదల చేస్తాయి. బంగారు, వెండి, నికెల్ లోహాల తో తయారైన ఈ నానో చేపలు దాదాపు 2,400 నానో మీటర్ల పొడవుం టాయి. విద్యుదయస్కాంత ధర్మం కారణంగా వీటి తోక అటూ ఇటూ కదులుతుంటుంది. అయస్కాంత శక్తిని, దిశను మార్చడం ద్వారా నానో రోబో ఎక్కడికి వెళ్లాలన్నది నియంత్రించవచ్చు. కేన్సర్ చికిత్సకూ ఇవి ఉపయోగపడతాయని అంచనా. అంతేకాక కణస్థాయిల్లో మార్పులు చేయాలన్నా వీటిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయి తే వీటిని ఖరీదైన లోహాలతో తయారుచేశామని, మరిన్ని పరిశోధనలతో చౌకగా తయారు చేసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. -
‘స్మార్ట’గా డీఎన్ఏ టెస్టింగ్
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చేయలేని పని అంటూ ఏదీ లేదేమో. అంతగా పెరిగిపోయింది దీని టెక్నాలజీ. తాజాగా ఈ పనుల జాబితాలోకి మరొకటి చేరింది. అదే డీఎన్ఏ స్కానింగ్! అవును నిజమండి బాబు..! లాస్ ఏంజిలెస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటర్‌తో తయారు చేసిన ఓ అటాచ్‌మెంట్‌ను తగిలించుకుంటే చాలు.. ఎలాంటి స్మార్ట్ఫోనైనా డీఎన్ఏ మైక్రోస్కోపుగా మారిపోతుంది. వీటితో కేన్సర్ నుంచి అల్జీమర్స్ వరకూ మనకు వచ్చే ప్రమాదమున్న అనేక రకాల వ్యాధుల గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. డీఎన్ఏ పోగులకు రంగులు అద్ది లేజర్ల సాయంతో ఉత్తేజితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. డీఎన్ఏ పోగులో పదివేల కంటే ఎక్కువ బేస్‌పెయిర్స్ ఉన్నప్పుడు ఈ పరికరం చక్కగా పనిచేసింది. త్వరలోనే దీన్ని మలేరియా నిరోధకతను పరీక్షించేందుకు ఉపయోగించనున్నారు.