upper caste men
-
మేం చెప్పేది చేయవా అంటూ దారుణం
పాలన్పూర్: గుజరాత్ లో మరోసారి గోవు వివాదం రగులుకుంది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన ఓ దళిత గర్భిణీ స్త్రీ, ఆమె భర్త, మరో వ్యక్తిపై కొందరు అగ్రకులస్తులు దాడి చేశారు. వారిని తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్ లోని బనస్కంత జిల్లాలోని అమిర్ గఢ్ తాలుగా కర్జా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా(25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరు దళితులు. దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తులు తమ పొలంలో ఆవు చనిపోయిందని, దాని కళేబరాన్ని తీసి పారేసేందుకు రావాలని రనవాసియాను వారు అడిగారు. అయితే, ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని బదులిచ్చారు. తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది అతడిపై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుపడబోయింది. దీంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నారు. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైనా దాడి చేశారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. -
చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి..
ఆగ్రా: ఓ గేదెను దొంగిలించాడనే అనుమానంతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.తమ గేదెను దొంగిలించారనే అనుమానంతో ఓ 15మంది అగ్రకులస్తులు ఈ పనిచేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. 'మా కొడుకు గేదెను దొంగిలించాడనే అనుమానంతో ఇంటికొచ్చిన 15మంది పెద్ద కులపోల్లు ఇంట్లో ఉన్న నా కొడుకును ఈడ్చుకెళ్లారు. మా వాడు ఆ దొంగతనం చేయలేదు. అయినా, మా కొడుకును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి దారుణంగా హింసించారు. వాడి మార్మాంగాలపై పెట్రోల్ పోయడమే కాకుండా మత్తు సూదులు కూడా వేశారు' అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
పిల్లలపై దాడి, నగ్నంగా ఊరేగింపు
జైపూర్ : రాజస్థాన్ లో ముగ్గురు దళిత బాలురను నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోటార్ సైకిల్ దొంగిలించాడనే ఆరోపణలతో వీరిపై అగ్రకులానికి చెందిన వ్యక్తులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. చిత్తోర్ ఘడ్ లోని బస్సీ గ్రామంలో ఈ భయంకరమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మరోవైపు నిందితులపై ఎలాంటి చర్య చేపట్టని పోలీసులు, బాధితులపై కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించడం వివాదాన్ని రేపింది. వివరాల్లోకి వెళితే అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు పిల్లలను మండుటెండలో ఓ చెట్టుకు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో వారి ప్రకోపం చల్లారలేదు. 42 డిగ్రీల ఎండలో నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. బాధతో బాధితులు హాహాకారాలు చేసినా, వదిలిపెట్టమని వేడుకున్నా కనికరించలేదు. వారి ఆగడాలతో చుట్టూ ఉన్న ప్రజలు కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. సుమారు గంటసేపు ఈ తతంగం నడిచింది. ఒక గంట తర్వాత వచ్చిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...పిల్లలను విడిపించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బైక్ దొంగతనం కేసులో బాలురను అరెస్టు చేశారు. విచారణ సమయంలో బైక్ దొంగిలించినట్టుగా అంగీకరించారని, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి గజ్ సింగ్ తెలిపారు. అటు దాడి ఘటనలో అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.