upsc examinations
-
సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు..
పట్నా(బిహార్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లా నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ బొసక్ తన మూడో ప్రయత్నంలో 45వ ర్యాంక్ సాధించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ 2018 బ్యాచ్ విద్యార్థి. అనిల్ తండ్రి వినోద్ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు అమ్ముతుంటారు. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఫలితాల్లో అనిల్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబం పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తండ్రి వినోద్ కుమారుడి సక్సెస్‌పై స్పందిస్తూ.. ‘ఐఐటీకి అనిల్ ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అతని టీచర్ చాలా సాయం చేశారు. కష్టసాధ్యమైన యూపీఎస్సీకి అనిల్ బోసక్ ఎంపిక కావడం కలగా ఉంది. ఐఐటీ తర్వాత అనిల్ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. మా అబ్బాయికి ఉపాధ్యాయులు కూడా ఎంతో చేయుతనందించారు. తొలుత కష్టతరమని భావించిన అనిల్ పడుతున్న కష్టం చూసి నా వంతుగా నేను కూడా.. సహాకారం అందించాను. ఇప్పుడు నా కొడుకు విజయంచూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షలో 616 ర్యాంకు సాధించిన అనిల్ ఈసారి మరింత కష్టపడి 45వ ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడని వినోద్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి -
ఈరోజు నేను.. రేపు మరొకరు: స్పీకర్ కుమార్తె
న్యూఢిల్లీ: ‘‘ అవాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ కనిపెట్టి వారిని జవాబుదారులుగా నిలబెట్టాలి. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు. ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తనయ అంజలి బిర్లా అభిప్రాయపడ్డారు. అయితే ట్రోల్స్ వల్ల తనకు కాస్త మంచే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి వాళ్లను దీటుగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని తెలిపారు. కాగా అంజలి బిర్లా ఇటీవల ఐఏఎస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది ఆమెపై విషం చిమ్మారు. ప్రతిభ లేకపోయినా.. పరీక్ష రాయకుండానే జాబ్ సంపాదించారంటూ సోషల్ మీడియలో విద్వేషపూరిత కామెంట్లు చేశారు. కాగా వాస్తవానికి ఆమె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఫ్యాక్ట్ చెక్(నిజనిర్ధారణ) సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు అంజలి గురించి అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అంజలి బిర్లా.. ‘‘ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి ఉద్యోగం పొందానని నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రతికూల కామెంట్ల వలన నా మనసు దృఢంగా తయారైంది. నేను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాను. నేనెంతగా హార్డ్‌వర్క్ చేస్తానో.. నాతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే తెలుసు. నిజానికి మున్ముందు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే ట్రోల్స్ కారణంగా పూర్తిస్థాయిలో పరిణతి చెందిన వ్యక్తిగా రూపాంతరం చెందాను’’అని చెప్పుకొచ్చారు. కాగా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసిన వారికి.. అంజలి బిర్లా ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, కనీసం వ్యవస్థలనైనా గౌరవించాలంటూ హితవు పలికారు. ఇందుకు సంబంధించిన పోస్టుకు తన ఉత్తీరణ పత్రాలను కూడా జోడించారు. (చదవండి: ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే!) -
ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసి.. ఆమెపై అత్యాచారం చేసినందుకు మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదైంది. బాధితురాలు యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకున్న ఓ అభ్యర్థిని కావడం గమనార్హం. 2013 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి లోహిత్ మతానీ తనపై ఈ సంవత్సరం ఆగస్టు నెలలో టుకోగంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసిందని జిల్లా ఎస్పీ ఓపీ త్రిపాఠీ తెలిపారు. ఆ తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలు ప్రాంతాల్లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఎక్కడకు వెళ్లినా ఆమె తన భార్య అనో, కాబోయే భార్య అనో చెప్పేవాడు. కానీ, ఆ తర్వాత మాత్రం ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడు. యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకుంటూ ప్రిపేర్ అయ్యే సమయంలో ఫేస్బుక్ ద్వారా మతానీతో బాధితురాలికి పరిచయం అయ్యింది. పరీక్షల ప్రిపరేషన్‌కు సహకరిస్తానని చెప్పి ఆమెను అతడు లొంగదీసుకున్నాడు. దీంతో ఐపీఎస్ అధికారి మతానీపై 376 (అత్యాచారం), 417 (మోసం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.