ఫలించిన ఎమ్మెల్యే కృషి
ఉరవకొండ : ఉరవకొండ మేజర్ పంచాయతీలో కొన్నేళ్లుగా ముక్కుపుటాలాలను అదరగొట్టే దుర్వాసనతో ఇబ్బందికరంగా మారిన సులభ్ కాంప్లెక్స్‌ను ఆదివారం శుభ్రం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉరవకొండలో మేధావులు, విద్యావేత్తలతో కలిసి పట్టణ అభివృద్ధి సాధన కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు ప్రతి వార్డూ తిరిగి సమస్యలు గుర్తించారు. జూలై 16, 17 తేదీల్లో పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బస్టాండ్‌తో పాటు దుర్భరంగా వూరిన సులభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. అదే నెల 31న కలెక్టర్ సొలవున్ ఆరోగ్య రాజ్‌నూ కలిసి ఉరవకొండకు మున్సిపాల్టీ హోదా కల్పించి, ప్రభుత్వ ఆస్పత్రిలో వలిక వసతులు, సులభ్ కాంప్లెక్స్ ఆధునీకరణతో పాటు వురో 17 ముఖ్య సమస్యలను వివరించారు.
ఇందు కోసం రూ. 20 కోట్ల నిధులు వుంజురు చేయూలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకుంలగా స్పందించి మొట్ట మొదటిదిగా సులబ్ కాంప్లెక్స్ ను శుభ్రం చేరుుంచాలంటు జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీ అధికారి ఆదివారం కార్మికులతో సులభ్ కాంప్లెక్స్‌ను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దీంతో పాటు కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న పంచాయతీ స్థలంలో ప్రహరీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.