user ID
-
గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేసేలా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. పాస్వర్డ్ 123లకు గుడ్‌బై ప్రస్తుతం, ఏదైనా వెబ్సైట్, యాప్‌లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్‌కీస్’ ఆప్షన్‌తో సంప్రదాయ పాస్వర్డ్లైన పాస్వర్డ్ 123లకు స్వస్తిపలకనుంది. వచ్చే ఏడాది వరల్డ్ పాస్వర్డ్డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్‌కీస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాస్‌కీస్ అంటే? పాస్‌కీస్ అంటే ఫేస్ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్‌లో లేదంటే వెబ్సైట్లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది. పాస్‌కీస్ టెక్నాలజీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అరికట్టేందుకు 2009లో పాస్‌కీస్ విధానం వినియోగిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అయితే 2012లో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ పేపాల్ దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్ టెక్నాలజీ వినియోగం కోసం పనిచేసేలా ఓ ఒప్పందానికి వచ్చాయి. ఫిడోలో గూగుల్ భాగస్వామ్యం అలా జులై 2012లో ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్(Fast Identity Online (FIDO) పేరుతో ఓ సంస్థను స్థాపించాయి. 2013లో ఫిడోలో గూగుల్ సైతం చేరింది. ఆ మరుసటి ఏడాది అంటే 2014లో పేపాల్ - శాంసంగ్ కలిసి ఫిడో అభివృద్ది చేసిన అథంటికేషన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. దీని సాయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో పేపాల్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే పాస్వర్డ్ లేకుండా స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గూగుల్ పాస్‌కీస్ ప్రయోగం తాజాగా పాస్‌కీస్ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ ప్రయోగాలు ముమ్మరం చేసింది. ఫిడో అలయన్స్‌లో ఉన్న ఇతర టెక్ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ పాస్‌కీస్ ప్రాజెక్ట్‌పై కలిసి పనిచేస్తుంది. ఆ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని , వచ్చే ఏడాది మే 2 వరల్డ్ పాస్వర్డ్ డే రోజున పాస్‌వర్డ్‌ల స్థానంలో పాస్‌కీస్ ఆప్షన్‌ను గూగుల్ తేనున్నట్ల నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్ అక్కర్లేదు! -
400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!
సైబర్ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్‌ను తయారు చేశారు. ఆ యాప్స్‌ను సోషల్ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు. ఈ తరుణంలో మెటా ఆ యాప్స్‌ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్ చెప్పింది. మెటా యూజర్ల పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్ నేరస్తులు యూజర్లకు యాప్స్ నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్ వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్ వెబ్‌లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది. సేఫ్‌గా ఉండాలంటే ఈజీ మనీకోసం సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్స్ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్ సెట్టింగ్ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మార్క్ జుకర్ బర్గ్ : ‘వర్క్ కంప్లీట్ చేయకపోతే..నిన్ను ఈ కత్తితో నరికేస్తా!’ -
అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితా ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్‌నేమ్స్, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్‌వర్డ్‌లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ "123456789," ఐలవ్ యూ" లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్‌వర్డ్‌లనే వాడుతున్నారట. నార్డ్‌పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం "123456" టాప్‌లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్వర్డ్ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్వర్డ్ చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్, చాకొలెట్ లాంటి పాస్వర్డ్లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్1, సెన్హా (పోర్చుగీసులో పాస్వర్డ్ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది. 10 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు 1. 123456 2. 123456789 3. పిక్చర్ 1 4. పాస్వర్డ్ 5. 12345678 6. 111111 7. 123123 8. 12345 9. 1234567890 10. సెన్హా మీ పాస్వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారా?
సాక్షి న్యూఢిల్లీ: ఆన్లైన్లో రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో వినియోగదారులకు ఊరట. రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐర్సీటిసి) త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను మరింత కఠినం చేయనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఏజెంట్‌గా పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లతో నకిలీ ఐడీలనుసృష్టించి, తద్వారా తత్కాల్ సహా, ఆన్లైన్లో టికెట్ విక్రయాల్లో అక్రమ దందాకు చెక్ చేపట్టేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో యూజర్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన నిబంధలను పటిష్టం చేయనుంది. వెబ్సైట్లో యూజర్ల నమోదుకు మరిన్ని గుర్తింపులను కోరనుంది. ఐఆర్సీటీసీ వినియోగదారుని ఐడి,పాస్వర్డ్, మొబైల్ నంబర్‌తోపాటు ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి ఇతర ముఖ్యమైన ఐడీలను కూడా వినియోగదారుని కోరనుంది. బినామీ పేర్లతో నకిలీ ఐడీలతో ఏజెంట్లు పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్న వైనం తెలిసిందే. వేలాది నకిలీ యూజర్ ఐడిల ద్వారా ఇ-టికెట్లను బ్లాక్ చేసి, వాటిని అధిక ధరకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు అధికారులు దృష్టి సారించారు. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్‌వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైన సమాచారం, వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌ను తమ డెస్క్‌పై ఉన్న నోట్‌ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది.