అమ్మకు మేమున్నాం..
ఒంగోలు టౌన్: ‘అమ్మను వదిలించుకున్నాడు’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన గుమ్మళంపాడు ఆదెమ్మ(72) అనే వృద్ధురాలిని ఐదురోజుల క్రితం ఆమె కుమారుడు మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి రిమ్స్ ముందు వది లేసి వెళ్లాడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లి అన్నపానియాలు లేకుండా సైకిల్ స్టాండు కింద ఒంటరిగా చలిలో వణుకు తూఉంది.
ఆ తల్లి దీనగాథపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఒంగోలులోని పొనుగుపాటినగర్‌కు చెందిన కసుకుర్తి కోటమ్మ అనే మహిళ ఉదయాన్నే రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆ తల్లిని ఆదరించారు. పొనుగుపాటినగర్‌లో ఉన్న ఉషోదయ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు సిద్ధమైంది. ఆమెకు అప్పహారం అందిస్తున్న సమయంలో ఆదెమ్మ మనవరాలు హడావుడిగా ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లిపోయారు.
ఒంగోలు టౌన్: ‘అమ్మను వదిలించుకున్నాడు’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన గుమ్మళంపాడు ఆదెమ్మ(72) అనే వృద్ధురాలిని ఐదురోజుల క్రితం ఆమె కుమారుడు మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి రిమ్స్ ముందు వది లేసి వెళ్లాడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లి అన్నపానియాలు లేకుండా సైకిల్ స్టాండు కింద ఒంటరిగా చలిలో వణుకుతూ ఉంది.
ఆ తల్లి దీనగాథపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఒంగోలులోని పొనుగుపాటినగర్‌కు చెందిన కసుకుర్తి కోటమ్మ అనే మహిళ ఉదయాన్నే రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆ తల్లిని ఆదరిం చారు. పొనుగుపాటినగర్‌లో ఉన్న ఉషోదయ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు సిద్ధమైంది. ఆమెకు అప్పహారం అందిస్తున్న సమయంలో ఆదెమ్మ మనవరాలు హడావుడిగా ఆటోలో వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లిపోయారు.