utnuru
-
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
పంది రూపంలో వచ్చిన మృత్యువు
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్) : పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డువచ్చిన అడవి పందిని తప్పించబోయి ఓ వాహనం బోల్తా పడడంతో ముగ్గురు చెందారు. 11 మంది గాయపడ్డారు. ఖానాపూర్ మండలం పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ కడారి వినోద్ తెలిపిన వివరాలివీ.. కుమురంభీం జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామంలో ఓ ఇంట్లో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో నిజామాబాద్‌కు చెందిన బంధువులు వెళ్లారు. 28న మహారాష్ట్ర కిన్వట్లో జరిగిన రిసెప్షన్‌కు కూడా హాజరై తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఖానాపూర్ మండలంలోని పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద తుఫాన్ (ఏపీ33బి5900) వాహనానికి అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ సలీం (35), బాబు మియా (40) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన బోధన్ సాలూర గ్రామానికి చెందిన బాబు ఖురేషి (55) ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ ఫర్హాన, రెహాన, గోరీబీ, షేక్ ఫరీన, మహిబూబ్బీ, అబ్దుల్ ఖాజీ, ఆబిదాబేగం, రుక్సాన్, డ్రైవర్ రబ్బానీ, ఘుడూతోపాటు అజీజ్‌లను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని సీఐ వినోద్ సందర్శించి మృతదేహాలను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు పంపించారు. మృతుల బంధువైన అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల్లో అలుముకున్న విషాదం పెళ్లికి వెళ్లి అరగంట అయితే తమ ఇళ్లకు వెళ్తామనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇటు జంగాం బంధువుల ఇళ్లతోపాటు అటు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా మృతుల్లో షేక్ సలీం, బాబు ఖురేషీలు అన్నదమ్ముళ్లు. నిజామాబాద్ జిల్లా శాంతినగర్ కాలనీకి చెందిన వారు కాగా మేనమామ అయిన బాబుమియా బోధన్ మండలం సరూర్‌నగర్‌కు చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మండలవాసులు, బంధువులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ఆదివాసీ, లంబాడీలతో చర్చలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆదిలాబాద్ : ఆదివాసీ, లంబాడీల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం ఇరువర్గాలతో చర్చలకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం వారితో చర్చలు జరిపినవారిలో ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐజీ వై.నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఉన్నారు. మొదట ఆదివాసీ నాయకులతో ఐటీడీఏ కార్యాలయం లో, ఆ తర్వాత రాత్రి కుమురంభీం కాంప్లెక్స్ లో లంబాడీ నాయకులతో అధికారులు చర్చించారు. జిల్లాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కలిసిరావాలని అధికారులు కోరారు. చర్చలు ముగిసిన తర్వాత వేర్వేరుగా మీడి యాకు వివరాలను తెలియజేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం ఆగదని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు అధికారులకు స్పష్టం చేశారు. కుమురంభీం విగ్రహానికి చెప్పులదండ వేసిన వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన నాయకులు మర్సకోల తిరుపతి, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలస లంబాడీలకు వ్యతిరేకమే... లంబాడీలకు పూర్తిస్థాయి రక్షణ ప్రభుత్వం కల్పించాలని ఆలిండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్‌సింగ్ తిలావత్ చర్చల్లో అధికారులను కోరారు. లంబాడీలు ఎస్టీలు కాదనే హక్కు ఎవరికీ లేదని అన్నారు. వలస లంబాడీలకు తాము కూడా వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో లంబాడీ నేతలు జాదవ్ రమణానాయక్, రామారావు, భరత్ తదితరులు ఉన్నారు. సద్దుమణిగిన ఘర్షణలు.. ఏజెన్సీలో సోమవారం ఘర్షణలు సద్దుమణిగాయి. పాత జిల్లా పరిధిలో పోలీసు పహారా కొనసాగుతుంది. ముగ్గురు ఐజీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఎలాంటి సంఘటన చోటుచేసుకోలేదు. -
పోల్‌చిట్టీలు లేవని బయటకు పంపొద్దు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటర్ల వద్ద పోల్ చిట్టీలు లేవని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించొద్దని కలెక్టర్ అహ్మద్ బాబు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారులకు స్థానిక పీఎమ్మార్సీ భవనంలో ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రెండో రోజు సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి ఉన్న గుర్తింపుకార్డుల్లో ఓటర్ స్లిప్పు ఒక ఆధారం మాత్రమేనని చెప్పారు. పోల్ చిట్టీ లేకున్నా ఓటరు జాబితా ప్రకారం ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. సాధారణ ఎన్నికల నిర్వహణ రోజున పోలింగ్‌కు గంట ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తప్పనిసరిగా లోక్‌సభ, శాసనసభకు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకువాలని పేర్కొన్నారు. గర్భిణులు, అంధులు, వికలాంగులు నేరుగా ఓటు వేసే అవకాశం కల్పించాలని తెలిపారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, జాబ్‌కార్డు వంటివి ఓటరు గుర్తింపుకార్డు కిందికి రావని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించిందని అన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ సాధారణ పరిశీలకులు పంకజ్ జోషి, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆర్డీవో రామచంద్రయ్య, పోలింగ్ నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. -
జనరేటర్, డీజిల్ ఇంజన్ పనిచేయలేదు...విషాదం!
ఆదిలాబాద్: బావిలోపడిన ఓ విద్యార్థిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అగ్నిమాపక వాహనం వచ్చినా అందులో జనరేటర్ పనిచేయలేదు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మణికంఠ ఉట్నూరు క్రీడా పాఠశాల బావిలో పడ్డాడు. ఆ విద్యార్థిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించింది. బావిలో నీరు తోడేందుకు ప్రయత్నించగా, ఫైర్ ఇంజన్లో జనరేటర్ పనిచేయలేదు. అధికారులు వెంటనే డీజిల్ ఇంజన్‌ను తెప్పించారు. అదీ పనిచేయలేదు. అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఎంత కష్టపడినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు. మణికంఠ మృతి చెందాడు.