Vadodara (Gujarat)
-
పోస్టర్ల కలకలం.. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అభ్యర్ధి
సాక్షి, గాంధీ నగర్ : గుజరాత్ బీజేపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, వడోదర ఎంపీ రంజన్‌బెన్ ధనుంజయ్ భట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు వ్యక్తిగత కారణాల వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. ఇటీవల బీజేపీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. అందులో వడోదర స్థానం నుంచి రంజన్‌బెన్ భట్‌ను బీజేపీ మూడోసారి నామినేట్ చేసింది. మేయర్ సస్పెండ్ అయితే, 2014, 2019 వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినా కానీ ఆమె తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు ఊతం ఇచ్చేలా భట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం అంతటా పోస్టర్లు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా,అవినీతి ఆరోపణల కారణంగా రంజన్‌బెన్ భట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్రీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ డాక్టర్ జ్యోతి పాండ్యాను బీజేపీ అధిష్టానం 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. కుట్ర కోణం తనను ఎంపిక చేసినందుకు పెరిగిపోతున్న అసమ్మతిపై రంజన్‌బెన్ భట్ స్పందించారు. నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఎవరో కావాలనే ఇలా పోస్టర్లను అంటించారని మండి పడ్డారు. పార్టీ కార్యకర్తలు తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారని, వడోదర ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల అంతటా నిర్వహిస్తున్న సమావేశాలను బట్టి అర్ధమవుతుందని’ అని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వడోదర ఎంపీ రంజన్‌బెన్ ధనుంజయ్ భట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. -
గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ
న్యూఢిల్లీ: ఆర్మీ కోసం ఎయిర్‌బస్ సీ-295 ట్రాన్స్పోర్ట్ విమానాలను దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఎయిర్‌బస్ సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.22,000 కోట్లతో వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ‘సైనిక ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రైవేట్ కంపెనీ భారత్‌లో తయారు చేయనున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాలను పౌర రవాణాకు సైతం ఉపయోగిస్తాం.’ అని తెలిపారు రక్షణ శాఖ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 30న ఆదివారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. యూరప్ వెలుపల సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. గుజరాత్ ఎన్నికల వేళ వేలాది ఉద్యోగులు కల్పించే భారీ ప్రాజెక్టును ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వాయుసేనలోని పాత ఏవీఆర్‌ఓ-748 ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ గత వారమే ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: దెయ్యంలాంటి రూపంతో ఫేమస్.. అసలు ముఖం మాత్రం ఇది! -
షాకింగ్ : ఆన్లైన్లో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లను కొంటున్నారా? అయితే కాస్త చూసి కొనుగోలు చేయండని పలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తాజాగా వడోదరలో భారీ ఫేక్ మొబైల్ హ్యాండ్సెట్ రాకెట్ వెలుగుచూసింది. ఈ రాకెట్లో కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తిని వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి నకిలీ హ్యాండ్సెట్లను తయారుచేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అంతేకాక ఈ వ్యక్తి నుంచి రూ.24 లక్షల విలువైన నకిలీ మొబైల్ హ్యాండ్సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ హ్యాండ్సెట్లపై తాము ఇప్పటికే పలు ఫిర్యాదులను అందుకున్నామని, కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ మొబైల్ హ్యాండ్సెట్ల రాకెట్లో కీలకదారి అయిన ఈ వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు నకిలీ యూనిట్లను అమ్మినట్టు విచారణలో తేలింది. నకిలీ డివైజ్‌లలో ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఉన్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రూ.50వేలకు పైన ఖరీదు ఉన్నవాటినే నకిలీలు రూపొందించి, ఆన్లైన్ కస్టమర్లకు అమ్మినట్టు తేల్చారు. అయితే కస్టమర్లు తాము కొనుగోలు చేయాలనుకునే స్మార్ట్‌ఫోన్ అసలైనదా? కానిదా? తెలుసుకునేందుకు ప్రతి ఫోన్‌పై ఐఎంఈఐ నెంబర్‌ను చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. *#06# నెంబర్‌కు డయల్ చేసినా కూడా ఐఎంఈఐ నెంబర్, సంబంధిత మొబైల్ కంపెనీదా? కాదా? అని తెలిసిపోతుందన్నారు. -
ఉపఎన్నికల ఉత్కంఠకు నేడు తెర
3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాల ఫలితాల వెల్లడి గుజరాత్లో మోడీ వారసురాలికి తొలి పరీక్ష న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలు, 33 శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ నేడు తొలగనుంది. 10 రాష్ట్రాల పరిధిలో ఈనెల 13వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నారుు. పార్టీ ప్రతిష్టకు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలపై కమలనాథులు చాలా ఆశలు పెట్టుకున్నారు. వడోదర(గుజరాత్), మెరుున్‌పురి(యూపీ), మెదక్(తెలంగాణ) పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగారుు. యూపీలోని 11 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్లో 9, రాజస్థాన్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో రెండు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క స్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు జరిగారుు. * పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా అత్యధిక ఎంపీ సీట్లను సొంతం చేసుకున్న బీజేపీ ఉప ఎన్నికల్లోనూ తమ హవా కొనసాగుతుందనే విశ్వాసంతో ఉంది. * హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ తాజా ఫలితాలు పార్టీ క్యాడర్‌కు మంచి టానిక్‌లా పనిచేస్తాయని ఆశలు పెట్టుకుంది. * వడోదర ఎంపీ సీటుకు ప్రధాని నరేంద్రమోడీ, మెరుున్‌పురి సీటుకు సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్, మెదక్ పార్లమెంట్ స్థానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. * గుజరాత్లో నరేంద్రమోడీ వారసురాలిగా బాధ్యతలు చేపట్టిన సీఎం ఆనందిబెన్ పటేల్ తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. వడోదర ఎంపీ సీటుతో పాటు 9 అసెంబ్లీ సీట్లు బీజేపీకి సిట్టింగ్ స్థానాలు. మోడీ లేకుండా గుజరాత్లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించటం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. * కేసీఆర్ ప్రాతినిథ్యం వహించిన మెదక్ ఎంపీ స్థానం నుంచి టీఆర్ఎస్ తన అభ్యర్థిగా కె.ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించింది. బీజేపీ నుంచి తూర్పు జయప్రకాష్‌రెడ్డి తలపడుతున్నారు.