3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాల ఫలితాల వెల్లడి
గుజరాత్‌లో మోడీ వారసురాలికి తొలి పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలు, 33 శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ నేడు తొలగనుంది. 10 రాష్ట్రాల పరిధిలో ఈనెల 13వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నారుు. పార్టీ ప్రతిష్టకు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలపై కమలనాథులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
వడోదర(గుజరాత్), మెరుున్‌పురి(యూపీ), మెదక్(తెలంగాణ) పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగారుు. యూపీలోని 11 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్‌లో 9, రాజస్థాన్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క స్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు జరిగారుు.
* పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా అత్యధిక ఎంపీ సీట్లను సొంతం చేసుకున్న బీజేపీ ఉప ఎన్నికల్లోనూ తమ హవా కొనసాగుతుందనే విశ్వాసంతో ఉంది.
* హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ తాజా ఫలితాలు పార్టీ క్యాడర్‌కు మంచి టానిక్‌లా పనిచేస్తాయని ఆశలు పెట్టుకుంది.
* వడోదర ఎంపీ సీటుకు ప్రధాని నరేంద్రమోడీ, మెరుున్‌పురి సీటుకు సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్, మెదక్ పార్లమెంట్ స్థానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు నిర్వహించారు.
* గుజరాత్‌లో నరేంద్రమోడీ వారసురాలిగా బాధ్యతలు చేపట్టిన సీఎం ఆనందిబెన్ పటేల్ తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. వడోదర ఎంపీ సీటుతో పాటు 9 అసెంబ్లీ సీట్లు బీజేపీకి సిట్టింగ్ స్థానాలు. మోడీ లేకుండా గుజరాత్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించటం 12 ఏళ్లలో ఇదే తొలిసారి.
* కేసీఆర్ ప్రాతినిథ్యం వహించిన మెదక్ ఎంపీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా కె.ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించింది. బీజేపీ నుంచి తూర్పు జయప్రకాష్‌రెడ్డి తలపడుతున్నారు.
ఉపఎన్నికల ఉత్కంఠకు నేడు తెర
Published Tue, Sep 16 2014 12:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement