valid
-
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
బ్రిటన్ పాస్‌పోర్టులు చెల్లుతాయా? ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్‌పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్‌పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కలి్పంచాలి’’అని రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు రాణి మరణం నేపథ్యంలో తమ పాస్‌పోర్టులు ఇంకా చెల్లుతాయా లేక వాటిని మార్చుకోవాలా? అని బ్రిటన్‌కు చెందిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పాస్‌పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. గడువు ముగిసిన పాస్‌పోర్టులను పునరుద్ధరించుకొనేటప్పుడు రాజు చార్లెస్–3 పేరును అందులో చేరుస్తామని అధికార వర్గాలు ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాణి ఎలిజబెత్–2కు మాత్రం పాస్‌పోర్టు లేదు. ఎందుకంటే.. తన పేరిటే పాస్‌పోర్టులు జారీ అవుతున్నందున తాను కూడా పాస్‌పోర్టు కలిగి ఉండటం అర్థరహితమని ఎలిజబెత్–2 భావించారట. అయితే ఆమె మినహా బ్రిటన్ రాజకుటుంబంలోని ప్రతి ఒక్కరికీ.. అంటే దివంగత భర్త ప్రిన్స్ ఫిలిప్ సహా అందరికీ పాస్‌పోర్టు ఉండేది. ఆమె మరణం నేపథ్యంలో పాస్‌పోర్టులనే కాదు.. దేశ కరెన్సీ, స్టాంపులపై ‘రాణి’అనే పదం బదులు రాజు అనే పదాన్ని చేర్చాల్సి ఉంది. అలాగే యూకే జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద క్వీన్’ను ‘గాడ్ సేవ్ ద కింగ్’గా మార్చాల్సి ఉంది. చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం -
హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త రూ.10 నోట్లు
న్యూఢిల్లీ: కొత్త పది రూపాయల నోటును జారీ చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. త్వరలోనే ఈ నోట్లు అందుబాటులోకి రానున్నట్టు గురువారం వెల్లడించింది. అధిక భద్రతా లక్షణాలతో ఈ కొత్త 10 నోట్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే పాత పది రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ సీరిస్-2005లో రెండు నంబర్ ప్యానెల్స్‌పై ‘ఎల్’ (ఇన్ సైట్) లెటర్ తోపాటు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ సంతకంతో వీటిని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ఎడమ నుంచి కుడికి మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఉపసర్గ) ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉండనున్నట్టు ఆర్బిఐ పేర్కొంది. గతంలో బ్యాంకు జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటులోఉంటాయని వివరణ ఇచ్చింది. -
మరో 10 రోజులు పాతనోట్ల చెల్లుబాటు
-
ఈఎస్ఐ.. వైద్యం నై
కార్డులున్నా ప్రయోజం సున్నా చికిత్సకు నోచుకోని కార్మికులు వేతనాల్లో ప్రతి నెలా రూ.1.26 లక్షల కోత అయినా ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లని వైనం శాఖల మధ్య కొరవడిన సమన్వయం మున్సిపాలిటీలో ‘కంపు’ వ్యవహారం సంగారెడ్డి మున్సిపాలిటీ:శాఖల మధ్య కొరవడిన సమన్వయం కార్మికులకు శాపంగా మారింది. ఈఎస్ఐ కార్డులున్నా వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లోని సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉచితంగా వైద్యం అందించేందుకు కార్మిక శాఖ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించింది. కార్మికులు కార్డులు తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే వాటిని తిరస్కరిస్తున్నారు. కార్మికుల వేతనాలలో డబ్బును కట్ చేసినప్పటికీ ఈఎస్ఐ ఖాతాలో జమచేయని కారణంగానే చెల్లుబాటు కావడంలేదని తెలిసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు 300 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో రూ.4.96 లక్షలు, ఈఎస్ఐ ఖాతాలో 1.26 లక్షల రూపాయలను కార్మికుల వేతనాల్లోంచి కట్ చేసి జమ చేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాని కార్మిక శాఖ అధికారులు మాత్రం 2011-12 వరకు మాత్రమే చెల్లించారని దాని తర్వాత ఈఎస్ఐ డబ్బులు చెల్లించని కారణంగానే ప్రయివేట్ అసుపత్రులలో అమలు చేయడం లేదని చెబుతున్నారు. 2012 నుంచి 2016 మే వరకు కార్మికుల వేతనాల్లోంచి కోతలు విధిస్తున్నా వారి వారి ఖాతాలో జమ చేయలేదని తెలిసింది. ఎక్కడ జమ అవుతున్నాయో? నెలకు ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో ప్రతి నెలా రూ.6.22 లక్షలను కార్మికుల వేతనాల్లోంచి తీసుకుంటున్నారు. కాని అ డబ్బులు ఏ ఖాతాలో జమ అవుతున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు గాని వారి బంధువులకు అనారోగ్యానికి గురైన సమయంలో ఈఎస్ఐ కార్డు తీసుకుని ప్రయివేట్ ఆస్పత్రులకు వెళితే మీ ఖాతాలో డబ్బులు లేవని అందుకు కార్డుపై వైద్యం చేయడం లేదని సూచిస్తున్నారు. దీంతో కార్మికులు చేసేది లేక డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. మల్లేశం.. మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అతని కుమారుడికి మూర్చ వ్యాధి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఈఎస్ఐ కార్డు చూపించడంతో వారు సంబంధిత ఖాతాలో డబ్బులు లేవని వైద్యం చేయడం వీలు కాదని చెప్పారని బాధితుడు తెలిపారు. దీంతో తాను ఏజేసీని కలవడంతో లేఖ ఇచ్చారని, దీంతో ప్రయివేట్ అసుపత్రిలో వైద్యం అందించారని తెలిపారు. మాణయ్య.. ఎలక్ట్రికల్ విభాగంలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇతని కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం కోసం వెళితే ఈఎస్ఐ కార్డు చెల్లదని వెనక్కి పంపించారని అవేదన వ్యక్తం చేశారు. కుమార్.. మున్సిపాలిటీలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఇతను లీవర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలో వైద్యం కోసం చేరినప్పటికీ ఈఎస్ఐ కార్డుపై వైద్యం చేయడం లేదని తెలిపారు. తమ వేతనంలోంచి నెలకు రూ.1150 నుంచి 1250 రూపాయల వరకు ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కోతలు విధిస్తున్నా తమకు మాత్రం ఉపయోగం లేకుండా పోతుందన్నారు. సంవత్సరానికి రూ.12,36 లక్షల చొప్పున 2012 నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతలో అధికారులు జమ చేయాలేక పోయారు. కాని కార్మికుల వేతనాల్లోంచి కట్ చేసిన డబ్బులను ఎక్కడ జమ చేశారో తెలియడం లేదు. రూ. రెండు కోట్లు చెల్లించాం కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ 2011 నుంచి 2014 వరకు పెడింగ్‌లో ఉంటే తాను వచ్చాక వాటిని రెగ్యులర్ చేశాం. 2016 వరకు బకాయి ఉన్నా రెండు కోట్ల రూపాయలను ఈఎస్ఐ ఖాతాలో జమచేశాం. టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే. మే నుంచి జూలై వరకు మాత్రం ఈఎస్ఐ డబ్బులు చెల్లించలేక పోయామని, వాటిని సైతం ఈ నెలలో చెల్లిస్తాం. వాసం వెంకటేశ్వర్లు, ఇన్చార్జి కమిషనర్ కార్డున్నా ఉపయోగం లేదు 15 ఏళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నా.. ఈఎస్ఐ పేరుతో ప్రతి నెలా వేతనంలో కట్ చేస్తున్నారు. కాని ఆస్పత్రులకు వెళ్తే కార్డు వర్తించదంటున్నారు. సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నాం. పలుమార్లు ఈఎస్ఐ అధికారి సుకుమారిని ప్రశ్నిస్తే తమకు మున్సిపల్ నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వనందునే కార్డులు పనిచేయడం లేదని అంటున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఈఎస్ఐకి బకాయి లేమని అంటున్నారు. మా డబ్బులేమవుతున్నాయో మరి. - - సుధాకర్, కాంట్రాక్ట్ కార్మికుడు అందని వైద్యం వేతనం నుంచి ప్రతి నెలా ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో రూ.950 కట్ చేస్తున్నారు. ఈఎస్ఐ కార్డుతో వెళ్తే ప్రైవేట్ అసుపత్రుల్లో వైద్యం చేయడం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురైతే బంగారు ఆభరణాలు అమ్ముకుని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాం. నా జీతం నుంచి తొమ్మిదేళ్లుగా కట్అవుతున్నా.. ఆ డబ్బు ఈఎస్ఐకి జమ చేయడం లేదు. - - రాములు, కాంట్రాక్ట్ కార్మికుడు ఈఎస్ఐ అధికారి వివరణ.. కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ కార్డుపై ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయడం లేదని, వారి కార్డు నంబర్లపై డబ్బులు లేవనే విషయాన్ని ఈఎస్ఐ అధికారి సుకుమారి దృష్టికి తీసుకెళ్లగా కార్మికుల వివరాలు... వాట్సాప్‌లో పెడతానని మాత్రమే చెప్పారు. ఆ తరువాత మరింత వివరణ కోసం యత్నించగా, అందుబాటులోకి రాలేదు. -
దయాకర్ ఎన్నిక చెల్లదు
హైకోర్టులో సర్వే సత్యనారాయణ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరు దయాకర్ ఎన్నికను సవాలు చేస్తూ ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. దయాకర్ ఎన్నికను చెల్లనిదిగా నిర్ణయించి, వరంగల్ పార్లమెంట్ స్థానానికి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని సర్వే తన పిటిషన్లో కోరారు. ఇందులో దయాకర్‌తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసే నాటికి దయాకర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారని, ఆ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్లలో దయాకర్, అతని భార్య సంతకాలు చేశారని సర్వే పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు ప్రభుత్వంతో కాంట్రాక్టు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని ఆయన తెలిపారు. నామినేషన్ పత్రాల్లోని ఆస్తుల కాలమ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద రూ.1.49 లక్షలు అడ్వాన్స్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని, దీనిని బట్టి బీపీసీఎల్‌తో తను వ్యాపారం చేస్తున్నట్లు దయాకర్ స్వయంగా ఒప్పుకునట్లయిందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా దయాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని, అందులో భార్యను గృహిణిగా పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె బీపీసీఎల్ ఒప్పందంలో సంతకం చేశారని, రోహిణి గ్యాస్ ఏజెన్సీకి యజమాని కూడానన్నారు. వాస్తవాలను మరుగునపరిచి దయాకర్ సమర్పించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. -
మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లువు
-
విడాకుల పై బాంబే హైకోర్టు తీర్పు