Valuable lands
-
పరిశ్రమల భూములు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉన్న ప్రభుత్వం పరిశ్రమల భూము లను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణమార్కెట్ నుంచి కనీసం రూ.10 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కనీసం రూ.5 వేల కోట్లు వెంటనే సేకరించేందుకు అవసరమైన ప్రక్రియ ను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి.దీనికోసం హైదరా బాద్‌లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలనుకుంటోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల ‘మర్చంట్ బ్యాంకర్’కు రుణసేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణ యించారు.ఈ మర్చంట్ బ్యాంకర్ ప్రభు త్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటికి ప్రభుత్వ భూము లను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం 1% కమీషన్ చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీ షన్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మర్చంట్ బ్యాంకర్ కోసం మళ్లీ టెండర్ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి అప్పులు ఇప్పించడంలో అనువజ్ఞులైన ‘మర్చంట్ బ్యాంకర్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. అందులో భాగంగా గత నెల 23న తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రతిపాదనలు కోరుతూ టెండర్ ప్రకటన విడుదల చేసింది. అయితే టెండర్ ప్రకటనలో విధించిన పలు అంశాలపై మర్చంట్ బ్యాంకర్ల నుంచి కొన్ని విన్నపాలు అందాయి.వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి గత నెల 28న టెండర్ నిబంధనలు సవరిస్తూ మరో ప్రకటన విడుదల చేయడంతోపాటు బిడ్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తామని టీజీఐఐసీ ప్రకటించింది. అయితే టెండర్ డాక్యుమెంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు గమనించిన టీజీఐఐసీ గత నెల 23న ఇచ్చిన టెండర్‌ను ఈనెల 2న రద్దు చేసింది. ఆ లోపాలను సరిదిద్ది తిరిగి ఒకటి రెండు రోజుల్లో తాజా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తోంది. బ్యాంకర్ల ఎంపిక బాధ్యత టీజీఐఐసీకిఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే అధికారం టీజీఐఐసీ నేతత్వంలోని కమిటీకి అప్పగించినా, ఆర్థికశాఖనే కీలక పాత్ర పోషించనుంది. ఒకరి కంటే ఎక్కువ మర్చంట్ బ్యాంకర్లను నియమించే పక్షంలో సమపాళ్లలో బాధ్యతలు తీసుకొని నిర్దేశిత రుణం సేకరించాలి. పాత టెండర్ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌లో పాల్గొనే మర్చంట్ బ్యాంకర్లు రూ.50 లక్షలు ధరావత్తుగా చెల్లించాల్సి ఉంటుంది. భూములు తనఖా పెట్టడం సహా ఇతర సాంకేతిక, చట్టపరమైన అంశాలన్నీ మర్చంట్ బ్యాంకర్ ప్రభుత్వంతో సంప్రదిస్తూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన అరడజను మంది మర్చంట్ బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు ఆసక్తి చూపుతూ ఇప్పటికే బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. అయితే టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడంతో బిడ్ల దాఖలు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.రూ.10వేల కోట్లు సేకరణ లక్ష్యం...హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ కార్యకలాపాలు మందగించడంతో భూముల వేలం సాధ్యం కాదని, ఆశించిన మొత్తంలో నిధులు సమకూరే అవకాశం లేదని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. దీంతో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా కనీసం రూ.10వేల కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే బిడ్‌లో దాఖలు చేసిన మర్చంట్ బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు కూడా వేర్వేరుగా తాకట్టు కోసం ఎంపిక చేసిన భూముల విలువ (వాల్యూయేష¯Œన్) లెక్కగట్టినట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను రూ.20వేల కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ భూముల తాకట్టు ద్వారా లెక్కించిన విలువలో సగం మొత్తం అంటే.. రూ.10వేలు కోట్లు రుణ మార్కెట్ నుంచి అప్పు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు భావిస్తున్నట్టు తెలిసింది. 400 ఎకరాలను తాకట్టు పెట్టినా రూ.10వేల కోట్లు అప్పు పుట్టకుంటే.. అదనంగా మరింత భూమిని కూడా తాకట్టు పెట్టి అయినా రుణం తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు నెలల్లో రూ.10వేలు కోట్లు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా, కనీసం ఆరు నెలలు గడువు కావాలని మర్చంట్ బ్యాంకర్లు చెబుతున్నట్టు సమాచారం. ఆర్బీఐ అడ్డుకుంటుందనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే భూముల తాకట్టు ద్వారా తెచ్చే అప్పులకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూములను కుదువపెట్టి తెచ్చే అప్పులకు ఆర్బీఐ అభ్యంతరాలు చెబితే ఏం చేయాలనే దానిపై ఆర్థిక, పరిశ్రమల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. -
Hyderabad: హౌసింగ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్‌బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్‌బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్‌పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్‌బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్‌ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్‌బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్‌బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్‌బాబు, హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
నగరాలు, పట్టణాల్లో విలువైన భూములను లీజుదారులకు కట్టబెట్టే యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని మున్సిపల్ లీజు స్థలాలకు ముప్పు ముంచుకొస్తోంది. విలువైన భూములకు సంబంధించి లీజుకిచ్చిన వివరాలు స్థానిక సంస్థల్లో లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో స్థలాలను లీజుదారులకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రికార్డులులేని స్థలాలనే కాక.. రికార్డులు ఉన్న వాటిని సైతం లీజుదారులకు ధారాదత్తం చేసే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం 25 ఏళ్లకు మించి మున్సిపల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి వీల్లేదని నిబంధన ఉంది. లీజు గడువు ముగియగానే ఆ స్థలాలను బహిరంగ వేలం ద్వారా మళ్లీ లీజుకు ఇవ్వాలని నిబంధనలు చెపుతున్నాయి. అయితే ఇదివరకటి నిబంధనలను సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించింది. ఈ ఉపసంఘానికి రెవెన్యూ మంత్రి చైర్మన్‌గా, పురపాలక మంత్రి కన్వీనర్‌గా, కార్మిక శాఖ మంత్రి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. నగరాలు, పట్టణాల్లో కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ స్థలాలపై కన్నేసిన ఓ ముఖ్యనేత సోదరుడు, రాజధాని నగరానికి చెందిన ఓ మంత్రి తమ పనిని సజావుగా సాగించేందుకు ఎత్తుగడ వేసినట్లు సమాచారం. 25 ఏళ్లు వ్యాపారం చేసిన తర్వాత వారికి కాకుండా లీజు స్థలాలను బహిరంగ వేలంలో ఇతరులకు కేటాయిస్తే.. వారి జీవితాలు ఏం కావాలంటూ ఓ మంత్రి ప్రశ్నించడమే కాక, ఆ స్థలాలను లీజుదారులకే కట్టబెట్టాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ స్థలాలు, దుకాణాల సముదాయాలను కారు చౌకగా లీజు రూపంలో దక్కించుకున్న వారు ఇప్పుడు వాటిని విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. లీజు ధర పెంచాలని స్థానిక సంస్థలు ప్రయత్నించినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. దీంతో ఒకసారి లీజు పొందితే.. ఇక ఆ దుకాణాలుగానీ, స్థలాలుగానీ లీజుదారుల సొంతమయ్యేలా పరిస్థితి ఉంటోంది. అధికారులు మారిపోవడం, రికార్డులు గల్లంతు కావడం వంటి కారణాలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో లీజు అద్దె వసూలు కాని పరిస్థితులున్నాయి. ఎస్టేట్ కార్యాలయంలో ఏ స్థలాలు, దుకాణ సముదాయాల లీజు ఎప్పుడు ముగుస్తుందన్న సమాచారం లేకపోవడం ఒకటైతే.. రికార్డులు కూడా గల్లంతైన సంఘటనలు ఉన్నాయి. నల్లగొండ మున్సిపాల్టీ, అనంతపురం జిల్లా ధర్మవరం, తాడిపత్రి మున్సిపాల్టీల్లోనూ స్థలాలను కారు చౌకగా ఎన్నో ఏళ్ల నుంచి అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తోంది.