Value of assets
-
సంపద సృష్టిలో అదానీ రికార్డ్!
ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్–2022 ఏప్రిల్) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్ మూడో స్థానంలో ఉంది. 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో టీసీఎస్ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి. ► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం ► అదానీ విల్మార్ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది. ► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది. ► 2020 ఏప్రిల్ నాటికి 6 నెలల్లో భారత్‌లోని టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం. ► 2021 అక్టోబర్ 30 నాటికి భారత్‌లో టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది. ► వీటి మార్కెట్ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్ 4 శాతం క్షీణించగా, నాస్డాక్ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది. ► మార్కెట్ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు.. ► అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. ► సీరమ్ ఇన్స్టిట్యూట్ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. ► శాతం వారీగా చూస్తే వేదంత్ ఫ్యాషన్స్ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్మార్, బిల్ డెస్క్ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి. -
ఎంఎఫ్ నిర్వహణ ఆస్తులు 14% అప్
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) ఆశాజనక వృద్ధిరేటును నమోదుచేసింది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి చెంది రూ.24 లక్షల కోట్లకు చేరినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. క్రితం ఏడాది ఇదేకాలంలో దేశీ ఎంఎఫ్‌ల ఏయూఎం రూ.21 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అంశంపై స్పందించిన ఎంఎఫ్ పరిశ్రమ వర్గాలు.. రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం వల్లనే ఈ సారి రెండంకెల వృద్ధిరేటు సాధ్యపడిందని పేర్కొన్నాయి. తమ పరిశ్రమ కొనసాగించిన అవగాహన ప్రచారం కారణంగా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల (సిప్) ద్వారా పెట్టుబడులు జోరందుకున్నట్లు వివరించాయి. పరిశ్రమలోని 41 సంస్థలలో 33 ఎంఎఫ్‌లు వృద్ధిరేటును నమోదుచేశాయి. తాజా నివేదిక ప్రకారం సెప్టెంబరు నాటికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏయూఎం (ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను మినహాయించి) రూ.3,10,257 కోట్లు కాగా, ఆ తరువాత స్థానంలో ఉన్నటువంటి హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ ఏయూఎం రూ.3,06,360 కోట్లుగా నమోదైంది. రూ.2,54,207 కోట్లతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మూడవ స్థానంలోనూ, ఎస్బీఐ ఎంఎఫ్ రూ.2,53,829 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాయి. -
బంగారం బంగారమే!
నరసాపురం: ధరల పెరుగుదలలో ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసుకుంటున్న బంగారం తనకేదీ సాటిలేదని నిరూపిస్తోంది. గడిచిన వందేళ్లను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధరలు 2వేల రెట్లు పెరిగాయి. ఆస్తుల విలువ పెరుగుదలకు సంబంధించి బంగారానికి మరేదీ పోటీకాదని స్పష్టమవుతోంది. 1917లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు ధర కేవలం 11 రూపాయల 8 పైసలు ఉంటే ప్రస్తుతం అదే కాసు ధర రూ.22,800. అలాగే, 1917లో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 10 గ్రాములు రూ.15.20 ఉంటే, ఇప్పుడది రూ.30వేలు. అంటే గడచిన వందేళ్లలో బంగారం 2వేల రెట్లకు పైగానే పెరిగింది. మరోవైపు.. వందేళ్ల క్రితం భూముల ధరలు కూడా స్వల్పంగానే ఉండేవి. ఈ నూరేళ్లలో వందలు, వేలల్లో ఉండే భూముల ధరలు కోట్లల్లోకి మారినా.. అది అభివృద్ధిని బట్టి, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ పెరుగుదల పరిమితమైంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టిన సదరు కంపెనీల లాభనష్టాల మీదే రాబడి ఆధారపడి ఉంటుందనేది తెలిసిందే. డిపాజిట్లు ఇతర రూపాల్లో కూడా పెట్టుబడి రెండు వేల రెట్లు పెరగడమనేది జరగని పని. దీంతో బంగారం ప్రధాన పెట్టుబడి వస్తువుగా మారిపోయింది. వందేళ్ల క్రితం బంగారంపై రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతిలో 2 వేలు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం సమకూర్చుకోవాలని పరితపించే వారి దృక్పథంలో స్పష్టమైన మార్పు రావడంతో బంగారంపై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండదు బంగారం ధరలు పెద్దగా తగ్గవు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారం, బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే వందేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. – వినోద్‌కుమార్ జైన్, బులియన్ వ్యాపారి 2017లో రూ.22,000–23,000 మధ్య ట్రేడవుతోంది. కాగా, 1962లో రూ.89లు ఉన్న కాసు బంగారం ధర 1964లో రూ.64కు పడిపోయింది. -
మీ నెట్‌వర్త్ ఎంత?
♦ ఫైనాన్షియల్ బేసిక్స్ మొత్తం ఆస్తుల విలువలో నుంచి అన్ని రకాల రుణాల విలువను తీసివేస్తే వచ్చే విలువే నెట్‌వర్త్. వ్యక్తులకైనా, సంస్థలకైనా నెట్‌వర్త్‌ను బట్టే ఆ వ్యక్తి లేదా సంస్థకు నికరంగా వున్న ఆస్తి విలువ తెలిసేది. సంస్థలకు సంబంధించి ఈ నెట్వర్త్నే పుస్తక విలువ లేదా షేర్‌హోల్డర్ల మూలధనంగా పరిగణిస్తారు. నెట్‌వర్త్ విలువ మీ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే నెట్‌వర్త్ విలువ పెరుగుతూ పోతే అతని ఆర్థిక సామర్థ్యం బాగా ఉన్నట్లు లెక్క. అదే తగ్గుతూ వస్తే.. అతనికి ఆర్థిక లావాదేవీల నిర్వహణపై సరైన నియంత్రణ లేదని అర్థం. అదే ఒక కంపెనీ నెట్‌వర్త్ విలువ (బుక్ వ్యాల్యూ) పెరుగుతూ ఉంటే.. అది మంచి పనితీరును కనబరుస్తోందని తెలుసుకోవాలి. నెట్ వర్త్ విలువ బాగా ఉన్న వ్యక్తికి/కంపెనీకి క్రెడిట్ రేటింగ్ కూడా బాగా ఉంటుంది. నెట్‌వర్త్ అనేది వ్యక్తి/కంపెనీ నిధుల సమీకరణపై ప్రభావాన్ని చూపిస్తుంది. నెట్‌వర్త్‌ను లెక్కించడం ఎలా? నెట్‌వర్త్ విలువ ఎంతో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఇళ్లు, కారు, బైక్, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలతో ఒక జాబితా తయారుచేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న బ్యాంకు రుణాలు, ఇతర అప్పుల వివరాలతో మరొక జాబితా రూపొందించుకోండి. ఇప్పుడు ఆస్తుల విలువ లో నుంచి రుణ మొత్తాలను తీసివేస్తే మీ నెట్‌వర్త్ విలువ వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.20,00,000 ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. అలాగే అతనికి రూ.5,00,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయి. రూ.4,00,000 విలువైన వాహనం ఉంది. ఇవన్నీ అతని ఆస్తులు. అతను ఇంకా చెల్లించాల్సిన ఇంటి రుణం రూ.10,00,000 వరకూ వుంది. అలాగే అతనికి కారు రుణం రూ.2,00,000 ఉంది. ఇవన్నీ అతని రుణాలు. ఇప్పుడు అతని నెట్‌వర్త్ విలువ (మొత్తం ఆస్తుల విలువ-అన్ని రుణాలు) రూ.17,00,000గా ఉంటుంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతను నివాసం ఉంటున్న ఇంటి విలువ రూ.22,00,000కు పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ రూ.6,00,000గా, సేవింగ్స్ రూ.1,00,000గా వున్నాయి. వాహనం విలువ రూ.3,00,000కు తగ్గింది. కారు రుణం చెల్లించివేశాడు. ఇంటి రుణం రూ.6,00,000గా ఉంది. దాంతో అతని నెట్‌వర్త్ రూ.26,00,000గా ఉంటుంది. అంటే అతని నెట్‌వర్త్ ఐదేళ్లలో రూ.9,00,000 మేర పెరిగిందన్న మాట.