టీపీఏడీ వనభోజనాలు : భారీగా ట్రాఫిక్ జామ్
టెక్సాస్ :
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాలు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది.1481ఈ హిల్ పార్క్ రోడ్, లీవీస్విల్లే, టెక్సాస్‌లోని మెరినా పార్క్‌లో వనభోజనాలు కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.
అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక మైలుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. 2500 మందికి పైగా ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
గేమ్స్, మ్యూజిక్ మస్తీలతో టీపీఏడీ వనభోజనాలు కార్యక్రమం సందడిగా సాగింది.