Vanchana Vyatireka Deeksha
-
‘ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను నీరుగార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖరాసి చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో పోలవరం, హోదా, రైల్వేజోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం వంటి హామీలిచ్చి టీడీపీ, బీజేపీలు పట్టించుకోవటంలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకు వైఎస్ జగన్ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. హోదా కోసం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధించారో చూశామని.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధిస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులను విభజించకుండా ఏపీని పనిగట్టుకుని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు చాలా వాగ్దానాలు చేసి మోసం చేశాయన్నారు. -
నేడు అనంతపురంలో వంచనపై గర్జన దీక్ష
-
ప్రజల కష్టాలు పట్టని అశోక్‌గజపతిరాజు
సాక్షి, విజయనగరం : ఈ నాలుగేళ్లలో విజయనగరం జిల్లా సమస్యల గురించి కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు అశోక్‌గజపతిరాజు ఒక్కసారైనా చర్చించారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అలా చర్చించి ఉంటే తల దించుకుంటానని ఆయన అన్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల కాలంలో విజయనగరం జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. రాచరికపు వ్యవస్థలో ఉన్న అశోక్‌గజపతిరాజుకు ప్రజల కష్టాలు పట్టవన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్టని ఆయన అన్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కోట సుందరీకరణ, విజ్జీ స్టేడియం అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం అందించలేదని, జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒకటి మూసేశారన్నారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అత్యాచారాల నివారణకు చైతన్యం రావాల్సింది ప్రజల్లో కాదని, చంద్రబాబు నాయుడు కేబినేట్లో మార్పు రావాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ల అధికారంలో ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం నీతి నిజాయితీల గురించి ప్రజలు చెప్తారని అన్నారు. -
దీక్షా దివస్
-
నిస్సహాయస్థితిలో చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : నిస్సహాయస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగాకోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం భారీ ఎత్తున ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా వేదిక వద్దకు తరలివచ్చారు. వంచన దీక్షను ప్రారంభిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. వంచనతో కూడిన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాధ్యత, నైతికత చంద్రబాబుకు లేవని ఘాటుగా దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన తమ నాయకుడిని విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకుని అవమాన పరిచింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. మరో ఎమ్మెల్యే అంజద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఉద్దేశించి విమర్శించారు. 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. 15 ఏళ్ల హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. హోదా విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, హోదా కోసం ఎందాకైనా పోరాడతామని చెప్పారు. నాలుగేళ్ల నుంచి హోదా కోసం పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీనేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో మోసపూరిత పాలన నడుస్తోందని, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం మనందరిపైనే ఉందన్నారు. -
చంద్రబాబు దీక్షేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు
-
దొంగదీక్షలతో మోసం చేయడానికి వచ్చారు
-
రాక్షస పాలనకు చరమ గీతం పాడుదాం
-
ఏపీకి మోదీ-బాబు జోడి ద్రోహం చేసింది
-
ప్రత్యేక హోదా ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష
-
రాష్ట్ర ప్రయోజనాలను వంచించి...ఇప్పుడు దీక్షలు చేస్తారా ?
-
చంద్రబాబులా నీచపు రాజకీయాలు వైఎస్సార్సీపీ చేయదు