Varadaiahpalem
-
సత్యవేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని యువకుడికి గాయాలు
వరదయ్యపాళెం: తిరుపతి జిల్లాలో ఆదివారం సత్యవేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత కారు ఢీకొని ఒక యువకుడు గాయపడ్డాడు. అతడిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు వరదయ్యపాళెం సమీపంలోని వడ్డిపాళేనికి చెందిన బేల్దారి మేస్త్రి సురేష్ కథనం మేరకు.. అతడు ద్విచక్ర వాహనంపై వెళుతూ తడ–శ్రీకాళహస్తి ప్రధాన రోడ్డులోకి ప్రవేశించే సమయంలో వరదయ్యపాళెం నుంచి సత్యవేడు వైపు వెళ్తున్న సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది. సురేష్ చేతికి, తలకి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే హేమలత వరదయ్యపాళెంలోని ఓ టీడీపీ నేత ఇంటికి వెళ్లారు. గాయపడిన సురేష్‌ను కుటుంబసభ్యులు, స్థానికులు వరదయ్యపాళెంలో ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలించారు. బాధితుడికి రూ.3 వేలు ఇచ్చిన టీడీపీ నేతలు ప్రమాదం గురించి గోప్యంగా ఉంచారు. బేలుదారు మేస్త్రిగా రోజూ పనికివెళ్తేగానీ పూటగడవని తమకు దిక్కెవరంటూ బాధితుడు, అతడి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. -
గిరిజన బిడ్డను ఎత్తుకొని ఆడించిన నిత్యామీనన్..ఫోటో వైరల్
ప్రముఖ సినీ నటి, హీరోయిన్ నిత్యామీనన్ మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వరదయ్యపాళెం మండలం కాంబాకం గిరిజనకాలనీలో పర్యటించారు. స్థానికులు, గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని ఆడించారు. పల్లెటూరి పాటలతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘వండర్ విమెన్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది నిత్యా. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీ సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం
సెలవు రోజు సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం విషాదంలో మునిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. ఆయన మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. చిన్నారులిద్దరూ ప్రాణాలతో బయటపడిన సంఘటన వరదయ్యపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. తాగిన మైకంలో నడి రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తండ్రి పక్కకు లాగుతుండగా కారు ఢీ కొనడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శ్రీరంగరాజపురం మండలంలో జరిగింది. సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు): సరదా కోసం ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వరదయ్యపాళెం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవేడు మండలం చిగురుపాళెం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు తన స్వగ్రామమైన చిగురుపాళెంకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద సరదాగా గడిపారు. మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనే కారు నడుపుతూ తిరుగు పయనమయ్యారు. దరఖాస్తు గ్రామం వద్ద ప్రభాకర్ రెడ్డి గుండపోటుకు గురవడంతో, కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య రజితకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో బాధితులను సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రభాకర్ రెడ్డి మార్గమధ్యంలోనే మృతి చెందారు. భార్య రజిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు పిల్లలు బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. ఎస్ఐ పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
నగలు, నగదుతో ఉడాయించిన పెళ్లికొడుకు
చిత్తూరు: తెల్లారితే పెళ్లి.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతలోనే ఊహించని సంఘటన... నగలు, నగదుతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. దాంతో మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో చోటుచేసుకుంది. సాతంబేడుకు చెందిన రాజేశ్వరికి యానాదివెట్టుకు చెందిన రాజారామ్‌కు ఈ నెల 4వ తేదీ ఉదయం పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చితార్థం పెట్టుకున్నారు. వరుడు రాజారామ్ కోరిక మేరకు ముందుగానే 2లక్షల నగదు, 5తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి రాజారామ్ నగదు, బంగారంతో ఉడాయించాడు. దీంతో మనస్థాపం చెందిన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వధువు కుటుంబసభ్యులు వరదయ్యపాళెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం శ్రీకాళహస్తి-చెన్నై రహదారిపై బైఠాయించిన బాధితురాలి బంధువులు.... పరారైన వరుడిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. -
ప్రజలను పట్టించుకోవడం మానేశారు: జగన్